Trinayani Serial Today August 8th: 'త్రినయని' సీరియల్: నయని మాటలకు అర్థం ఏంటి? గాయత్రీ దేవి తిలోత్తమ కోసం ఏం చెప్పబోతుంది?
Trinayani Serial Today Episode గాయత్రీదేవి ఆత్మ వచ్చి గతంలో తిలోత్తమ చేసిన కొంటె పనులను చెప్పనుందని నయని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode తిలోత్తమ, సుమన, వల్లభలు కడుపు పట్టుకొని విలవిల్లాడిపోతారు. కడుపు నొప్పి తగ్గించమని విశాల్ అంటే ముగ్గురి కడుపు మీద తన చేతి కర్రతో కొట్టాలని పోచమ్మ అంటుంది. కొట్టి చంపేస్తావని సుమన, తిలోత్తమ అడ్డుకుంటే పది నిమిషాలు తర్వాత మీరే పోతారని పోచమ్మ అంటుంది. తాను వెళ్లిపోతానని పోచమ్మ అంటే వల్లభ ఆపుతాడు. నయని పోచమ్మతో కాస్త చూసుకొని కొట్టమని అంటుంది. కొట్టినప్పుడు అమ్మ అనమని పోచమ్మ చెప్తుంది. ముందు వల్లభని పోచమ్మ కొడుతుంది. వల్లభ కాసేపు అలా ఉండిపోతాడు. వల్లభని కొట్టిన దెబ్బ చూసి తిలోత్తమ, సుమన వెళ్లడానికి భయపడతారు. వల్లభ మాత్రం తేరుకొని నాకు తగ్గిపోయిందని గెంతుతాడు. ఇక సుమన కాస్త చూసి కొట్టమని వెళ్తుంది.
పోచమ్మ తన చేతి కర్రతో సుమనకు ఒక్కటిస్తుంది. సుమన గిరగిరా తిరిగి సోఫాలో కూర్చొండిపోతుంది. తర్వాత తగ్గిపోయిందని అంటుంది. తర్వాత తిలోత్తమ వెళ్తుంది. తిలోత్తమకు కూడా పోచమ్మ ఒక్కటిస్తుంది. తిలోత్తమకు కూడా కడుపు నొప్పితగ్గుతుంది.
పోచమ్మ తిలోత్తమ దగ్గరకు వెళ్లి వినాశనాన్ని కోరుకున్నంత సేపు నరకాన్ని చూస్తావు. జాగ్రత్త వస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక సుమన గదిలో ఉంటే విక్రాంత్ మీరు ఏదో చేశారు అందుకే ఇలా అయిందని అంటాడు. విక్రాంత్ కనిపెట్టేయడంతో సుమన షాక్ అవుతుంది. ఇక తిలోత్తమ, వల్లభలు డీలా పడిపోయి కూర్చొంటే హాసిని వాళ్ల కోసం కషాయం రెడీ చేస్తుంటుంది. ఇద్దరికీ కషాయం ఇస్తుంది. తిలోత్తమ హాసినిని వెళ్లిపోమని అంటుంది . ఇద్దరూ కషాయం తాగి ఇబ్బంది పడతారు. హాసినిని పిలిస్తే హాసిని హడావుడిగా వస్తూ చేతిలో ఉన్న రాడ్‌ని వాళ్ల కాళ్ల మీద పడేస్తుంది.
నయని: ఒకప్పుడు మీరు జూస్ ఇచ్చినా సరే అది తాగి గాయత్రీ అమ్మగారు ఇలాగే కేకలు పెట్టారు అత్తయ్య. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తు చేస్తున్నా బావ గారు మీ అమ్మకి.
విశాల్: కాస్త క్లారిటీగా చెప్పు నయని.
నయని: ఒకసారి అమ్మగారికి గొంతు నొప్పి వస్తే పీఏగా ఉన్న అత్తయ్య ఇలాగే కషాయం చేసి ఇచ్చారు అది తాగాక గొంతే కాదు గుండె కూడా మండిపోతుందని అమ్మగారి పెద్ద పెద్దగా అరిచారు. ఇది జరిగింది ఆఫీస్‌లో అందుకే మీకు తెలీదు బాబుగారు.
హాసిని: అంటే కషాయానికి బదులు ఇంకేమైనా ఇచ్చుండాలి లేదంటే ఏమైనా కలిపుండాలి.
తిలోత్తమ: ఏయ్ నేను ఎందుకు అలా చేస్తాను. విశాల్ మీ ఆవిడ మాటలు విని నన్ను అనుమానిస్తే నాకు బాధగా ఉంటుంది. అయినా నయనికి ఏం తెలుసు.
నయని: అమ్మగారే చెప్తారు. అమ్మగారు రేపు రావొచ్చు అప్పుడు తిలోత్తమ అత్తయ్య చేసిన కొంటె పనులు అన్నీ అందరికీ చెప్తా అన్నారు. అత్తయ్య రెడీగా ఉండండి.
తిలోత్తమ: ఏం చేస్తుంది నయని.
ఉదయం ఇంట్లో అందరూ పాత్రలు తీసుకొచ్చి హాల్‌లో పెడతారు. ఇంతలో విశాలాక్షి, డమ్మక్క వస్తారు. విశాలాక్షి చేతిలో కలువ పువ్వు తీసుకొని వస్తుంది. తిండికి వచ్చారని సుమన అంటే నయని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!