Trinayani Serial Today January 20th: 'త్రినయని' సీరియల్: 4 రోజుల్లో తిలోత్తమ ప్రాణాలు గోవింద.. కరెంట్ వైర్లతో పాప మొదలెట్టేసిందిగా!
Trinayani Today Episode గాయత్రీ పాప కరెంట్ వైర్లతో షాక్ పెడతానంటూ తిలోత్తమకు చెమటలు పట్టించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today January 20th: 'త్రినయని' సీరియల్: 4 రోజుల్లో తిలోత్తమ ప్రాణాలు గోవింద.. కరెంట్ వైర్లతో పాప మొదలెట్టేసిందిగా! trinayani serial today january 20th episode written update in telugu Trinayani Serial Today January 20th: 'త్రినయని' సీరియల్: 4 రోజుల్లో తిలోత్తమ ప్రాణాలు గోవింద.. కరెంట్ వైర్లతో పాప మొదలెట్టేసిందిగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/20/09e1af98e256eaaee8724303a0d1d3bd1737344313295882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode నయని ఇంటికి వచ్చిన విశాలాక్షి తిలోత్తమకు ప్రాణ గండం ఉందని చెప్తుంది. అందరూ తిలోత్తమని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. హాసిని కాఫీలో విషం కలిపి తిలోత్తమకి ఇస్తుంది. ఇంతలో నయని వాళ్లు తాగనివ్వకుండా చేస్తారు. నయని, విక్రాంత్, బామ్మ వాళ్లు హాసిని దగ్గరకు వెళ్లి విషం ఎందుకు కలిపావని అడుగుతారు. ఇంతోల విశాలాక్షి అక్కడికి వస్తుంది.
విశాలాక్షి: అసలు విషయం తెలీదు చిన్నాన్న. నాలుగు రోజుల్లో గాయత్రీ పాప చేతిలో హతం అయ్యే తిలోత్తమమ్మ ఇక తప్పించుకోలేదని అన్నాను కదా కానీ పెద్దమ్మ ఆ గండాన్ని తప్పించి ఆ తప్పు తన మీద వేసుకొని పాప మీద ఏం తప్పు పడకుండా చేయాలని అనుకుంది.
హాసిని: అది తప్పు ఎందుకు అవుతుంది.
బామ్మ: హాసినమ్మా డాక్టర్ చేయాల్సిన పని డాక్టరే చేయాలి. పోలీసుల డ్యూటీ డాక్టర్లు చేయగలరా నువ్వు చేయాల్సిన పని అలా ఉంది.
నయని: అక్క అత్తయ్యతో పాటు నీ భర్త ప్రాణాలు కూడా ఆపదలో పెట్టాలని చూశావ్ నీ మంగళసూత్రం పైన ఎందుకు నీకు అంత చిన్న చూపు అక్క.
హాసిని: అలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
విశాలాక్షి: పెద్దమ్మా నీకో విషయం చెప్పనా నువ్వు నేరుగా యముడిని తీసుకొచ్చి వాళ్లని తీసుకెళ్లపోవాలని చెప్పినా వాళ్లు తీసుకెళ్లరు. విధిని నువ్వు నీ చేతిలోకి తీసుకెళ్లాలి అని ప్రయత్నిస్తే నయని అమ్మ విషయం లో ఏం జరిగిందో అదే జరుగుతుంది.
బామ్మ: ఏం జరిగింది.
నయని: అమ్మ విశాలాక్షి ఆ విషయం ఎందుకు.
విశాలాక్షి: త్రినేత్రి స్థానంలోకి నువ్వు నీ స్థానంలోకి త్రినేత్రి రావడానికి యమధర్మరాజు కారణం కాదు అని అంటున్నానమ్మా.
విక్రాంత్: నాకు ఏం అర్థం కావడంలేదు.
నయని: మనసులో.. విశాలాక్షికి ఆ విషయం ఎలా తెలుసు తనకు అంత శక్తి ఎలా వచ్చింది.
విశాలాక్షి: ఎలా అంటే నేను విశాలాక్షిని కదా.
బామ్మ: పిల్ల మాటల్లో ఏదో అర్థముందని అనిపిస్తుందమ్మా.
తిలోత్తమ: సుమన నాలుగు రోజుల్లో నేను నిజంగానే పోయాను అనుకుంటే నా కొడుకుని నువ్వు చూసుకుంటావా.
సుమన: పెద్ద బావగారిని నేను చూసుకుంటే బాగోదు అత్తయ్య.
దురంధర: హేయ్ అర్థం చేసుకోవా వదిన చెప్పింది తనకు ఏమైనా అయితే విక్రాంత్‌ని చూసుకోమని అంటుంది.
వల్లభ: నీకు ఏం కాకుండా నా ప్రాణాలను కూడా అడ్డుపెట్టి చూసుకుంటున్న నన్ను వదిలేసి వాడి కోసం జాగ్రత్తలు చెప్తున్నావా మమ్మీ. నేను అంటే నీకు ఇష్టంలేదు.
తిలోత్తమ: అది కాదురా నాకు ఏమైనా నా పక్కనే నువ్వు ఉంటావ్ అంటే నేను పోతే నువ్వు పోతావ్. ఈ నాలుగు రోజేలే నేను ఉంటాను అని విశాలాక్షి చెప్పింది కదా.
దురంధర: తను చెప్పినట్లు నాలుగు రోజులు గడిచిపోతే ఏం కాదు కదా.గండం తప్పించండి. అలా జరగకుండా చూడండి.
సుమన: పిన్ని కరెక్ట్‌గా చెప్పింది అత్తయ్య మీకు గండం అంటే మా అక్క చెప్పదు. పైగా గాయత్రీ పాప వల్ల అంటే అస్సలు చెప్పదు. పిన్ని చెప్పినట్లు జాగ్రత్తగా ఉందాం.
గాయత్రీ పాప ఆడుకుంటుంటే బామ్మ ఆడిపిస్తుంది. తిలోత్తమ వచ్చి పాపని శత్రువు అని అంటుంది. ఎందుకు అలా అంటారని హాసిని అడిగితే తన ప్రాణాలు తీయాలని చూసేదాన్ని శత్రువు అని అంటారు కదా అంటుంది. గాయత్రీ పో అని అరుస్తుంది తిలోత్తమ. దాంతో నయని వాళ్లు వచ్చి పాప మీద అరుస్తారేంటి అంటుంది. పాప సైలెంట్‌గా వెళ్లిపోతుంది. ఇక పాప కరెంట్ వైర్ తీసుకొని వస్తుంది. ఆ వైరు నుంచి కరెంట్ వస్తూ ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. పాపని వైరు వదిలేయమని చెప్పినా వినదు పాప. తిలోత్తమ ప్రాణం తీయడానికే తీసుకొచ్చిందని అందరూ అంటారు.
పాప వైరు పట్టుకొని తిలోత్తమ వైపు వెళ్తుంది. దగ్గరకు రావొద్దని తిలోత్తమ అరుస్తుంది. భయంతో వెనక్కి వెళ్తుంది. తిలోత్తమ, వల్లభ ఇద్దరూ వెనక్కి వెళ్తూ గోడ దగ్గర నిల్చొంటారు. తిలోత్తమ భయంతో కేకలు వేస్తారు. పాప దగ్గరగా వెళ్తుంది. పాప వాళ్ల మీదకి వైర్ విసిరేటైంకి కరెంట్ పోతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇలాంటి పనులు చేయొద్దని పాపని నయని తీసుకెళ్లిపోతుంది. గండం తప్పేలా లేదని అందరూ తిలోత్తమతో అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)