అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: జంటగా బయటకు వెళ్లిన మధుమిత, రామ్‌లు.. టెన్షన్‌లో సీత, అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మహా!

Seethe Ramudi Katnam Serial Today Episode కావాలనే మధుమిత, రామ్‌లను మహాలక్ష్మి బయటకు పంపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode  సీతా రామ్‌లు కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటారు. ఇద్దరూ కలిసిపోయారు అనుకొని మహాలక్ష్మి కంగారు పడి రామ్ గదికి రావాలి అనుకుంటుంది. జనార్థన్ సర్దిచెప్తాడు. ఇక సీత తన మామతో ముచ్చట్లు పెడుతుంది. రామ్ సీతని పొడుగుతాడు. ఇక సీత అయితే తన కంటే అందమైన అమ్మాయి వస్తే నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది. రామ్ తిడతాడు. ఇక కాసేపు క్యారెక్టర్లు మార్చుకుందామని సీత అంటుంది. రామ్ ఓకే అంటావు. 

సీత: ఓయ్ సీత నాకాళ్లు పట్టుకోవే. 
రామ్: సీత నేను ఎప్పుడు నిన్ను అలా అడగలేదు. 
సీత: నేను అడుగుతున్నాను కదా.. ఇప్పుడు చేయ్.  
రామ్: క్యారెక్టర్లు మార్చొద్దు నేను రామ్‌నే నువ్వు సీతవే. 
సీత: మామ నేను అందంగా ఉన్నాను అని అన్నావు కదా అది నిజమేనా.. 
రామ్: నీ మీద ఒట్టు. 
సీత: మరి మీ పిన్ని ఎందుకు నేను అందంగా లేను అంటుంది. 
రామ్: ఇదిగో నువ్వు మా పిన్నిని మళ్లీ తీసుకొస్తున్నావ్. 
సీత: సారీ మామ.. నేను నీకు నచ్చితే చాలు.. ఇంకెవరికీ నచ్చకపోయిన పర్వాలేదు అని ఇక తనకు చలి వేస్తుంది అని రామ్ సీత ఒకే దుప్పటిలోకి దూరిపోతారు.

ఇక ఉదయం హాల్‌లో అందరూ కూర్చొని ఉంటారు. అర్చన, గిరిధర్‌లు తమకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు అని అంటారు. ఇక జనార్ధన్ కూడా తమకు నిద్ర పట్టలేదు అని అంటాడు. ఇంతలో రేవతి, చలపతి అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తారు.  

చలపతి: వీళ్లు నైట్ అంతా సీతారాములను తలచుకొని రాత్రి అంతా జాగారం చేసినట్లు ఉన్నారు. మొత్తానికి సీత మీకు రాత్రంతా నిద్ర లేకుండా చేసిందన్నమాట. 
రేవతి: సీతతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. సీతా మజాకానా..  
మహాలక్ష్మి: ఉదయం మీరు టిఫిన్ చేయకుండా నాతో తిట్లు తినాలి అనుకుంటున్నారా..  
చలపతి: సీతను రెచ్చగొట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చిందే మీరు చెల్లాయ్. ఇంతలో సీత కిందకి వస్తుంది. 
మహాలక్ష్మి: ముందు ఆ సీత నోరు కట్ చేస్తే మీరు ఆటోమెటిక్‌గా కట్ అవుతారులే. 
సీత: పొద్దున్నే నన్ను ఎవరు ఇక్కడ తలచుకుంటున్నారు. 
రేవతి: సీత నువ్వు రామ్‌లు కలిసి కొంత మందికి ఇక్కడ నిద్ర లేకుండా చేశారన్నమాట. 
సీత: రాత్రి మేం కూడా నిద్ర పోలేదు పిన్ని. మేం నిద్రపోయే సరికి తెల్లారి నాలుగు అయింది. ఇక సీత్ రామ్ మామ అని పిలుస్తుంది.
మహాలక్ష్మి: రామ్ ఇంట్లో లేడు. 
సీత: ఎక్కడికి వెళ్లారు అత్తయ్య ఆఫీస్‌కా జాగింగ్‌కా.. 
మహాలక్ష్మి: కాదు.. ఇంట్లో నీకు రామ్ ఒక్కడే కనిపించడం లేదా ఇంకొకరు కనిపించడం లేదా.. రామ్ మధుమిత కలిసి రామాపురం వెళ్లారు. అది మీ ఊరికి వెళ్లారు.  
సీత: ఎందుకు..
మహాలక్ష్మి: పేపర్‌లో వచ్చిన ఆ న్యూస్‌ని మీ ఊరి వాళ్లు ప్రత్యక్షంగా చూడటానికి. మీ ఊరి వాళ్లు కూడా చూడాలి కదా. కలిసి వెళ్లి ఒకసారి కనిపించిరండి అని నేనే చెప్పాను. 
రేవతి: అలా ఎలా చెప్తావు వదిన. రామ్ మధుమితలను ఆ ఊరి వాళ్లు చూస్తే సీత తండ్రి పరువు ఏం కావాలి వదిన. 
చలపతి: ఆ సంగతి సరే సీత తండ్రికి కోపం ఎక్కువ గన్ తీసి రామ్, మధుమితలను కాల్చేస్తే. 
రేవతి: రామ్‌కి ఫోన్ చేసి వెంటనే వెనక్కి వచ్చేయ్ మని చెప్పు వదిన లేకపోతే రామ్, మధుమితలకు ఇద్దరికీ ప్రమాదమే. 
మహాలక్ష్మి: రామ్‌ను కాబోయే కోడలు మధుమితను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. రామ్ మధులను పంపించింది ఆ ఊరి జనం చూడటానికి కాదు. సూర్యని కలవడానికి. పొద్దున్నే మధుమిత సూర్యని కలవాలి అని నన్ను అడిగింది. దీంతో రామ్‌ను తోడిచ్చి పంపించాను.
సీత: మామ నాతో చెప్పకుండా వెళ్లడు. 
మహాలక్ష్మి: అప్పుడు నువ్వు ఇంకా నిద్ర లేవలేదు సీత. మొద్దు నిద్రలో ఉన్నావు  అంట.  
రేవతి: సీతని కూడా వాళ్లతో పంపాల్సింది కదా వదిన. ఊరి వాళ్లు అపార్థం చేసుకోకుండా ఉండేవాళ్లు. 
మహాలక్ష్మి: సీత రామ్‌తో పాటు నిద్ర లేవకపోవడం నా తప్పా. అసలు సీత వాళ్లతో వెళ్లడం నాకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా సీతని నిద్ర లేపుతాను. సీత ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  
అర్చన: ఈ విషయం మాకు చెప్పలేదు మహా. సీతను భలే దెబ్బకొట్టావ్‌ మహా.
గిరిధర్: మధుమిత తిరిగి వచ్చేవరకు సీత గిలగిలా కొట్టుకుంటుంది వదిన.
మహాలక్ష్మి: ఇదంతా నైట్ ప్లాన్ చేసి పొద్దున్న వాళ్లని పంపించాను.  

మధుమిత: సారీ రామ్‌గారు మిమల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను.
రామ్: ఇందులో ఇబ్బంది ఏం ఉంది మధుమిత గారు. కావాల్సిన వారికి కష్టం వస్తే ముందు ఉండాలి అని మా పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉండేది. 
మధు: మీకు మీ పిన్ని అంటే ఇష్టమా..
రామ్: ఇష్టం కాదు ప్రాణం మధుమిత గారు.
మధు: అందుకేనా మీ పిన్ని చెప్పగానే నన్ను తీసుకొని వచ్చావ్.  
రామ్: అవును కాకపోతే సీత నిద్ర లేవకముందే వచ్చేశాం కదా సీత ఏమనుకుంటుందో ఏమో. పిన్ని ఏం చెప్పినా తను మాత్రం పాజిటివ్‌గా తీసుకోదు. రోజు ఇంట్లో గొడవ అవుతుంది.
మధు: అంటే రోజు మీ ఇంట్లో నా గురించి గొడవ అవుతుందా..
రామ్: మీ గురించి అని కాదు కానీ మా పిన్ని ఏం చెప్పినా గొడవే.. 

ఇక రామ్ తాను సీత అదే రూట్‌లో వెళ్లిన సంగతులు అన్ని చెప్తాడు రామ్. సీత అంటే తనకు  చాలా ఇష్టం అని చెప్తాడు రామ్. మధు కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంది. ఇక మధుకి రామ్‌ సీత గురించి అడుగుతాడు. 

మధు: అవును మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకొని సీతను చేసుకున్నారు కదా ఆ బాధ ఏమైనా ఉందా. అంటే పెళ్లికి ముందు మీరు నన్ను ఇష్టపడ్డారు కదా.. ఒకవేళ పోయిన కాలం తిరిగి వస్తే ఏం చేస్తారు.
రామ్: పోయిన కాలం తిరిగిరాదు కదండి. అయినా నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. జరగని వాటి గురించి నేను అస్సలు ఆలోచించను. నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను.
మధు: ఇన్ కేస్ మీరు అనుకున్నవి మీరు వద్దు అనుకున్నవి మీకు తిరిగి వస్తే. 

మరోవైపు సీత రామ్‌, మధులకు కాల్ చేస్తుంది. కాల్ కనెక్ట్ అవ్వదు. ఇక మహాలక్ష్మి వచ్చి నెంబరు కలవడం లేదు అని సెటైర్లు వేస్తుంది. సీతని చూసి పాపం అంటుంది. గతంలో సీత రామ్‌తో వెళ్లి మాకు టెన్షన్ పెట్టినట్లు ఇప్పుడు నేను అదే చేశాను అని మహా అంటుంది. ఇక సీత సిగ్గులేదా అని మహాని ప్రశ్నిస్తుంది. ఇక రామ్, మధులు తనకు అన్యాయం చేయరు అని సీత అంటుంది. ఇద్దరి మీద తనకు నమ్మకం ఉందని సీత అంటుంది. ఇక మహా ఎలా అయినా తను అనుకున్నది సాధించి తీరుతాను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  గుప్పెడంతమనసు మార్చి 14 ఎపిసోడ్: రిషి వచ్చే రోజు దగ్గరపడిందన్న వసు - తనకి రక్షకుడిని అంటూ రాజీవ్ కి క్లారిటీ ఇచ్చిన మను!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Embed widget