అన్వేషించండి

Trinayani Serial Today January 6th: సుమనను రివాల్వర్‌తో కాల్చి చంపేందుకు సిద్ధమైన నయని!

trinayani serial today Episode సుమన గాయత్రీ దేవి ఫొటోకి పిండం పెట్టడంతో కోపంతో నయని సుమనను చంపాలని రివాల్వర్ తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

trinayani today Episode: గాయత్రీ దేవి ఫొటోకి సుమన పిండం పెడుతుండడంతో నీకు ఏ హక్కు ఉంది అని హాసిని అడుగు తుంది. దీంతో సుమన శాస్త్రం తెలిసిన శంకర్‌శాస్త్ర మనవరాలిని కాబట్టి మగవారు చేయాల్సిన పనిని ఆడదాన్నిఅయిన నేను చేస్తున్నాను అంటుంది. ఎందుకంటే ఏదైనా ధర్మబద్ధంగా జరగాలి అంటుంది. ఇక విశాల్ ఇది ధర్మమా అని అడుగుతారు. దీంతో సుమన పునర్జన్మ ఎత్తిన గాయత్రి అక్కయ్య మరెప్పుడు వస్తుంది. ఆమె లేదు అంటూ విశాల్‌ని రెచ్చగొడుతుంది.

విశాల్: సుమన పునర్జన్మ ఎత్తిన మా అమ్మకి శార్థకర్మలు జరిపించడం తప్పా.. కాదా..
సుమన: పునర్జన్మ ఎత్తిన మీ అమ్మ పసిగొడ్డుగానే చనిపోయి ఉంటుందని నేను పిండం పెడుతున్నాను అని తెలుసుకోండి ముందు అంటుంది. దీంతో విశాల్ సుమన చెంప పగలకొడతాడు. 
విక్రాంత్: అది ఇంకొటి ఇచ్చేయ్ బ్రో.
సుమన: మీరేం మగాడు అండీ పెళ్లాన్ని పర పురుషుడు కొడుతూ ఉంటూ మళ్లీ కొట్టమంటారు.
విక్రాంత్: పరపురుషుడు ఏంటే బ్రో మీ అక్క మొగుడు. పిచ్చి కుక్కల్ని కొట్టే హక్కు తనకు ఉంది. మరోవైపు నయని స్పీడుగా మేడ మీదకు వెళ్తుంది. 
తిలోత్తమ: రేయ్ అలా ఎలా కొడతాడు రా.. 
ధురందర: నిజానికి విశాల్ ఆడవాళ్ల మీద చేయి చేసుకోడు ఇవాళ సుమన చెంప పగలకొట్టాడు అంటే ఎంత కోపం వచ్చుంటుందో అర్థం చేసుకోండి. 
సుమన: గాయత్రీ అత్తయ్య ఉంటే మనకి చూపించమనండి.
హాసిని: ఇప్పుడు చూపించలేము.
తిలోత్తమ: సుమనను పిచ్చిది అని కొడుతున్నారు కానీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు.
సుమన: పైగా నన్ను కొట్టి నా నోరు మూయించాలి అని చూస్తున్నారు అత్తయ్య.
నయని: ఆపేయ్ ఇంకా.. గన్ పట్టుకొని రావడంతో అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక సుమనకు రివాల్వర్ గురి పెట్టి.. ఎవరు కదిలినా కాల్చి పారేస్తా పిన్ని.. మీలో ఎవ్వరు ముందుకు వచ్చినా ముందు చచ్చిపోయేది మాత్రం సుమనే. మా అమ్మ కన్న ఇద్దరు ఆడబిడ్డల్లో ఒకరు నేను రెండోది సుమన. అది అందరిలా కలిసి మెలసి ఉండే రకం కాదు అని పిచ్చి పట్టి మనిషే కాకుండా పోయింది అని తనని రివాల్వర్‌తో షూట్ చేసి చంపేశారు ఈరోజు. పంతులు గారు విక్రాంత్ బాబు తెలుసా మీకు. అతని భార్య ఇందాకే చనిపోయింది. పది రోజుల దాకా శవాన్ని ఇంట్లో ఉంచడం మంచిది కాదు కాబట్టి శార్థకర్మలు కూడా ఈరోజే ఇప్పుడే జరిపించేయండి. రేపటి నుంచి చచ్చిపోయిన దాని వస్తువులు జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. 
విక్రాంత్: పంతులు గారు వచ్చి కూర్చొమంటారు.
పంతులు: ఒక్క నిమిషం బాబుగారు భయంగా ఉంది.
సుమన: నేను బతికే ఉన్నాను అక్క చచ్చిపోయాను అంటావేంటి.
నయని: నిన్ను నేను షూట్ చేశాను నువ్వు చచ్చిపోయావు.
సుమన: అక్క ఎప్పుడు చచ్చి పోయాను రివాల్వర్ నీ చేతిలోనే ఉంది కదా.. 
నయని: ఇది పేలలేదు అని ఫీలవుతున్నావా.. ఇవాళ నువ్వు చావడం ఇక్కడ నీకు పిండం పెట్టడం ఖాయం అయ్యాక ఇంకెందుకు అనుమానం. 
సుమన: అక్కా వద్దు అక్క నన్ను చంపొద్దు. నా బిడ్డ ఉలూచి అన్యాయం అయిపోతుంది అక్క. అనాథ అవుతుంది అక్క.
నయని: దగ్గరకు రావొద్దు. నువ్వు ఎందుకు బతకాలి.
సుమన: నా బిడ్డ కోసం బతకాలి.
నయని: మరి నేనెందుకు నా బిడ్డ కోసం బతికుండకూడదు. నా పెద్ద కూతురు గాయత్రి అమ్మ వస్తారు అన్న నమ్మకంతో ఎదురు చూడడంలో అర్థం లేదని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావే.. 
హాసిని: అడుగుతుంది కదా చిట్టీ సంతృప్తిగా సమాధానం అయినా ఇవ్వు లేకపోతే నీ ప్రాణాలు అయినా ఇవ్వు.
సుమన: బావగారు మీరు నన్ను కొట్టడంతో అర్థముంది. ఎందుకు కొట్టారు అని అడగను. దయచేసి మా అక్కని నన్ను చంపొద్దని చెప్పండి. మా అక్క మొండితనం గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూశాను. తాను ఒక నిర్ణయానికి వచ్చింది అంటే అది అమలు అయేంత వరకు వదలదు బావగారు చెప్పండి.
విశాల్: నిన్ను కొట్టాను అన్న ఫీలింగ్ ఇంకా నన్ను వెంటాడు తుంది సుమన.  మా అమ్మని కన్న నయని పాదాలు పట్టుకొని ప్రాధేయపడు.
నయని: ఆగు అక్కడే ఆగు దగ్గరకు వచ్చే కొద్ది నీ బాడీలోకి చొచ్చుకుపోయే బులెట్ల సంఖ్య పెరుగుతుంది. ఎవరూ ఏం అనుకోకండి నన్ను ఆపడానికి ఎవరూ ప్రయత్నించండి. విక్రాంత్ బాబు ఈ విషయంలో మీరు నన్ను మన్నించండి. 
విక్రాంత్: అయ్యో వదినా మీరు నాకు అలా అడగటం ఏంటి. ఇన్నాళ్లూ పాపిష్టి బతుకు బతికిన నా భార్య సుమన సుమంగళిగా వెళ్లిపోయినప్పుడు ఆ మాత్రం పుణ్యం అయినా కట్టుకుంది అనుకుంటాను. పంతులు గారు మీరు రండి పిండం పెడతాను.
నయని: గాయత్రీ అమ్మగారు బతికే ఉన్నారని అందరూ నమ్ముతున్నప్పుడు ఏ ఒక్కరికీ చెప్పకుండా ఇలాంటి పిచ్చి తంతు చేసినందుకు నువ్వు బలి అవుతున్నావు. ఇంకోసారి నేను కన్న నా తొలిబిడ్డ గాయత్రీ దేవి గారు లేరని ఎవ్వరన్నా తర్వాత వారి ప్రాణాలే తీసేస్తాను. ఈ విషయంలో మొట్టమొదటి నేలకొరిగి పిచ్చి కుక్క చావుని కళ్లారా చూడండి.. అంటూ షూట్ చేయబోయి ఉలూచి ఏడుపు విని ఆగిపోతుంది నయని.. ఇక కోపంతో కిందకి కాల్చడంతో గాయత్రీ దేవి ఫొటోకి ఉన్న బొట్టు, దండ, దీపం అన్నీ చెరిగిపోతాయి. 

పావనామూర్తి, వల్లభ ముందు తాగడానికి ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఎద్దులయ్య వస్తాడు. ఇక హాసిని కూడా వస్తుంది. ఎందుకు తాగుతున్నావు అని అడిగితే నయని విశ్వరూపం చూసి భయపడి తాగుతున్నాడని ఎద్దులయ్య అంటాడు. మరోవైపు సుమన తన గదిలో ఓ మూల కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విశాల్ సెటైర్లు వేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: అమ్మాయిని అలా టచ్ చేస్తావా? ధనుష్ మూవీ ఈవెంట్‌లో ఆకతాయిని చితకబాదిన యాంకర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget