అన్వేషించండి

Trinayani Serial Today January 13th: ‘త్రినయని’ సీరియల్ : నయని బాడీని చూపించిన గాయత్రి – బాడీని చూసి గట్టిగా అరిచిన వల్లభ

Trinayani Today Episode:  ఇంట్లో ఉన్న బాడీని చూపించమని తిలొత్తమ్మ అడగ్గానే.. గాయత్రి పాప ఇల్లంతా తిప్పి నయని బాడీని చూపించడంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Trinayani Serial Today Episode:  నయని చెప్పినట్టే అందరూ నడుచుకోండని గురువు చెప్తాడు. విక్రాంత్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో మీరు మా వెంట నడిస్తే మాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందని తిలొత్తమ్మ చెప్తుంది. అలాగే కానీ ఆ దేహాన్ని చూపించేది నేను కాదు అంటాడు గురువు. ఎవరు చూపిస్తారని వల్లభ అడగ్గానే.. గాయత్రి చూపిస్తుందని చెప్తాడు గురువు.

నయని: స్వామి గాయత్రి పాపనా..?

గురువు: అవును నయని.. తనకైతే ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు..

తిలొత్తమ్మ: గాయత్రి నిర్జీవంగా ఉండే దేహాన్ని చూపించు..

అనగానే నయని గాయత్రిని కిందకు వదలిపెడుతుంది. గాయత్రి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. మమ్మీ వెళ్తుంది మమ్మీ మనం వెళ్దాం పదండి అని తిలొత్తమ్మ, వల్లభ మిగతా వాళ్లు గాయత్రిని ఫాలో అవుతారు. తర్వాత నయని టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంది.

దురందర: ఇప్పుడు చేతులు నొక్కేసుకుంటూ.. వేళ్లను విరిసేసుకుంటూ ఉంటే లాభం లేదు నయని..

నయని: నన్ను ఆలోచించుకోనివ్వు పిన్ని..

దురందర: అంత టైం మనకు ఎక్కడుంది.

విక్రాంత్: అత్తయ్యా వదినను నువ్వు టెన్షన్‌ పెట్టకు..

దురందర: ఇంకెక్కడి వదిన అయ్యా వాళ్లు వెళ్లి ఇల్లంతా చెక్‌ చేస్తున్నారు. పైగా కన్నకూతురే ముందుండి తీసుకెళ్తుంది.

విక్రాంత్‌: గాయత్రి వెళ్లడం.. గురువు గారు కూడా మా అమ్మవాళ్ల మాట విని రావడం.. నాకు ఆశ్చర్యంగానే ఉంది.

దురందర: ఇప్పుడు అవాక్కవడానికి కూడా సమయం లేదు.

విక్రాంత్‌: ఏం చేయమంటావు అత్తయ్యా..వదిన బాడీని బయటకు తీసుకెళితే అందరి ముందు మనమే బయట పెట్టినట్టు అవుతుంది

దురందర: పోనీ ఇంకెక్కడైనా దాచిపెడితే..

విక్రాంత్‌: ఉన్నచోటు నుంచి ఇంకో చోటికి మార్చే టైం ఎక్కడుంది.

నయని: విక్రాంత్ బాబు స్వామిజీ మనల్ని ఇరికించడానికి రాలేదు. మనకు సాయం చేయడానికే వచ్చారనిపిస్తుంది.

దురందర: ఇంతలా కంగారుపడుతుంటే నీకు కనికరం చూపించినట్టు ఉందా.? తల్లి.

నయని: ఈ తల్లిని కాపాడటానికే గాయత్రి పాప వాళ్లను తీసుకుని వెళ్లింది పిన్ని.

దురందర: నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్తం అయితే నాకు చెంపదెబ్బ కొట్టు.

విక్రాంత్‌: అత్తయ్యా నువ్వు ఉండు.. వదిన మీకు గురువు గారు ఏమైనా చెప్పారా..?

నయని: లేదు కానీ గాయత్రిని తీసుకుని వెళ్లారు అంటే ఈ పాటికి నేరుగా నా దేహం ఉన్నచోటికే వెళ్లి ఉండాలి.       

దురందర: అలా వెళ్లలేదు. ఇళ్లంతా రౌండ్లు తిరుగుతున్నారు.

నయని: కరెక్టు నేను అనుకున్నది నిజమే..

దురందర: ఏం అనుకుంటున్నావు నయని మాక్కూడా కాస్త చెబితే నీకు హెల్ప్‌ చేస్తాము కదా..?

నయని: కచ్చితంగా చేయాలి పిన్ని. నేను వెంటనే వెళ్లి చీర మార్చుకుని వస్తాను.

దురందర: విడిచిన చీర ఉతికి వేయమని చెప్తాను.

విక్రాంత్‌: అబ్బబ్బా నువ్వు కాస్త ఆగు అత్తయ్యా.. వదిన మీరు చెప్పండి.

నయని: నేను వచ్చేలోపు మీరు ఇద్దరూ వెళ్లి కోమాలో ఉన్న నా దేహాన్ని మార్చేయండి. ఈ లోపు నేను వచ్చి కోమాలో ఉన్నట్టు నటిస్తాను.

అని నయని చెప్పగానే సరేనని విక్రాంత్‌, దురందర వెళ్తారు. మరోవైపు ఇళ్లంతా తిప్పిన గాయత్రి పాప ఒక రూంలోకి తీసుకెళ్తుంది. గాయత్రి వెనక వెళ్లిన వాళ్లందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. హాసిని ఏముందమ్మా అక్కడ అని అడుగుతుంది. అమ్మా అని గాయత్రి చెప్తుంది. అమ్మా మీ అమ్మా హాల్ లో ఉంది కదా అంటుంది సుమన. ఇంతలో పక్కనే ఉన్న దుప్పటి ఒకటి తెరచి షాక్‌ అవుతాడు వల్లభ. వల్లభ సౌండ్‌కు ఏమైందని విక్రాంత్‌ పరుగెత్తుకొస్తాడు. నయని బాడీని చూసిన హాసిని ఇక్కడ పడుకుందేంటి మా అక్క అని అడుగుతుంది. పడుకోలేదని కన్ను మూసిందని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
Embed widget