Guppedanta Manasu Serial Today July 15th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మనుతో అమ్మా అని పిలిపించుకున్న అను – మనును కాలేజీ ఎండీగా ప్రకటించిన మంత్రిగారు
Guppedanta Manasu Today Episode: మనును కాలేజీ ఎండీగా మంత్రిగారు ప్రకటించడంతో.. మను అందుకు తాను సిద్దంగా లేనని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాం అన్న అనుపమతో మను మిమ్మల్ని ఎవరో బెదిరిస్తున్నారని వాళ్లెవరో చెప్పమని అడుగుతాడు. ఏమైన ఉంటే నేను చూసుకుంటానని అనడంతో అనుపమ నువ్వేం అడిగినా నా మీద ఓట్టే అని ఓట్టేసుకోవడంతో మను కోపంగా నా తండ్రి గురించి అడిగినప్పుడు ఇలాగే కోపంగా ఒట్టు పెట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా ఓట్టు పెట్టారు.. ఇంతకీ నా తండ్రి ఎవరో చెప్తారా? లేదా? అంటూ గన్ తీసుకుని తనను తాను షూట్ చేసుకోవడానికి ఎయిమ్ చేసుకుంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి గన్ లాగేసుకుంటాడు.
మహేంద్ర: ఏంటి మను కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి.
మను: పోతే పోనివ్వండి సార్ ఎవరికి కావాలి ఈ ప్రాణాలు
మహేంద్ర: అసలు ఏం జరిగింది. ఎందుకు గొడవ పడుతున్నారు.
మను: ఇన్నాళ్లు నా తండ్రి గురించి అడిగితే చెప్పలేదు. ఇప్పుడేమో మీ ఇంట్లోనే ఉండొద్దు అంటున్నారు. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.
మహేంద్ర: అనుపమ అసలు ఏమైంది. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు. అను నేనేమైనా నీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించానా?
అనుపమ: అలాంటిదేం లేదు మహేంద్ర. కానీ ఇకపై మేము నీ ఇంట్లో ఉండము. నీ జీవితం నీది. మా జీవితం మాది.
అని చెప్పగానే మహేంద్ర, మను షాక్ అవుతారు. ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నావు అని మహేంద్ర అడగ్గానే నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎందుకు? ఏంటి? అని అడగొద్దు అంటుంది అనుపమ. మహేంద్ర సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నువ్వు ఇప్పుడు నామాట వింటే త్వరలోనే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అంటూ నన్ను అమ్మా అని పిలువు అని అడుగుతుంది అనుపమ. దీంతో మను హ్యాపీగా అమ్మా అని పిలుస్తాడు. మరోవైపు రాధమ్మ నీళ్ల బిందె తీసుకొస్తూ కళ్లు తిరిగి కిందపడిపోతుంది. వసుధార వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. రంగ వచ్చి డాక్టర్‌కు ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చి ట్రీట్‌మెంట్ చేస్తుంది.
డాక్టర్: ఇప్పుడు పర్వాలేదు అండి నార్మల్‌గా ఉంది. సీపీఆర్ చేసింది మీరేనా.. మీరు సమయానికి సీపీఆర్ చేయడం వల్ల ఈరోజు ఆవిడ ప్రాణాలు నిలిచాయి. లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో మేం చెప్పలేము. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా?
రంగ: ఇంతకుముందు ఎప్పుడు రాలేదు డాక్టర్ గారు.
రాధమ్మ: నిద్రలో ఒకటి రెండు సార్లు వచ్చినట్టు గుర్తు.
అని రాధమ్మ చెప్పగానే రంగ, వసుధార షాక్ అవుతారు. మాకు ఎందుకు చెప్పలేదని రంగ అడగ్గానే నేను ఇంత సీరియస్ అవుతుందనుకోలేదు అంటుంది. దీంతో డాక్టర్ జాగ్రత్తలు చెప్పి మెడిసిన్స్ రాసిచ్చి వెళ్తుంది. బయటకు వచ్చిన రంగ, వసుధారకు థాంక్స్ చెప్తాడు. దీంతో వసుధార నేను ఎంత చెప్పినా మీరు మాత్రం నన్ను మేడం అనడం మానడం లేదు అంటుంది. దీంతో రంగ మీకు ఎంత చెప్పినా నమ్మరా? అంటూ మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తాడు. దీంతో వసుధార కూడా తను నిజంగానే రంగానా అని డైలమాలో పడిపోతుంది. మరోవైపు డీబీఎస్టీ కాలేజీ బోర్డు మీటింగ్ జరుగుతుంది.
మంత్రి: ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టానో మీకు అర్థం అయ్యే ఉంటుంది.
శైలేంద్ర: నాకు మాత్రం అర్థం కావడం లేదు. ( అని మనసులో అనుకుంటాడు)
మంత్రి: ఎండీ సీటు గురించి, వసుధార ఎండీ పదవికి రిజైన్ చేసి వెళ్లిన తర్వాత ఆ సీటులో ఎవరు కూర్చోవాలో.. ఆ పదవిని ఎవరు స్వీకరించాలో అన్నదాని మీద మనం లాస్ట్ మీటింగ్‌లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేనే ఎండీని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను.
శైలేంద్ర: వీడేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చాడు. ( మనసులో అనుకుంటాడు.)
ఇంతలో మనునే కాలేజీకి ఎండీగా ఎన్నుకుంటున్నాను అని మంత్రిగారు చెప్పగానే అందరూ షాక్ అవుతారు. శైలేంద్ర ఆబ్జెక్షన్ చెప్తాడు. మంత్రి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. ఇంతలో మను నేను సిద్దంగా లేనని చెప్పడంతో శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. మిగతావారంతా షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.