అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today June 24th: సీత, రామ్‌లకు ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేసిన విద్యాదేవి.. మహాకు చెప్పిన ప్రీతి, ఉషలు.. మహాలక్ష్మి ఆపగలదా!

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి విద్యాదేవి సీత, రామ్‌లకు ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేయడం ఆ విషయం ప్రీతి మహాకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి విద్యాదేవిని పని మనిషి మీద పెట్టి తిడుతుంది. అది గమనించిన సీత చెవిలో బ్లూటూత్ పెట్టుకొని మహాలక్ష్మిని తిడుతుంది. ఇంట్లో అందరూ సీత ఫోన్‌లో మాట్లాడుతుందని మహాలక్ష్మితో చెప్తారు. ఇక విద్యాదేవి మహాలక్ష్మిని చూసి నవ్వుతూ పాట పాడుతుంది. మహాలక్ష్మి రగిలిపోతుంది. అర్చనతో మహాలక్ష్మి ముందు విద్యాదేవిని ఇంట్లో నుంచి పంపించి తర్వాత సీత పని పడదామని అంటుంది. ఇక విద్యాదేవి సీతని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. 

విద్యాదేవి: సీత.. మీ ఇద్దరు అత్తలు మాటలతో నన్ను హింసించి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలి అని ప్రయత్నించారు. నువ్వు నీ ఫ్రెండ్ వంక పెట్టుకొని నన్ను కాపాడావు. నీకు అబద్ధం ఆడటం రాదు సీత.. నువ్వు తిట్టింది నీ ఫ్రెండ్‌ని కాదు వాళ్లని అని నాకు తెలుసు. వాళ్లకి అర్థమైపోయింది. 
సీత: నేను దొరికిపోయానా టీచర్.
విద్యాదేవి: రామ్‌కి తెలీలేదు. రామ్‌కి తెలిస్తే నిన్ను అసహ్యించుకుంటాడు అని తెలిసి కూడా ఇంత పెద్ద సాహసం చేసి నా గౌరవం కాపాడావు. నాకు ఇంత చేసిన నీకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. 
సీత: మీ గౌరవం కాపాడటం నా బాధ్యత టీచర్. మీ లాంటి మంచి అత్తయ్య ఉంటే ప్రపంచంలో ఏ అత్తాకోడళ్లు గొడవపడరు టీచర్. 
విద్యాదేవి: మనసులో.. నువ్వు నా కోడలిగా రావడం నా అదృష్టం సీత. నేనే నీ అత్తయ్యని అని చెప్పుకోలేకపోవడం నా దురదృష్టం సీత. సీత నువ్వు రామ్ ఒక్కటి అవ్వాలి. భార్యభర్తలుగా సంపూర్ణంగా కలిసిపోవాలి. ఈ రోజు రాత్రికి మీ ఇద్దరు అత్తయ్యలు మామయ్యలు ఏదో ఫంక్షన్‌కి వెళ్తున్నారని తెలిసింది. ఈ రాత్రి ఉండరు కాబట్టి నువ్వు రామ్ ఒక్కటి అయ్యేందుకు ఇదే మంచి సమయం. నేను చెప్పింది అర్థమైందా.
సీత: కానీ మామ ఆ విషయంలో నా మాట వినరు టీచర్. వాళ్ల పిన్ని మాటే వింటారు. 
విద్యాదేవి: మేం చెప్పినట్లు చేస్తే రామ్ మీ మాట వింటాడు. మీరు ఒక్కటి అవుతారు. 
సీత: సరే టీచర్.

విద్యాదేవి రాత్రి రామ్‌కి కాల్ చేసి.. మహాలక్ష్మి వాళ్లు ఫంక్షన్‌కి వెళ్తారు అని ప్రీతి ఉషలు కూడా బయటకు వెళ్తారు అని సీత ఒంటరిగా ఉంటుందని ఇంటికి తొందరగా రమ్మని చెప్తుంది. రామ్‌కి ఇన్‌డైరెక్ట్‌గా తొలి రాత్రి గురించి విద్యాదేవి చెప్తుంది. రామ్ ఇంటి బయల్దేరుతాను అని చెప్తాడు. ఇక ఇంట్లో ఉన్న ప్రీతి ఉషలను బయటకు పంపాలి అని విద్యాదేవి వచ్చి ప్రీతి, ఉషల దగ్గరకు వెళ్లి సినిమా టికెట్లు ఇస్తానని వెళ్లమని చెప్తుంది. ఇద్దరూ బయల్దేరుతారు. మరోవైపు రేవతి సీతని మొదటి రాత్రి కోసం రెడీ చేస్తుంది. రామ్‌ని దగ్గర చేసుకోమని సీతకు చెప్తుంది. రేవతి, విద్యాదేవి సీతని ఆటపట్టిస్తారు. రామ్ మల్లెపూలు కొంటాడు. ఇక విద్యాదేవి సడెన్‌గా సినిమాకు పంపిస్తుందని అంటే ఏదో ప్లాన్ చేస్తుందని ప్రీతి, ఉషలు అనుకుంటారు. పైకి వెళ్లి చూడాలి అనుకుంటారు. సీతని అందంగా రెడీ చేసి చేతిలో పాల గ్లాస్ ఉంది ఏమైందా అని చూస్తారు. సీతకి ఫస్ట్ నైట్ అని ప్రీతి, ఉషలకు తెలిసిపోతుంది. విద్యాదేవి ఇంత పెద్ద కుట్ర చేస్తుందని ఆ విషయం మహాలక్ష్మికి చెప్పాలి అని అనుకుంటారు. ప్రీతి, ఉషలు మహాలక్ష్మికి కాల్ చేసి సీత, రామ్‌ల ఫస్ట్‌నైట్ గురించి చెప్తుంది. మహాలక్ష్మిని తొందరగా ఇంటికి రమ్మని మొత్తం చెప్తారు. మహాలక్ష్మి వెంటనే ఇంటికి వెళ్లాలి అని జనార్థన్‌తో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: గాయత్రీదేవి ఆత్మని బంధించిడానికి వచ్చిన గంటలమ్మ, హర్షని చూసి ఆత్మ అని బిత్తరపోయిన తిలోత్తమ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Embed widget