అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రేవతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కిరణ్.. త్వరలోనే పెళ్లి!

Seethe Ramudi Katnam Serial Today Episode కిరణ్ సీత సాయంతో మహాలక్ష్మి ఇంటికి వచ్చి రేవతిని పెళ్లి చేసుకొంటానని అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode కిరణ్ మహాలక్ష్మి ఇంటికి కోటీశ్వరుడిగా వస్తాడు. తన దగ్గర నాలుగు వేల మంది పని చేస్తున్నారని నలుగురు మేనేజర్లు ఉన్నారని చెప్తాడు. ఎన్ని చెప్పినా ఇంట్లోకి రావడానికి వీల్లేదని మహాలక్ష్మి ఉంటుంది. సీత మాత్రం కిరణ్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతుంది. జనార్థన్ కూడా కిరణ్‌ని ఇంట్లోకి రానివ్వమని అంటే సీత ఒప్పుకోదు. 

సీత: అతనికి సంబంధించినది ఓ అమూల్యమైంది ఈ ఇంట్లో ఒకటి ఉంది. అందుకే ఆయన వచ్చారు.
మహాలక్ష్మి: మాకు సంబంధించి అతనికి సొంతమైంది ఈ ఇంట్లో ఏం లేదు. అయినా ఏంటి రామ్ సీత ఇలా మాట్లాడుతుంటే నువ్వేమీ అనడం లేదు.
రామ్: సీత చెప్పినదాంట్లో కూడా నిజం ఉంది కదా పిన్ని.
విద్యాదేవి: అతన్ని ముందు ఇంట్లోకి రానిస్తే కావాల్సింది ఏంటో మనందరికి తెలుస్తుంది. 
మహాలక్ష్మి: నిన్ను ఇంట్లోకి రానిచ్చామని నువ్వు చెప్పిన వాళ్లందరినీ రానిస్తామని అనుకున్నావా. 
సీత: ఈ ఇంటితో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్లంతా వస్తారు అత్తయ్య. మీరు లోపలికి పదండి. 

అందరూ లోపల కూర్చొంటే.. సీత రేవతిని తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. అందంగా ఉన్నావని రేవతిని పొగిడేస్తుంది. ఇక రేవతికి సర్‌ఫ్రైజ్ అని కిందకి తీసుకొస్తుంది. కిరణ్ రేవతిని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. సీత రేవతిని కిరణ్ ఎదురుగా నిల్చొపెడుతుంది. రేవతి మాత్రం కిరణ్ వంక చూడదు. సీత చూడమంటే రేవతి చూసి షాక్ అయిపోయి సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేస్తుంది. అది చూసి రామ్, సీత, విద్యాదేవి, చలపతిలు సంతోషిస్తారు. మహా టీమ్ బ్యాచ్ మాత్రం డల్ అయిపోతారు. 

రేవతి: కిరణ్.. ఎలా ఉన్నావ్ కిరణ్..
కిరణ్: నీకు మాట ఇచ్చినట్టుగా నీకోసం తిరిగి వచ్చాను. ఆ రోజు నాకు ఆస్తి లేదని ఇంటి నుంచి గెంటేశారు. దుబాయ్ వెళ్లి బిజినెస్ స్టార్ చేసి కోట్లు సంపాదించాను. దుబాయ్‌లో వన్‌ ఆఫ్ ది బిజినెస్ మెన్ అయ్యాను. ఈ పొజిషనే లేదనే కదా మహాలక్ష్మి గారు అప్పుడు మీరు నన్ను రేవతిని విడదీశారు. ఇప్పుడు మీకు నేను అన్ని విధాలుగా సరిపోతాను. ఎందులోనూ తీసిపోను.
మహాలక్ష్మి: సో వాట్ ఇంత సడెన్‌గా ఎందుకు వచ్చావ్.
కిరణ్: నేను రాలేదు. సీత నన్ను రప్పించింది. 
సీత: అవును రేవతి పిన్ని తన ప్రేమ గురించి నాతో చెప్పింది. నేను కిరణ్ గారు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేసి రప్పించాను.  
కిరణ్: నా కోసం ఎదురు చూస్తూ రేవతి ఇంకా పెళ్లి చేసుకోలేదని సీత చెప్పగానే వెంటనే వచ్చేశాను. 
విద్యాదేవి: నువ్వు గ్రేట్ సీత. కిరణ్‌ని ఇక్కడికి రప్పించి ఇద్దరిని కలిపావు.
రామ్: అవును సీత.. ఇంకా ఈ పెద్దరికం అనే గోడలు వద్దు. రేవతి అత్త ఎదురు చూపులు చాలు. కిరణ్ గారు అత్త కోసం వచ్చారు వాళ్ల ప్రేమను గెలిపిద్దాం. 
చలపతి: మొత్తానికి రేవతి గారి ప్రేమ సుఖాంతం అయింది. 

ఇక కిరణ్ దుబాయ్ నుంచి అందరికీ గిఫ్ట్‌లు తీసుకొచ్చానని అంటాడు. సీత, రామ్‌లకు, చలపతికి, అందరికీ ఇస్తాడు. ఇక రేవతి కోసం ఏం తెచ్చావని సీత అడుగుతుంది. దానికి కిరణ్ రేవతి నా బంగారం తనకి బంగారు నెక్లెస్ తెచ్చానని అంటాడు. ఇక సీత కిరణ్‌తోనే ఆ నెక్లెస్ రేవతి మెడలో వేయిస్తుంది. కిరణ్ రేవతి మెడలో తాళి కట్టేశాడు అని సీత  అంటుంది. రేవతి తన చేతులతో కిరణ్ కోసం కాఫీ తేవడానికి వెళ్తుంది. ఇక రేవతి సీతని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. రేవతి ఎమోషనల్ అవుతుంది. ఇక కాఫీ తీసుకెళ్లి కిరణ్‌కి ఇస్తుంది. వాళ్ల మాటలు మహాలక్ష్మి, అర్చనలు మూతులు తిప్పుకుంటారు. సీత త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తామని అంటుంది. ఇక రేవతిని తీసుకొని బయటకు వెళ్తానని కిరణ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మనుతో అమ్మా అని పిలిపించుకున్న అను – మనును కాలేజీ ఎండీగా ప్రకటించిన మంత్రిగారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget