అన్వేషించండి

Seethe ramudi katnam  Serial Today December 14th: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌:    'మహా' ప్లాన్ బయట పెట్టేసిన ప్రీతి.. మహాలక్ష్మీ ఇక ఎర్రగడ్డకే!

Seethe ramudi katnam  Today Episode:   మహాలక్ష్మీ వేసిన ప్లాన్‌ ను ప్రీతి బయటపెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Seethe ramudi katnam  Serial Today Episode: ప్రీతిని తీసుకెళ్లడానికి తన భర్త వస్తాడు. ఇక్కడికి వచ్చారేంటి అండీ అని ప్రీతి వెళ్లి కంగారుగా పలకరిస్తే హేమంత్ ప్రీతి మీద సీరియస్ అవుతాడు. పిన్ని అన్నయ్య బాబాయ్‌లను చూడాలని ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి విద్యాదేవి గారు వెళ్లిపోవాలి అని నాటకం ఆడుతావా అని తిడతాడు. అందరూ షాక్ అయిపోతారు. 

హేమంత్: నువ్వు మాతో చెప్పి వచ్చింది ఏంటి ఇక్కడ చేస్తుంది ఏంటి. ఈ విద్యాదేవితో మాకు సంబంధం లేదు అని ఆ రోజే చెప్పాం కాదా.

ప్రీతి: అది కాదండీ.

హేమంత్: నోర్ముయ్‌ కొట్టానంటే ముఖం మూడు ముక్కలవుతుంది. ఇక్కడికి వచ్చి మేం చెప్పనివి చెప్పి మా పరువు తీస్తావా.

సీత: విన్నారుగా ఇదంతా ప్రీతి ఆడిన నాటకం.

రామ్: ఏంటి ప్రీతి ఇది ఇంత నాటకం ఆడాల్సిన అవసరం నీకు ఏంటి. ఎందుకిలా చేశావ్. నువ్వు చెప్పకపోతే మీ ఆయనే కాదు నేను నీ చెంపలు చెల్లుఅనిపిస్తా.

జనార్థన్: ఏంటి ఇదంతా ప్రీతి.

హేమంత్: చెప్తావా చెంప పగల గొట్టాలా.

ప్రీతి: చెప్తాను మహాలక్ష్మీ పిన్ని నాతో ఇలా చేయమని చెప్పింది. 

సీత: విన్నారు కదా ఇదంతా మహాలక్ష్మీ అత్తయ్యే చేయించింది. ఇది నేను కనిపెట్టి హేమంత్‌కి కాల్ చేసి ఇక్కడికి రప్పించాను. ఎలా అయినా అత్తమ్మని ఈ ఇంటి నుంచి పంపేయడానికి మహాలక్ష్మీ అత్తయ్య వేసిన ఎత్తు ఇది. ఇప్పుడు అందరికీ అర్థమైందా.

రామ్: ఏంటి పిన్ని నువ్వు ఇంత నాటకం ఆడావా. ప్రీతిని పిలిపించి ఇంత చేస్తావా.

జనార్థన్: ప్రతీ సారీ ఇలా ఎందుకు చేస్తావ్ మహా మొన్న రాత్రి ఒక ఆడదొంగ రావడం కూడా నీ పనేనా. అనవసరంగా కొత్త అల్లుడి ముందు మన పరువు తీశావ్ కదా.

గిరిధర్: వదిన మానసిక పరిస్థితి సరిగా లేదు వదిలేయండి అన్నయ్య.

సీత: అంటే అత్తయ్యకి పిచ్చి అని ఇంకో రకంగా చెప్తున్నారా.

మహాలక్ష్మీ: నాకు పిచ్చి ఏంటే.

రామ్: అనుకోవడం కాదు పిన్ని మీ చేష్టలు అలాగే ఉన్నాయి. 

ప్రీతి: మీకు పిచ్చి పట్టిందా ఈ విషయం ముందే చెప్పాలి కదా పిన్ని అనవసరంగా మీ వల్ల నేను మా ఆయన అన్నయ్యతో తిట్లు తిన్నాను.

జనార్థన్: ఇంకోసారి ఇలా చేయకు మహా ఇలా చేస్తే నిన్ను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి ఉంటుంది.

 

విద్యాదేవి, రామ్‌లు ప్రీతిని ఏం అనొద్దని హేమంత్‌ని అంటారు. సీత ప్రీతిని ఇంటికి తీసుకెళ్లి బుద్ధి చెప్పమని అంటుంది. హేమంత్, ప్రీతి వెళ్లిపోతారు. జనార్థన్‌ విద్యాదేవికి క్షమాపణ చెప్తాడు. మీ మీద మంచి అభిప్రాయం ఉందని మీకు సుమతికి దగ్గర పోలికలు ఉన్నాయని విద్యాదేవితో చెప్తాడు. మీరు ఎవరో తేలే వరకు ఇక్కడే ఉండండి అని అంటాడు. జనార్థన్‌ మాటలు సీత చూసి మురిసిపోతుంది. సీత మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి పిచ్చి అంటూ సెటైర్లు వేస్తుంది. నేను అయితే ఈ పాటికి చనిపోయేదాన్ని మీకు అలా అనిపించడం లేదా అని అంటుంది. స్నేహానికి ప్రాణం పెట్టలాల్సిన మీరు ఆ స్నేహాన్ని చంపే స్థితికి ఎందుకు దిజగారిపోయారని అడుగుతుంది.

  టీచర్ సుమతి అని మీకు తెలుసు అందుకే మీరు కొట్టేసిన స్థానం తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని భయంతో చంపాలని చూస్తున్నారని అతి త్వరలోనే మీకు కన్నీరు పెట్టుకొని బయటకు వెళ్లే పరిస్థితి తీసుకొస్తా అంటుంది. దానికి మహాలక్ష్మీ నేను బతకడం కోసం ఎవరినైనా చంపేస్తా అనుకుంటుంది.  ఇక సీత గదిలోకి వెళ్లే సరికి ఫస్ట్‌నైట్‌ కోసం అలంకరించినట్లు గతి మొత్తం అలంకరించి స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి రామ్ పంచెకట్టి రెడీ అయి పాల గ్లాస్‌తో సీత దగ్గరకు వస్తాడు. ఇక ఇద్దరూ క్యారెక్టర్లు మార్చుకుంటారు. రామ్ లా సీత సీతలా రామ్ మాట్లాడుతారు. ఇక సీత రామ్‌లా లైట్ ఆపేసి రామ్‌ని బెడ్ మీదకు తోసేస్తుంది. ఇక ఉదయం విద్యాదేవి, సీత కిచెన్‌లో మాట్లాడుకుంటారు. మహాలక్ష్మీ మంచి పని అయిందని అనుకుంటారు. ఇక ఉదయం మ్యానేజర్ ఫైల్స్ తీసుకొని వచ్చి సీతతో సంతకాలు పెట్టమని అంటాడు.

   సీత పెట్టే టైంకి మహాలక్ష్మీ అవసరం లేదని ఎంట్రీ ఇస్తుంది. ఈరోజు నుంచి నేను తిరిగి చార్జ్ తీసుకున్నా నీ అవసరం ఆఫీస్‌లో లేదని మహాలక్ష్మీ అంటుంది. ఇక రామ్, జనార్థన్ వచ్చి సీత బాగా ఆఫీస్ మ్యానేజ్ చేసింది కదా అని మహాలక్ష్మీ అంటే దానికి మహాలక్ష్మీ సీత సొంతంగా మాట్లాడలేదని బ్లూటూత్ సాయంతో జైలుతో ఉన్న టీచర్‌తో వీడియో కాల్ మాట్లాడి ఇలా చేసిందని అంటుంది. సీత అయోమయంగా ముఖం  పెట్టి నాకు అంత టెక్నాలజీ లేదని మాట్లాడుతుంది. జైలులో అలాంటివి ఇవ్వరు కదా అని జనార్థన్ అంటాడు. దాంతో మహాలక్ష్మీ టైం వచ్చినప్పుడు నిరూపిస్తా ఇక నుంచి ఆఫీస్‌ విషయాల్లో సీత జోక్యం వద్దని అంటుంది. దాంతో సీత అయితే నా చీరల వ్యాపారం నేను చూసుకుంటా మీ ఆఫీస్ మీరే చూసుకోండి అంటుంది. సీత మహాలక్ష్మీతో మీ టైం అస్సలు బాలేదు అత్త మీ మాటలు వాళ్లు నమ్మడం లేదు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget