అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 28th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మిథునకి మత్తుమందు ఐడియా ఇచ్చిన మహా.. రామ్‌ని లేపేస్తామంటోన్న గౌతమ్, రేఖలు!

Seethe Ramudi Katnam Today Episode మిథునకు రామ్‌తో నైట్ స్టే చేయమని మహా చెప్పడం రామ్‌ని చంపేసి ఆస్తి దక్కించుకుందామని గౌతమ్‌తో రేఖ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ ఆవేశంగా ఇంటికి వస్తాడు. అందరూ ఏమైందని అడుగుతారు. దాంతో రామ్ తనని మిథున ఇబ్బంది పెట్టిందని మిథునతో కలిసి బిజినెస్ ట్రిప్‌కి వెళ్లాలని అంటాడు. మహాలక్ష్మీ,అర్చనలు మంచిదే కదా మన బిజినెస్ కోసమే కదా అంటారు. 

రామ్: ఇది బిజినెస్ ట్రిప్‌లా లేదు నాతో కలిసి మిథున వేసిన పర్సనల్ ట్రిప్‌లా ఉంది. 
గౌతమ్: అలా అయితే లక్కీ ఛాన్స్ కొట్టేశావ్ బ్రో నాకు అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. 
రామ్: అయితే నువ్వు వెళ్లురా నేను మానేస్తే. మిథున కావాలనే నా వెంట పడుతుంది పిన్ని. అస్సలు తనని భరించలేను.
చలపతి: మిథున మనసులో ఏం ఉన్నా నువ్వు క్లారిటీగా ఉన్నావ్ కదా.
రామ్: నాకు నచ్చని వాళ్లు నా వెంట పడితే నాకు నచ్చదు మామయ్య. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది సీతని అనవసరంగా ఇంటి నుంచి పంపేశానా అని. 
చలపతి: అది ముమ్మాటికీ తప్పే అల్లుడు.
మహాలక్ష్మీ: సీత తప్పు చేసింది రామ్ పంపేశాడు అందులో తప్పేముంది.
చలపతి: తప్పు చేసిన అందరినీ పంపలేదు కదా క్షమించి వదిలేశాం కదా.
రామ్: కరెక్ట్ మామయ్య నేను వీలైనంత త్వరగా సీతని క్షమించి ఇంటికి తీసుకొస్తా. తన మీద పడిని నింద తొలగిపోనంత వరకు  సీత రాను అంది. అదేదో ఇక్కడే ఉండి నిరూపించుకోమని సీతకి చెప్పి తీసుకొస్తా. ఈ బిజినెస్ డీల్ అవ్వగానే సీతని తీసుకొస్తా.
అర్చన: ఏంటి మహా మనం రామ్, మిథునల్ని కలపాలి అనుకుంటే రామ్ సీతని ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు. మిథునని వదులుకుంటే వేల కోట్లు నష్టం వస్తుంది. 
మహాలక్ష్మీ: ఇంటి వరకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఎలా వదుకులుకుంటాం అర్చన. ఎలా అయినా ఆస్తి మనదే.
అర్చన: గౌతమ్ రేఖని ప్రేమించి చచ్చాడు. రామ్ మిథున వద్దు అంటున్నాడు మరెలా మహా. కొంపతీసి నీకు గౌతమ్‌లా మరొ కొడుకు ఉన్నాడా.
మహాలక్ష్మీ: నీకు ఎలా కనిపిస్తున్నాను. నాకు కన్నకొడుకు గౌతమ్ పెంచిన కొడుకు రామ్ తప్ప మరెవరూ లేరు. ఎలా అయినా మిథునని రామ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాను. రామ్ మిథునతో వెళ్లడం మనకు మంచి ఛాన్స్. రేపటి నుంచి వాళ్లిద్దరూ గంటల కొద్ది కలిసి ఉంటారు. వాళ్లు ఒక్కటి అయితే సీత వేరవుతుంది కదా.
అర్చన: అది అసాధ్యం మహా. రామ్ భార్య సీత మీద కొన్నాళ్లు చేయి వేయలేదు ఇక మిథున అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటాడు.
మహాలక్ష్మీ: అది మిథున టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మిథునని కలుద్దాం పద.

అర్చన, మహాలక్ష్మీలు మిథునని కలుస్తారు. రామ్‌కి రాత్రి పాలు తాగే అలవాటు ఉంది రామ్‌కి పాలు ఇచ్చేటప్పుడు మత్తు మందు కలుపు మీరు ఒక్కటి అయితే మేం తెల్లారాక కథ నడిపిస్తామని చెప్తుంది. మిథున నవ్వి మంచి ప్లాన్ బాగుంది నేను రెడీ అని అంటుంది. మరి సీత అంటే సీత గురించి వదిలేయ్ మేం చూసుకుంటాం అని అంటారు. నీ ఐడియా సూపర్ ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చాయ్ అంటే ఇంతకు ముందు మహా చాలా ప్లాన్స్ చేసిందని అన్నీ అర్చన చెప్పేస్తుంది. గౌతమ్ మహా కొడుకు అని చెప్పబోతే మహాలక్ష్మీ ఆపేస్తుంది. మహాలక్ష్మీ వాళ్ల మాటలు రేఖ చాటుగా వింటుంది.  సీతని సైడ్ చేయడానికి మహాలక్ష్మీ అత్తయ్య ఇంత పెద్ద స్కెచ్ వేసిందా ఈ విషయం వెంటనే గౌతమ్‌కి చెప్పాలి అనుకుంటుంది.

మహాలక్ష్మీకి నీ మీద ప్రేమ లేదని తన ప్రేమ అంటే తన సవతి కొడుకు రామ్‌ మీదే పెడుతుందని అంటుంది. మా అమ్మకి నేనే ఇష్టం అని చెప్తాడు. అంత లేదు అని మహాలక్ష్మీ, మిథునల ప్లాన్ చెప్తుంది. గౌతమ్ షాక్ అయిపోతాడు. మిథున ఈ ఇంటికి వస్తే మనం పని వాళ్లు అవుతాం అంటుంది. మిథునకు ఉన్న ఆస్తి నాకు లేదు. రామ్ ఈ ఇంటికి వారసుడు అన్నట్లు నువ్వు మహాలక్ష్మీ కొడుకు అని ఆవిడ చెప్పదు అంటుంది. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అని గౌతమ్ అంటే రామ్‌ని లేకుండా చేద్దామని అంటుంది. రామ్ లేకపోతే నువ్వు ఈ ఇంటికి వారసుడు అవుతావ్ అప్పుడు ఆస్తి మనదే అవుతుంది అని చెప్తుంది. మనం అదే రిసార్ట్‌కి వెళ్లి రామ్ పని ముగించుకొని వచ్చేద్దామని అనుకుంటారు. సీత బట్టలు సర్దుతుంటే రేవతి, కిరణ్‌లు వెళ్తారు. సీత బిజినెస్ ట్రిప్ గురించి చెప్తుంది. మహాలక్ష్మీ ప్లాన్ గురించి చెప్తుంది. అంత నీచంగా ప్లాన్ చేసిందా అని రేవతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget