అన్వేషించండి

Trinayani Serial Today July 3rd: 'త్రినయని' సీరియల్: హాసినికి తిలోత్తమ వింత కానుక.. హారం వేసుకుంటే గాయత్రీదేవే ఆ పాప అని చెప్తేస్తుందా! 

Trinayani Serial Today Episode హాసిని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని నిజం తనతో చెప్పాలి అని తిలోత్తమ హాసినికి హారం పెళ్లిరోజు కానుకగా ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: తిలోత్తమను అందరూ తన చేతి గురించి ప్రశ్నిస్తారు. సర్పదీవిలో దీపం వెలిగించినప్పుడు అలా అయిందని అంటుంది. దాంతో విశాల్ కుడి చేతిలో ఉలూచి పాము పిల్లగా ఉంది కదా అమ్మ ఆ జ్యోతి ఎలా వెలిగించావ్ అని అడుగుతుంది. ఉలూచి కోరల్లోంచి మంట చిమ్మితే దీపం వెలిగించాను అంటుంది. 

విక్రాంత్: సుమన నువ్వు పాప కాళికి సాక్సులు తీసినప్పుడు తన కాళ్లు ఎలా ఉన్నాయి.
సుమన: నల్లగా బాగా కందిపోయి ఉన్నాయి. 
విక్రాంత్: కందిపోలేదు కాలిపోయావు.
విశాల్: అదేంట్రా అలా అంటావ్.
విక్రాంత్: బ్రో అమ్మ చెప్పినట్లు మంట ఉలూచి కోరల్లోంచి వచ్చుంటే నోరు కాలిపోయి ఉండాలి. సరే.. పాము పిల్ల కాబట్టి ఏం కాలేదు అనుకున్నా కాళ్లు నల్లగా మాడిపోయినట్లు ఎలా ఉంటాయి. 
నయని: నిజమే అత్తయ్యకి చేయి ఉలూచికి కాళ్లు అలా ఎలా కాలిపోతాయి. 
తిలోత్తమ: ఏంటి మీ పిచ్చి అనుమానాలు నా చేయి కాలి నేను బాధ పడుతుంటే పిల్ల కాళ్లు కాల్చి తీసుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 
విశాల్: అది కాదు అమ్మ ఉలూచి పాదాలు ఎందుకు అలా ఉన్నాయని అడుగుతున్నాం.
నయని: సరే ఆ సంగతి తెలియాల్సిన టైంలో తెలిసిపోతుంది కానీ.. మీ చేయి మణికట్టు వరకు కాలిపోతుంటే సైలెంట్‌గా చూస్తూ ఉన్నారా అత్తయ్య.
తిలోత్తమ: గావు కేకలు పెట్టాను. నీళ్లు తీసుకొచ్చి వేసేది ఎవరు. 
విక్రాంత్: అంత మంట పుడితే చేయి తప్ప ఒంటి మీద మరెక్కడా గాయం అయినట్లు లేదు. అంత మంటలకు నీ చీర మీద నిప్పులు పడి నీ ఒంటికి అంటుకోలేదు కదా అమ్మ.
విశాల్: విక్రాంత్ చెప్పేది ఏంటి అంటే రూపం అంతా మారిపోయినప్పుడు చేయి ఎందుకు మారలేదు అని.
తిలోత్తమ: మీరు నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నారా. నేను చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తారా ఏంటి. 
నయని: ఇక ఆ చేయి మామూలుగా మారడం అనేది జరగని పని.
సుమన: సర్జరీ చేసినా కూడా రాదా.
నయని: రాదు ఎన్ని వేషాలు వేసినా సరే ఆ చేయి అలాగే ఉంటుంది. 

ఏం సమాధానం చెప్పకుండా తిలోత్తమ వెళ్లిపోతుంది. విక్రాంత్ అందరితో తన తల్లి చేయి సర్ప దీవిలో కాలిపోలేదు అని ఇంకేదో జరిగింది అని అంటాడు. దానికి విశాల్ సరిగ్గా కొలత ప్రకారం కాల్చినట్లు ఉందని అంటాడు. నయని ఆలోచనలో పడుతుంది. ఇక నయని రాత్రి తిలోత్తమ గదిలోకి వెళ్తుంది. 

నయని: రూపం మార్చుకొని లలితాదేవిలా ఇంటికి వచ్చినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అత్తయ్య. మీ అమ్మ తోలు తీద్దామని వచ్చాను బావగారు.
తిలోత్తమ: వల్లభ నువ్వు కాసేపు బయటకు వెళ్లురా.
నయని: ఏం పర్లేదు ఉండనివ్వండి. మీ వారసుడు వింటాడు. మీ అమ్మ రూపం మారింది అని మనందరం అర్థం చేసుకొని తనని ఒప్పుకున్నాం. అయితే లలితాదేవి అమ్మగారిలా కూడా రూపం మార్చుకొని వస్తే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి. 
తిలోత్తమ: నువ్వు చాలా తెలివైనదానివి అని మరోసారి ఒప్పుకుంటాను నయని. నయని నువ్వు నా విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకు. దెబ్బతింటావ్.
నయని: అలవాటు అయిపోయింది. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. ఈలోపు బాబుగారికి కానీ అమ్మగారికి కానీ తెలిస్తే మిమల్ని ఏం చేస్తారో నేను అయితే చెప్పలేను. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికే మణికట్టు వరకు కాలిపోయింది తర్వాత చితిలో కాలిపోతారు పూర్తిగా..
తిలోత్తమ: వచ్చేసారి ఎవరి రూపంలో వస్తానో చచ్చినా కనిపెట్టలేరు. 

వల్లభ, హాసినిల పెళ్లి రోజు కావడంతో తిలోత్తమ ఓ గిఫ్ట్ బాక్స్ తీసుకొని దాని చుట్టూ అగరఒత్తులు తిప్పుతుంది. ఎందుకు అని వల్లభ అడుగుతాడు. దాంతో తిలోత్తమ తర్వాత చెప్తాను అని అంటుంది. ఇక ఆ గిఫ్ట్ హాసినికి ఇస్తాను అని తిలోత్తమ అంటుంది. అందరి ముందు తనకి హారం గిఫ్ట్ ఇస్తే నువ్వు తన మెడలో వేయమని అంటుంది. ఇక ఆ హారం హాసిని వెళ్లాక తనని తాను అద్దంలో చూసుకుంటే దిమ్మతిరిగి పోతుందని అంటుంది. హారం వేసుకున్న తర్వాత హాసినికి కళ్లు తిరిగినట్లు అయి ఇప్పటి వరకు తెలియని రహస్యం పేపర్ మీద రాసి ఇచ్చేస్తుందని అంటుంది.  

అందరూ హాల్‌లో కేక్ ఏర్పాటు చేసి డెకరేషన్ చేసి రెడీగా ఉంటారు. ఇంతలో పెద్ద బొట్టమ్మ వచ్చి పాపని అడుగుతుంది. సుమన సీరియస్ అవుతుంది. హాసిని, వల్లభలు కిందకి దిగుతారు. అందరూ హాసిని, వల్లభలకు శుభాకాంక్షలు చెప్తారు. ఇక సుమన నయని వాళ్లతో మీరు ఏం గిఫ్ట్ ఇవ్వడం లేదా అని అడుగుతుంది. తిలోత్తమ తన వెంట తీసుకొచ్చిన గిఫ్ట్ హాసినికి ఇస్తానని అంటుంది. ఇక తిలోత్తమ హాసినికి గిఫ్ట్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను నీ కొడుకే అని మిత్రతో చెప్పిన వివేక్.. లక్ష్మీని చూసేసిన జాను!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today May 29th: తొలిరోజు ఆఫీసులో అడుగుపెట్టిన యువరాజు...కోపంతో రుసరుసలాడిపోయిన నిషిక
జగద్ధాత్రి సీరియల్: తొలిరోజు ఆఫీసులో అడుగుపెట్టిన యువరాజు...కోపంతో రుసరుసలాడిపోయిన నిషిక
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, బాబుతో ఫోన్‌లో మాట్లాడిన విహారి! సహస్ర ఆ అబద్ధం చెప్పడానికి కారణమేంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, బాబుతో ఫోన్‌లో మాట్లాడిన విహారి! సహస్ర ఆ అబద్ధం చెప్పడానికి కారణమేంటి?
Godavari Serial Today May 29th: 'గోదావరి' సీరియల్: ఫొటోలు చింపేసి మురళీని మనసు ముక్కలు చేసిన అలకనంద! శుభలేక విసిరికొట్టిన శాంతి!
'గోదావరి' సీరియల్: ఫొటోలు చింపేసి మురళీని మనసు ముక్కలు చేసిన అలకనంద! శుభలేక విసిరికొట్టిన శాంతి!
Karthika Deepam 2 Serial Today May 29th: కార్తీకదీపం సీరియల్: జ్యోత్స్న పొగరు అణిచే కండీషన్ పెట్టిన సూరజ్! ఫ్లెక్సీలతో పాట్లు తప్పవా!
కార్తీకదీపం సీరియల్: జ్యోత్స్న పొగరు అణిచే కండీషన్ పెట్టిన సూరజ్! ఫ్లెక్సీలతో పాట్లు తప్పవా!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Embed widget