అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today August 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీకి దెబ్బ మీద దెబ్బ ముందు ప్రీతి, ఇప్పుడు ఎస్‌ఐ.. సీత ప్లాన్ మామూలుగా లేదుగా! 

Seethe Ramudi Katnam Serial Today Episode ఇంటికి వచ్చిన ఎస్ఐని సీత అనుకొని మహాలక్ష్మీ గన్‌ గురి పెట్టి అంతు చూస్తా అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode ప్రీతి కప్ పట్టుకొని విద్యాదేవి దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకొని గిరగిరా తిరిగేస్తుంది. కప్ విద్యాదేవి టీచర్‌కి ఇచ్చి హగ్ చేసుకొని తన ఇష్టాన్ని విద్యాదేవి టీచర్‌తో పంచుకుంటుంది. మహాలక్ష్మీ దూరం నుంచి ప్రీతి, విద్యాదేవిలను చూస్తుంది. ఇంతలో సీత స్వీట్స్ తీసుకొచ్చి ఇద్దరికీ తినిపిస్తుంది. ఇక సీత విద్యాదేవికి థ్యాంక్స్ చెప్పొద్దని కిస్ చేయమని చెప్తుంది. ప్రీతి విద్యాదేవికి కిస్ చేస్తుంది. అది చూసి మహాలక్ష్మి రగిలిపోతుంది. ఇక ప్రీతి కప్‌తో ఫొటోతో సెల్ఫీ తీసుకుంటే మహాలక్ష్మీ వస్తుంది.

మహాలక్ష్మీ: ఈ పిన్ని నీ కంటికి ఇప్పుడు కనిపించిందా ఏమనుకుంటున్నావ్ నువ్వు ఏదో ఒక్క రోజు రెడీ చేసిందని ఆ టీచర్‌ని అంత పొగిడేస్తున్నావ్ ఆమెపై అంత ప్రేమ చూపించాలా నీ హ్యాపీ నెస్ ఆమెతో పంచుకోవాలా. కింద నేను అర్చన ఉన్నాం మమల్ని పట్టించుకోకుండా ఆమె దగ్గరకు పరుగులు తీశావ్. ఎందుకు నన్ను అవాయిడ్ చేశావ్ ఎందుకు నన్ను ఇన్‌సల్ట్ చేశావ్.
ప్రీతి: నువ్వు నన్ను హర్ట్ చేశావ్ పిన్ని నన్ను రెడీ చేయమంటే ఇరిటేట్ అయ్యావ్. మీరు చేయలేని పని ఆ టీచర్ చేసింది అందుకే ఆవిడకు థ్యాంక్స్ చెప్పాను. నా ఆనందాన్ని షేర్ చేసుకున్నాను.
మహాలక్ష్మీ: అంటే ఇన్నాళ్లు నేను చేసిందంతా వేస్ట్ అనా.
ప్రీతి: నేను అలా అనలేదు ఈరోజు నాకు ఆ టీచర్ బెస్ట్ అని అనిపించింది. 
సీత: ఏంటి అత్త షాక్ అయ్యావా ప్రీతి ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు కదా. ప్రీతిని మీ సొంత కూతురిలా పెంచానని చూపిస్తా కానీ నా మీద కోపం ప్రీతి మీద చూపిస్తారు. మీరు నిజంగా ప్రీతి మీ కూతురు అయితే ఇలా చేస్తారా. మీరు ప్రీతికి ఇవ్వలేని ప్రేమ అభిమానం మా టీచర్ ప్రీతికి చూపించింది కాబట్టే ప్రీతి టీచర్కి ప్రేమ చూపించింది. 
మహాలక్ష్మీ: నేను ఏదో బ్యాడ్ మూడ్‌లో ఉండి ప్రీతి తిడితే మీరు దాన్ని అవకాశంగా తీసుకొని ప్రీతిని మీ వైపునకు తిప్పుకుంటారా. ఈ కొంచెం దానికే మీరు మొత్తం నన్నే గెలిచేసినట్లే అనుకుంటున్నావా.
సీత: మీకు ఓ విషయం అర్థం కావడం లేదు నిన్న మీకు రామ్ మామ అడ్డు పడ్డాడు. ప్రశ్నించాడు. ఈ రోజు ప్రీతి ఎదురు తిరిగింది. ఎవరైతే మీ పిల్లలు అనుకున్నారో వాళ్లు మిమల్ని పట్టించుకోవడం మాని ఎదురుతిరుగుతున్నారు. ఎవరి కోసం మీరు ఈ ఇంటికి దూరం అయ్యారో ఆ రామ్ ప్రీతిలు మీకు దూరం అవుతున్నారు చూసుకో.
మహాలక్ష్మీ: అలా ఎప్పటికీ జరగదు వాళ్లు నా పిల్లలు.
సీత: కాదు ఇది మా మేనత్త సుమతి ఇళ్లు వాళ్లు మా అత్తమ్మ పిల్లలు సుమతి అత్తమ్మ వస్తే మీకు ఈ ఆస్తి ఉండదు అంతస్తు ఉండదు అందరిని వదిలేసి సన్యాసం తీసుకుంటా అన్నారు కదా. మా అత్తమ్మ వచ్చే టైం దగ్గర పడింది సన్యాసంలో కలిసి పోవడానికి రెడీ అయిపోండి. 
మహాలక్ష్మీ: నేను సన్యాసంలో కలవడం కాదే ఆ సుమతినే సమాధిలో కలిపేస్తా ఈ ఇంటిళ్లపాదిని నా కంట్రోల్‌లో పెట్టుకుంటా.

రామ్ గదిలో ఉంటాడు. సీత ఇంకా రాలేదేంటని చూస్తుంటాడు. సీత రావడంతో తనకు నిద్ర రావడం లేదని మాటలు చెప్పమని అంటాడు. సీత తనకు నిద్ర వస్తుంది అంటే నీకు నిద్ర రాకుండా చేస్తానని నిన్ను వశీకరణ చేస్తానని అప్పుడు నేను చెప్పినట్లు చేస్తావని అంటాడు. ఇక సీతని బెడ్ మీద కూర్చొపెట్టి తన కళ్లలోకి చూడమని అంటాడు సీత రామ్ చెప్పినట్లు చేసి వశీకరణ అయినట్లు నటిస్తుంది. రామ్ ముద్దు అడిగితే ఇచ్చినట్లే దగ్గరకు వెళ్లి తలగడ అడ్డు పెట్టేస్తుంది. ఏ వశీకరణం లేకుండా నేను నీ సొంతం కదా మామ అని అంటుంది. ఇక తమ ఫస్ట్ నైట్ కోసం ముహూర్తం పెట్టించమని మీ పిన్నికి చెప్పమని అంటుంది. ఇక రామ్ సీతని ముద్దు పెట్టుకుంటాడు. మరోవైపు శివకృష్ణ జనార్థన్ మాటలు తలచుకొని బాధ పడుతుంటాడు. లలిత వచ్చి ఓదార్చి సుమతి గురించి ఎంక్వైరీ చేయించమని అంటుంది. మహాలక్ష్మీని కూడా ఇంటరాగేట్ చేయమని అంటుంది . శివకృష్ణ సరే అంటాడు.

మరోవైపు మహాలక్ష్మీ ఇంటికి ఎస్‌ఐ ప్రవళ్లిక వస్తుంది. పోలీస్‌ని చూసిన అర్చన మహాలక్ష్మీకి ఇంటికి పోలీస్ వచ్చిందని చెప్తుంది. అయితే అది సీత అనుకొని మహాలక్ష్మీ గన్ తీసుకొని వెళ్తుంది. అర్చన నిజం పోలీసని చెప్పలేకపోతుంది. మహా కిందకి వెళ్లి పోలీస్ అధికారిణిని చూడకుండా సీత అనుకొని వెనక నుంచి గన్ గురిపెడుతుంది. అందరూ అడ్డుకోవాలి అని చూసినా వినకుండా సీత అనుకొని రెచ్చిపోతుంది. ఇంతలో వెనక నుంచి సీత వస్తుంది. దాంతో మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. తనపైకి గున్ గురి పెట్టినందుకు షూట్ చేసస్తా అని ఎస్ఐ మహాని బెదిరిస్తుంది. ఎస్‌ఐ మహాకి వార్నింగ్ ఇస్తుంది. అరెస్ట్ చేస్తా అని అంటుంది. రామ్ ఎస్‌ఐని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక ఎస్ఐని తనే రమ్మన్నాను అని సుమతి అత్తయ్య మీద మిసింగ్ కేసు పెట్టానని చెప్తుంది. ఇక సీసీ కెమెరాలో సుమతి సంబంధించిన విజువల్స్ గురించి చెప్తారు. ఇక సుమతి ఫొటోని పోలీసులకు సీత ఇస్తుంది. పోలీస్ వెళ్లిపోయిన తర్వాత మహా అర్చన చెంప పగలగొడుతుంది. ఎస్‌ఐ ముందు తల దించుకునేలా చేసినందుకు సీత మీద మహా ఫైర్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: గొంతు విప్పిన జయమ్మ, అదిరిపోయే శాసనం.. మనసులో మాటలు చెప్పి సత్యని దూరం పెడుతున్న క్రిష్‌!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Embed widget