అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవిని ఇంటి నుంచి పంపేయడానికి మహా ప్లాన్.. ప్రీతితో క్లోజ్‌గా ఉన్న విక్కీని చితక్కొట్టిన టీచర్!

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవిని ఇంటి నుంచి పంపేయాలి అని మహాలక్ష్మి విక్కీని పిలిపించి ప్రీతితో క్లోజ్‌గా ఉండేలా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: మహాలక్ష్మికి చీర కొనాలి అనే వంక పెట్టుకొని సీత రామ్‌ని తీసుకొని షాపింగ్‌కి బయల్దేరుతుంది. మహాలక్ష్మి దగ్గరకు వెళ్లిన సీత "అనుకున్నది ఒకటి అయినది ఒకటి" అంటూ పాట పాడుతుంది. మహాలక్ష్మి ఎదురుగా గంతులు వేసుకుంటూ వెళ్తుంది. మహాలక్ష్మి ఈ చీర ప్లాన్ సీతదా.. లేక మహాలక్ష్మిదా అనుకుంటుంది. ఇక సీత బయట ఉన్న విద్యాదేవి దగ్గరకు వెళ్లి మీ ప్లాన్ సక్సెస్ అయిందని షాపింగ్‌కి వెళ్తున్నాం అని చెప్తుంది. దాంతో మహాకు ఇదంతా విద్యాదేవి ప్లాన్ అని తెలుస్తుంది.

అర్చన: రోజు రోజుకు ఈ టీచర్ ప్రవర్తన హద్దు మీరిపోతుంది మహా. 
మహాలక్ష్మి: అది అర్థమవుతుంది. ఆ విద్యాదేవి లిమిట్స్ క్రాస్ చేస్తుంది. ఈ రోజే దాన్ని పంపి చేద్దాం. రామ్ సీతలు తిరిగి వచ్చే లోపు పంపేయాలి. ఈ రోజు ఈ ఇంట్లో దానికి ఆఖరి రోజు. రామ్, సీతలను చూడటం కూడా ఇదే చివరి చూపు. వాళ్లు తిరిగి వచ్చేలోపు దాన్ని లేపేద్దాం. 

కారులో వెళ్తుండగా సీత రామ్‌కి ముద్దు పెట్టబోతే ఎదురుగా బండి రావడంతో సీత రామ్ ఒడిలో పడిపోతుంది. సీత కావాలనే రామ్‌తో రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. ఇక రామ్ సీతకి కిస్ పెట్టాలని వెళ్తే సీత ఆపేస్తుంది. 

అర్చన: ఏంటి మహా రామ్, సీతలు వచ్చేలోపు టీచర్‌ని ఇంటి నుంచి పంపేస్తా అని చెప్పి ఇంత కూల్‌గా కాఫీ తాగుతున్నావ్. రామ్ సీతని బయటకు తీసుకెళ్తుంటే నాకే మెంటల్ వచ్చేస్తుంది. నువ్వెలా కూల్‌గా ఉన్నావ్. టీచర్‌ని ఇంటి నుంచి పంపించడానికి ఏం ప్లాన్ చేశావ్. 

మహాలక్ష్మి అర్చనను రిలాక్స్ అవ్వమని అంటుంది. ఇంతలో విక్కి వస్తాడు. ప్రీతి ఉందా అని మహాలక్ష్మిని అడిగితే లోపల ఉందని చెప్పి విక్కీని లోపలికి పంపిస్తుంది. విక్కీ లోపలకి వెళ్లి ప్రీతిని పిలుస్తాడు. విక్కీ ప్రీతి భుజం మీద చేయి వేసి ప్రీతిని తన గదిలోకి వెళ్దామని తీసుకెళ్తాడు. 

అర్చన: ఏంటి మహా వాడు ప్రీతి భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్తున్నాడు. 
మహాలక్ష్మి: ఎందుకు అంత కంగారు పడుతున్నావ్.
అర్చన: కూతురు అలా బాయ్‌ఫ్రెండ్‌తో గదిలోకి వెళ్తుంటే నువ్వేం అనవా.
మహాలక్ష్మి: తప్పేం కాదు ఇదే ఇప్పుడు ట్రెండ్.
అర్చన: తప్పు కాదా.. ఏం మాట్లాడుతున్నావ్ మహా. ఏం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ టీచర్‌ కానీ చూసింది అంటే వాడి బెండు తీస్తుంది. మళ్లీ ఈ రచ్చ అవసరమా మహా. మళ్లీ ఇదో తల నొప్పి.
మహాలక్ష్మి: ఆ తల నొప్పి పోవాలి అనే ఇది. ఇప్పుడు మనం రూమ్‌లోకి వెళ్లి సీన్ సితార అయ్యాక వద్దాం పద.
 
సీత రామ్ దగ్గర డబ్బులు తీసుకొని మల్లెపూలు కొనుక్కొని పెట్టుకుంటుంది. ఇక ఐస్‌క్రీమ్‌ బండి కనిపించడంతో కారు ఆపించి రామ్ చేత ఐస్‌క్రీమ్ తెప్పించుకుంటుంది. ఇద్దరూ పుల్ల ఐస్‌ క్రీమ్‌లు తింటారు. సీత విద్యాదేవి మాటలు గుర్తు చేసుకొని రామ్‌ని మచ్చిక చేసుకోవాలి అని రామ్‌తో రొమాంటిక్‌గా ఉంటుంది. ఇక ప్రీతి, విక్కీ మీద చేయి వేసుకొని కిందకి వస్తుంది. విద్యాదేవి అది చూసి సీరియస్ అవుతుంది. 

విద్యాదేవి: రేయ్.. ప్రీతి మీద చేయి తీయురా. 
విక్కీ: ఆ మాట చెప్పడానికి మీరు ఎవరు.
విద్యాదేవి: చెప్పింది చేస్తావా లేదా చెంప పగలగొట్టాలా.
విక్కీ: ఎవరు ప్రీతి.
ప్రీతి: మా ఇంట్లో ఎక్స్‌ట్రా కాన్డిడేట్. మా హెడ్ యాక్. అయినా తనతో మనకేంటి. పద.
విద్యాదేవి: ఎక్కడికి వెళ్తున్నారు.
ప్రీతి: అది నీకు అనవసరం.
విద్యాదేవి: మర్యాదగా చెప్తావా లేదా..
ప్రీతి: మూవీకి..
విద్యాదేవి: మీ ఇద్దరూ వెళ్తున్నారా. అతనితో నువ్వు ఒంటరిగా వెళ్లడం నీకు సేఫ్ కాదు. 
ప్రీతి: అతను నా ఫ్రెండే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా. అయినా ఏ అధికారంతో నువ్వు నన్ను అడ్డుకుంటున్నావ్.
విద్యాదేవి: మీ అమ్మ అనే అధికారంతో. 
విక్కీ: తను మీ అమ్మగారా ప్రీతి.
ప్రీతి: కాదు.
విద్యాదేవి: అమ్మ లాంటి దాన్ని అని చెప్తున్నా.
ప్రీతి: నాకు అమ్మలాంటిది మా పిన్ని మాత్రమే. నువ్వు నాకు ఏం కావు. 
విద్యాదేవి: నువ్వు లిమిట్స్ క్రాస్ అవుతున్నావ్ ప్రీతి. ఈ చెడు స్నేహాలు వదిలేయ్.
విక్కీ: హలో మేం జంటగా వెళ్లడం నీకు ఇష్టం లేదా. కావాలి అంటే నువ్వు కూడా ఎవర్ని అయినా చూసుకొని వెళ్లు  మేం ఏమీ అనుకోం. 
విద్యాదేవి: రేయ్ ఏం వాగుతున్నావ్ రా.. అని విక్కీ చెంప పగలగొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: కాళీ.. కిడ్నాప్.. సంధ్య పెళ్లి.. నిజాలు తెలుసుకున్న సత్య, రుద్ర చేసిన పనికి భైరవికి గాయం!

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget