అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 27th: సీత మేనత్తగా గృహలక్ష్మి తులసి ఎంట్రీ.. సీతను గది నుంచి బయటకు గెంటేసిన రామ్!

Seethe Ramudi Katnam Serial Today Episode సీత తన భర్తతో కలుద్దామని కలలు కంటే రామ్ వచ్చి సీతని వేరే గదిలో పడుకోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి జలజతో మధుమిత గురించి మాట్లాడుతుంది. అదే టైంలో సీత అక్కడికి వస్తుంది. ఫోన్‌లో మా అక్క గురించి ఎవరితో మాట్లాడుతున్నారు అత్తయ్య అని అడుగుతుంది. నా ఇష్టం నీకు ఎందుకు అని మహాలక్ష్మి అంటుంది. దీంతో సీత మా అక్క గురించి అయితే నాకు కచ్చితంగా చెప్పి తీరాలి అంటుంది సీత.

మహాలక్ష్మి: నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి మధుమిత గురించి అడిగింది. మధుమిత పర్మినెంట్‌గా నా కోడలిగి నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. 
సీత: ఎవరు ఆ ఫ్రెండ్..
మహాలక్ష్మి: ఎవరు అయితే నీకు ఎందుకే..
సీత: నాకు తెలియాలి. మా అక్క త్వరలో మా బావ దగ్గరకు వెళ్తుంది అని చెప్తాను.
మహాలక్ష్మి: నువ్వు చెప్తే మా ఫ్రెండ్స్ నమ్ముతారా..
సీత: అసలు మీరు మీ ఫ్రెండ్స్‌తోనే మాట్లాడారా అని నాకు డౌట్‌గా ఉంది. మీ ఫోన్ ఇవ్వండి మీకు ఏ నెంబరు నుంచి ఫోన్ వచ్చిందో చూస్తా..
మహాలక్ష్మి: నా ఫోనే చూస్తావా నీ ఒళ్లు ఎలా ఉంది సీత..
సీత: నా ఒళ్లు సరిగానే ఉంది. మీ బుద్ధే బాలేదు అని సీత అంటుంది. తర్వాత మహాలక్ష్మి దగ్గర నుంచి ఫోన్ లాక్కోడానికి ప్రయత్నిస్తుంది. మహాలక్ష్మి జలజ నెంబరు డిలీట్ చేసేస్తుంది. అత్తయ్య మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను మా మామని విడదీయలేరు. అక్కని మామని ఒక్కటి చేయలేరు. 
మహాలక్ష్మి: మీ అక్కని ఇక్కడికి తీసుకొచ్చిందే అందుకే. నువ్వు ఏం చేసినా నా ప్లాన్‌ని ఆపలేవు. ఇక సీత తన భర్తతో కలిసే పడుకుంటున్నాను అని త్వరలోనే మిమల్ని నానమ్మ చేస్తాను అని సీత అంటుంది. తర్వాత ఏం చేయలేరు అని ఆ రోజు కోసం వెయిట్ చేయండని మహాలక్ష్మికి సీత చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు శివకృష్ణ, లలిత బాధగా ఇంటికి వస్తారు. మధు వల్ల మనస్శాంతి లేదు అని శివకృష్ణ చెప్తాడు. జలజ తమ, మధుల పరువు తీసేస్తుంది అని తప్పుగా చెప్తుంది అని లలిత అత్తతో చెప్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి సుమతి వల్లే మధుమిత ఇలా అయింది అని శివకృష్ణ అంటాడు. సుమతి గురించి మాట్లాడటంతో శివకృష్ణ తల్లి బాధ పడుతుంది. సుమతి ఫొటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. లలిత వాళ్లు వచ్చి అత్తయ్యని ఓదార్చుతారు. 

సీత: తనలో తాను.. అత్తమ్మ బతికి ఉంటే ఇలా జరిగేది కాదు. తానే దగ్గరుండి నాకు మామకు కార్యం జరిపించేది. ఈ ఇంట్లో నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా అత్తమ్మ ఫొటోతో చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ ఇంట్లో అత్తమ్మ ఫోటో లేదు. కానీ నా మనసులో అత్తమ్మ ఫొటో ఉంది. ఇక నుంచి మనసులో ఉన్న అత్తమ్మకే చెప్పుకుంటాను. అత్తమ్మ ఈ రోజు మీ అబ్బాయి నన్ను దగ్గరకు తీసుకోబోతున్నాడు. మహాలక్ష్మి అత్తయ్యతో నేను వేసిన పందెం గెలుస్తాను. మామ వచ్చాడు..  మా నా అందానికి పడిపోయినట్లు ఉన్నాడు. ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుంటాడు. 
రామ్: సీత.. ఇక నుంచి మనిద్దరం..
సీత: భార్య భర్తలుగా ఉండబోతున్నామా..
రామ్: నన్ను చెప్పనిస్తావా సీత.. ఈ రోజు నుంచి నువ్వు నా గదిలో పడుకోవడం లేదు. సీత షాక్ అయిపోతుంది. ఫీలవుతుంది.
సీత: అదేంటి మామ అలా అంటున్నావు.
రామ్: నువ్వు నేను వేరుగా పడుకోవాలి.
సీత: అదేంటి మామ నువ్వే కదా చాప మీద వద్దు నా పక్కన పడుకో అని అప్పుడు చెప్పావు. 
రామ్: అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు నువ్వు నాతో నా పక్కన పడుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఎక్కడ పడుకోవాలో చెప్తాను. నాతో రా..
సీత: ఏంటి మామ నేను నీతో పడుకుంటా అన్నాను కదా ఎందుకు వద్దు అంటున్నావు. కారణం చెప్పకపోతే నేను నీతో రాను.
అర్చన: నేను చెప్తాను సీత.. ఈరోజు నుంచి ఒక వారం రోజులు నువ్వు రామ్ ఒకే పడకమీద పడుకోకూడదు. 
గిరిధర్: మహా వదిన వారఫలాలు చూసింది మీరు ఇద్దరూ వారం వేరుగా ఉండాలి. ఏవేవో సమస్యలు వస్తాయి.
సీత: ఎవరికి మామయ్య.
రామ్: మా పిన్నికి సీత.. పిన్నికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అది మన వల్ల పిన్నికి సమస్యలు వస్తే అస్సలు భరించలేను. అందుకే ఈ వారం నువ్వు మీ అక్క రూంలో పడుకో సీత.
సీత: వారఫలాలు అలా ఎలా రాస్తారు. చూపించండి.. అసలు నాకు మీ మీద నమ్మకం లేదు అత్తయ్య.
రామ్: సీత మనకు పిన్ని హెల్త్ ముఖ్యం ఈ వారం నువ్వు మీ అక్క దగ్గర పడుకో. పిన్ని నీ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నువ్వు క్షేమంగా ఉంటే మేం అందరం క్షేమంగా ఉంటాం.
మహాలక్ష్మి: ఎలా ఉంది సీత నా దెబ్బ.. ఇది కేవలం వారం మాత్రమే అనుకోకు. అతి త్వరలో నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు శాశ్వతంగా పంపేస్తాను. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేయ్.

శివకృష్ణ తల్లి సుమతి ఫొటో దగ్గరకు వెళ్లి ఆ రోజుల్లో మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్లం అవి గుర్తొస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది. ఇక పాత రోజులకు వెళ్తారు. గృహలక్ష్మీ సీరియల్‌లో తులసి శివకృష్ణ చెల్లి సుమతిగా మిషన్ కుడుతూ కనిపిస్తుంది. ఇక ఆమె దగ్గరకు శివకృష్ణ, తన భార్య, తల్లి అందరూ వచ్చి ప్రేమగా మాట్లాడుతారు. అందరి కోసం కొత్త బట్టలు కుడుతున్నాను అని సుమతి చెప్తుంది. అందరికీ తాను కుట్టిన బట్టులు ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్ టుడే మార్చి 27th: వామ్మో సత్య, క్రిష్‌కి తన విశ్వరూపం చూపించేసిందిగా, శోభనం క్యాన్సిల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget