Seethe Ramudi Katnam Serial Today April 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని యాక్సిడెంట్ చేసిన మహా.. ఆశ్రమానికి వెళ్లిన సీతారామ్‌లు సుమతిని చూస్తారా!
Seethe Ramudi Katnam Serial Today Episode అన్నని కలవడానికి వెళ్లిన సుమతిని రౌడీకి చెప్పి లారీతో ఢీకొట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మిని రోడ్డు మీద చూసి సుమతి ఇంటికి తీసుకొని వస్తుంది. తన భర్తకు పరిచయం చేస్తుంది. పిల్లల్ని మహాకి చూపిస్తుంది. సుమతి అదృష్టం, ఐశ్వర్యాన్ని చూసి మహాలక్ష్మి కుళ్లుకుంటుంది. ప్రీతి, రామ్‌లను మహా దగ్గరకు తీసుకుంటుంది.
మహాలక్ష్మి: (ప్రస్తుతం) ఆ రోజు నుంచి ఆ ఇంట్లో నేను ఒక మనిషిని అయిపోయాను. మెల్లమెల్లగా ఆ ఇంటిని మనుషుల్ని ఆక్రమించుకున్నాను.
మహాలక్ష్మి సుమతి ఇంట్లోనే ఉంటూ వంట చేయడం రామ్, ప్రీతిలను రెడీ చేయడం చేస్తుంది. ఇక జనార్థన్ వర్క్ చేస్తుంటే పక్కనే వెళ్లి కూర్చొని చేతులను తాకుతూ అతన్ని తన మాయలో పడేలా చేస్తుంది. సుమతి చూసినా మహా అందరితో కలిసిపోతుంది అని అతి మంచి తనంతో మురిసిపోతుంది.
ఒకసారి సుమతి వేసుకున్న బంగారం తీసి చీర అన్ని బెడ్ మీద పెట్టి రెడీ వాష్‌రూమ్‌కి వెళ్తే మహాలక్ష్మి చీర మీద వేసుకొని నగలు పెట్టుకొని మురిసిపోతుంది.
మహాలక్ష్మి: ఇలాంటి చీరలు నేను ఎప్పుడు కట్టుకుంటానో, నగలు ఎప్పుడు పెట్టుకుంటానో. ఆ ఆస్తి అంతా ఎప్పుడు నా సొంతం అవుతుందో. నేను ఈ ఇంటికి యజమానురాలిని అయ్యే రోజు ఎప్పుడు వస్తుందో.. సుమతి డైరీ రాస్తుంటే.. సుమతి ఏంటి నా దగ్గర ఏదో దాస్తున్నావ్. స్నేహితురాలిని నాతో కూడా చెప్పకూడదా.
సుమతి: నాకు మా పుట్టింటి వాళ్లు గుర్తొస్తున్నారు. నేను వాళ్లని చూసి చాలా సంవత్సరాలు అయింది.
మహాలక్ష్మి: అదేంటి మీ పుట్టింటివాళ్లతో నీకు సంబంధాలు లేవా..
సుమతి: లేదు.. జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. అందుకే వాటిని డైరీలో రాసుకుంటున్నాను.
మహాలక్ష్మి: అసలేమైంది సుమతి.
సుమతి: ఏం లేదులే అసలే నువ్వు కష్టాల్లో ఉన్నావు. నీకు మళ్లీ నా కష్టాలు చెప్పడం ఎందుకులే.
మహా పిల్లలతో ఆడుకుంటూ ఉంటే సుమతి పరుగున వచ్చి ఏవండీ మా అన్నయ్యకి ఒంట్లో బాలేదు అంట. మనం అర్జెంటుగా మా ఊరు వెళ్లాలి అంటుంది. జనార్థన్ తనకు ఆఫీస్‌లో పని ఉందని అంటాడు. దానికి సుమతి నేను ఒక్కదాన్ని వెళ్తా అంటే వద్దు అనేస్తాడు.
మహాలక్ష్మి: అదేంటండి అలా అంటారు. ఎన్ని గొడవలు ఉన్నా రక్త సంబంధీకులుకు బాలేదు అంటే వెళ్లి చూడాలి కదా. పైగా సుమతి అంటే వాళ్ల అన్నయ్యకి చాలా ఇష్టం అని చెప్పింది.
జనార్థన్: అంత ప్రేమ ఉంటే ఇన్నేళ్లలో మమల్ని చూడటానికి ఎందుకు రాలేదు. మా సంగతి పక్కన పెడితే పిల్నల్న చూడటానికి ఇప్పటి వరకు రాలేదు. నేను ఎవరో కూడా అతనికి తెలీదు.
సుమతి: అన్నయ్యకు ఈ పాటికి నా మీద కోపం తగ్గిపోయి ఉంటుందండి. అన్నయ్యని ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు నేను వెళ్తే తర్వాత వాళ్లు ఇక్కడికి వస్తారండీ.
జనార్థన్: మీ ఇష్టం నాకు అయితే ఇష్టం లేదు.
మహాలక్ష్మి: అన్నాచెల్లెల్లు కలుసుకుంటాను అంటే. అడ్డుచెప్పకూడదు అండి సుమతిని పంపించండి.
జనార్థన్: సరే వెళ్లిరా..
సుమతి: రామ్, ప్రీతి నేను రాత్రకంతా వచ్చేస్తా అప్పటి వరకు మిమల్ని ఈ ఆంటీ చూసుకుంటుంది.
మహాలక్ష్మి: మీకు ఏం భయం లేదు నేను మిమల్ని చూసుకుంటా. మీ బాధ్యత నాది. నువ్వు జాగ్రత్తగా వెళ్లిరా సుమతి. నువ్వు తిరిగి వచ్చేవరకు పిల్లల్ని ఇంటిని నేను చూసుకుంటా..(ప్రస్తుతం.. అలా సుమతి ఇంటిని, పిల్లల్ని, జనాని నాకు వదిలేసింది. ఆ అవకాశాన్ని నేను చక్కగా ఉపయోగించుకున్నాను.)
మహా రౌడీకి కాల్ చేసి సుమతి గురించి చెప్పి ఎవరికీ అనుమానం రాకుండా చంపేయ్ మని చెప్తుంది. మహా చెప్పిన రౌడీ టిప్పర్‌తో సుమతిని గుద్దేస్తాడు. ఇక సుమతి ఫొటోకి దండ వేసేస్తారు. జనా ఏడుస్తాడు. నాకు నా పిల్లలకు దిక్కులేదు అని మమల్ని ఎవరు చూసుకుంటారు అని ఏడుస్తాడు.
మహా రామ్, ప్రీతిని దగ్గరకు తీసుకొని ఆంటీ కాదు పిన్ని అని పిలవండి అని చెప్తుంది. జనార్థన్ షాక్ అవుతాడు. జనార్థన్ దగ్గర పెళ్లి ప్రపోజల్ పెడుతుంది.
మహాలక్ష్మి: ఇంత కష్ట పడి నేను కట్టుకున్న కోటలోకి ఎవరో అనామకురాలు సీత వస్తే నేను ఎందుకు భరించాలి. దాని చేతిలో ఎందుకు ఓడిపోవాలి. నేను స్నేహితురాలు అవ్వడం సుమతి దురదృష్టం. సుమతి మేనకోడలు కావడం సీత దురదృష్టం. సుమతికి పట్టిన గతే సీతకి పట్టిస్తా. చచ్చిన సుమతి బతకి వచ్చినా సీతని కాపాడలేదు.
సుమతి: ఆశ్రమంలో.. నా పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడే వాళ్లకి దూరం అయ్యాను. ఇప్పుడు వాళ్లు ఎలా ఉంటారో. ఎలా బతికారో.( ఇంతలో సీతా, రామ్‌లు కూడా అదే ఆశ్రమానికి వస్తారు. ) ఉన్నట్టుండి నాలో ఈ ఫీలింగ్ ఏంటి. నా పిల్లల్ని తలచుకోవడం వల్ల ఇలా అయిందా. లేదా నా ఆత్మ బంధువులు ఎవరైనా వచ్చారా.
రామ్: ఈ ఆశ్రమానికి తీసుకొచ్చావెందుకు సీత. ఇక్కడ ఎవరున్నారు.
సీత: మీ అమ్మగారు.
రామ్: ఏమన్నావ్ సీత మా అమ్మ ఇక్కడ ఉందా..
సీత: మీ అమ్మగారు అంటే మీ అమ్మ కాదు మామ. అత్తమ్మ లాంటి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మా అక్క ప్రాణాలతో బయట పడితే పళ్లు పంచుదాం అనుకున్నా అందుకే ఇక్కడికి తీసుకొచ్చా.
సీతా రామ్‌లు ఆశ్రమంలో అందరికి పళ్లు పంచుతారు. సుమతి బెడ్ చూసి ఇక్కడ ఎవరూ లేరు ఏంటి అనుకుంటారు. ఇక ఆ బెడ్ మీద పళ్లు పెట్టేస్తారు. ఇక స్వామి తన వాళ్లు త్వరలోనే నీ దగ్గరకు వస్తారు అని అంటారు. ఇక సుమతి కూడా నాకు అలాంటి అనుభూతే కలిగింది అని అనుకుంటుంది. మరోవైపు మధు గురించి శివకృష్ణ ఇంట్లో మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణకి భవాని రాసిన లెటర్ చింపేసిన ముకుంద.. భవాని దగ్గర శోభనం పంచాయితీ!