అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 28th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్, జనార్థన్‌కు అడ్డంగా బుక్కైన మహాలక్ష్మీ, లాస్ట్ వార్నింగ్.. మొదటి సారి మహాలా ఆలోచిస్తున్న సీత!

Seethe Ramudi Katnam Today Episode రౌడీని మహాలక్ష్మీనే పంపించిందని తెలుసుకున్న రామ్, జనార్థన్ మహాకి ఫుల్ కోటింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీకి విద్యాదేవినే సుమతి అని అనుమానం వచ్చి రౌడీతో టీచర్‌కి కాల్ చేయించి సుమతి అని తెలుసని ఆధారాలు ఉన్నాయని రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. టీచర్ డబ్బులు తీసుకొని బయల్దేరుతుంది. సీత కాల్ రికార్డ్ విని టీచర్ ఎవరితో మాట్లాడింది ఎవరు బెదిరించారు. ఎక్కడికి వెళ్తుందని అనుకుంటుంది.  

సీత: తను సుమతి అత్తమ్మ కాకపోతే ఎందుకు అంత హడావుడిగా వెళ్లింది. తాను సుమతి అత్తమ్మ కాకపోతే గట్టిగా చెప్పి ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. డబ్బులు తీసుకొని వెళ్లింది అంటే టీచర్ ఏదో దాస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. వెంటనే ఈ అడ్రస్‌కి వెళ్లాలి.
రామ్: సీత నువ్వు టీచర్ గదిలో ఏం చేస్తున్నావ్.
సీత: టైంకి వచ్చావ్ మామ పద వెళ్దాం టీచర్ గురించి నిజాలు తెలుసుకోవాలి. 

రామ్, సీతలు కారులో బయల్దేరుతారు. రామ్ ప్రశ్నలు వేస్తే కాసేపట్లో చిక్కు ముడి వీడిపోతుందని అంటుంది. ఇక మహాలక్ష్మీ కూడా సుమతి ఆటోని ఫాలో అవుతుంది. మరోవైపు శివకృష్ణ విద్యాదేవి ఫొటో ఫ్రేమ్ కొట్టిస్తాడు. ఇంటికి తీసుకొచ్చి విద్యాదేవిలా ఉన్న తన చెల్లి సుమతి కొత్త రూపాన్ని గొడకు పెట్టాలని అంటాడు. ఫోటో ఇంట్లో పెట్టడం వల్ల అందరికీ నిజం తెలిసిపోతుందని అంటుంది. ఆ ఫొటో మహాలక్ష్మీ చూసినా సీత చూసినా నిలదీస్తారని అంటుంది లలిత. దాంతో శివకృష్ణ ఫొటో దాచేస్తాడు. సీన్ కట్ చేస్తే విద్యాదేవి రౌడీ దగ్గరకు వెళ్తుంది. నేను సుమతి ఏంటి నేను సుమతి అని ఎవరు అనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడే మహాలక్ష్మీ అక్కడికి వస్తుంది. సీత, రామ్‌లు కూడా వస్తారు. టీచర్, పిన్ని వచ్చారేంటి అని సీతని అడుగుతారు..

మహాలక్ష్మీ: ఏంటి విద్యాదేవి గారు ఏదో పని ఉందని అన్నారు ఇక్కడికి వచ్చారు. ఇతను ఎవరు. మీ బంధువా, ఫ్రెండా లేక మీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తా.
విద్యాదేవి: మీరు ఎందుకు వచ్చారు.
మహాలక్ష్మీ: మీరు కంగారుగా రావడం చూసి  ఏం ప్రమాదం వచ్చిందా అని వచ్చాను. మీకు బెదిరించారని వచ్చా. ఇంతకీ మీరు సుమతినే కదా. కచ్చితంగా మీరు సుమతినే. లేకపోతే వీడు ఫోన్ చేయడంతో మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు పైగా డబ్బుతో వచ్చారు.
విద్యాదేవి: నేను సుమతి కాదు.
మహాలక్ష్మీ: మీరే సుమతి. మీరు కాకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చారు చెప్పండి.
జనార్థన్: నేను చెప్తాను. 
రామ్: నాన్న కూడా ఎందుకు వచ్చారు సీత.
మహాలక్ష్మీ: జనా నువ్వు వచ్చావేంటి మీరు కూడా వచ్చారేంటి
సీత: మీరు ఎందుకు వచ్చారో మేం అందుకే వచ్చాం. అసలేం జరుగుతుంది ఇక్కడ.
జనార్థన్: నేను చెప్తా ఇందాక విద్యాదేవి ఆఫీస్‌లో ఉన్న నాదగ్గరకు వచ్చారు విషయం నాతో చెప్పారు. ఈవిడ నిజంగా సుమతి అయితే బెదిరింపు విషయం నాకు చెప్పరు కదా. అందుకే వీడి విషయం తేల్చాలని వచ్చా.

రామ్ రౌడీని కొట్టి ఎవరు చేయించారని అడుగుతాడు. మహాలక్ష్మీ వద్దని రాన్‌డమ్‌గా చేసుంటాడని అంటుంది. కానీ అలా కాదు అని సీత, విద్యాదేవి ఒప్పుకోరు దీంతో రౌడీ అంతా మహాలక్ష్మీనే చేసిందని చెప్తాడు. షాక్ అయిపోతారు. జనార్థన్ ఇదంతా చేసిందా నువ్వా అని మహాలక్ష్మీని తిడతాడు. ఇదంతా పద్ధతిగా లేదని రామ్ కూడా తిడతాడు. మా అమ్మ గురించి మేం తెలుసుకుంటాం ఇంకోసారి ఇలా చేయొద్దని తండ్రీకొడుకులు తిడతారు. టీచర్‌ని తీసుకొని రామ్ సీతలు వెళ్లిపోతారు. జనా కూడా వెళ్లిపోతాడు. మరోవైపు రాత్రి రామ్ సీతతో అందరూ ఒకేలా టీచర్ గురించి ఆలోచిస్తున్నారని అంటాడు. మా పిన్నిలా నువ్వు కూడా టీచర్‌ని అనుమానిస్తున్నావ్ అంటాడు. దానికి సీత కూడా ఆవిడే సుమతి అత్తమ్మ అని అనుమానం వస్తుందని అంటుంది. అమ్మ రూపం అది కాదు కదా అని సీత అంటే మారు రూపంలో తను ఇక్కడుంటే అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాంచన ఇంట్లో కావేరి, భర్తని పంచుకుంటారా? బావ కావాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న జ్యోత్స్న!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Embed widget