అన్వేషించండి

Satyabhama Serial Today May 9th : సత్యభామ సీరియల్: త్వరలోనే వారసుడిని ఇస్తానన్న సత్య, కుప్పకూలిపోయిన క్రిష్.. తల్లీకూతుళ్ల మాస్టర్ ప్లాన్!

Satyabhama Serial Today Episode : ముడుపు సిద్ధం చేయమని పంతులు విశాలాక్షికి చెప్తే అక్కడికి భైరవి వచ్చి వియ్యాల వారిని అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : తమకు వారసుల్ని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని మహదేవయ్య సత్యను ప్రశ్నిస్తాడు. దీంతో విశాలాక్షి సత్యకు సమాధానం చెప్పమని అంటుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్తున్నాను అని సత్య మనసులో అమ్మవారికి దండం పెట్టుకొని తనకి వారుసుల్ని ఇవ్వడం ఇష్టమే అని మహదేవయ్యతో చెప్తుంది.

మహదేవయ్య: రేయ్ చిన్నా.. మరి నీ సంగతి ఏంటిరా.

క్రిష్: వారసుల్ని ఇచ్చే విషయంలో పెళ్లాంది ఒక మాట మొగుడిది ఒక మాట ఉండదు కదా బాపు. 

విశాలాక్షి: పనిలో పని నందినితో కూడా ముడుపు కట్టిద్దామా వదినగారు.

విశ్వనాథం: అవును మా ఇంటికి కూడా వారసుడు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. హర్ష నువ్వు ఏమంటావ్.

భైరవి: నాకు అభ్యంతరం ఉంది. మనకు అంటే ఆచారం ఉంది కాబట్టి చేయిస్తున్నాం. వాళ్లకు లేదు కదా ఎందుకు. ఉన్న ఆచారం చేయకపోవడం ఎంత తప్పో. లేని ఆచారం చేయడం కూడా అంతే తప్పు.

మహదేవయ్య: ఇది కూడా కరెక్టే వదిలేయండి. పంతులు దోష నివారణకు పరిహారం ఏం చేయాలో మా వాళ్లకి చెప్పు.

పంతులు: అమ్మవారి ఆగ్రహం శాంతింపజేయడానికి ఒళ్లు వంచి పని చేయాలి. గుడిలోని మెట్లు అన్నీ శుభ్రం చేయాలి. ఆ తర్వాత ప్రతి మెట్టుకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి. 

భైరవి కోడలికి పంతులు చెప్పినట్లు చేయమని అంటుంది. ఇక పంతులు క్రిష్ కూడా చేయాలి అంటాడు. భైరవి క్రిష్ చేయలేడు అంటే వారసుడి కోసం తప్పదు చేయమని మహదేవయ్య అంటాడు. ఇక నందిని భైరవితో మాట్లాడటానికి తీసుకెళ్తుంది.

నందిని: నా బతుకుని ఏం చేయబోతున్నావ్. ఎంత సేపు కోడలి ముడుపు అనుకుంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నావ్ నా వైపే చూడటం లేదు.

భైరవి: ఎందుకే అట్లా గరం అయిపోతున్నావు. మీదకి కోడలి మీద అరుస్తున్నా లోపల ఆలోచిస్తున్నా. 

నందిని: ఏం ప్లాన్ చేస్తున్నావో నాకు చెప్పు. 

భైరవి: చెప్పను చేసి చూపిస్తా. అవును నేను చెప్పినట్లు ఉల్లి పాయలు పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నావు కదా. ఈ వేడి సరిపోదే ముఖం కూడా నీరసంగా పెట్టు. ముందు దోష పరిహారం పూజ పూర్తి అవ్వాలి. ఆ తర్వాత పదహారు రోజుల పండగ ప్రారంభం కావాలి. నీ మెడలో తాళి బొట్టు మార్చగానే నువ్వు చక్కెర వచ్చినట్లు పడిపోవాలి. ఆ తర్వాత మీ అత్తింటి వారి ముఖంలో కారం కొట్టి నిన్ను పుట్టింటికి తీసుకెళ్లిపోతా. నీ మొగుడి మెడ వంచుతా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయ్.. నేను చేయాల్సింది నేను చేస్తా. 

సత్య, క్రిష్‌లు అమ్మవారికి మొక్కుకుంటారు. సత్య తన భర్తతో విడిపోతూ ఇలా ముడుపు కట్టడం తప్పని కానీ పెద్దవాళ్ల కోసం తప్పకకడుతున్నానని మన్నించమని కోరుకుంటుంది. ఇక క్రిష్ తనకు కన్ఫ్యూజ్‌గా ఉందని ఏం కోరుకోవాలో అర్థం కావడం లేదని సత్య మనసులో మాట నెరవేరాలని కోరుకుంటాడు. 

ఇక సత్య క్రిష్‌లు చీపురు, బకెట్ పట్టుకొని కడగడానికి బయల్దేరుతారు. మెట్లు చూసి క్రిష్ షాక్ అయిపోతాడు. ఇంతలో మహదేవయ్య తొందరగా ప్రారంభించండని చెప్పడంతో క్రిష్ సరే అని వెళ్లాడు. క్రిష్ బిందెతో నీరు తీసుకొస్తాడు. సత్య మెట్లు కడుగుతుంది. 

పంతులు విశాలాక్షి దగ్గరకు వచ్చి ముడుపు సిద్ధం చేయమని చెప్తాడు. అమ్మవారి తర్వాత తల్లి దీవెన అంత గొప్పదని మంచిగా దీవించి ముడుపు కట్టమని అంటాడు. ఇక భైరవి వచ్చి ముడుపు పళ్లెం తీసుకుంటుంది. మహదేవయ్య వారసుడు అంటే ఓ రేంజ్‌లో ఉండాలని తామే ముడుపు సిద్ధం చేసుకుంటామని అంటుంది. విశ్వనాథం కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. 

హర్ష ఎదురు తిరగడంతో నందిని కూడా హర్ష మీద కోప్పడుతుంది. దీంతో విశ్వనాథం కొడుకుని అడ్డుకుంటాడు. పెద్దవాళ్లు గొడవ పడితే పిల్లల కాపురం మీద ఎఫెక్ట్ పడుతుందని.. గతాన్ని మర్చిపోదామని అంటాడు.

మహదేవయ్య: నాకు కావాల్సింది కూడా అదే బావగారు. మా ఇంట్లో మీ కూతురు నవ్వుతూ ఉండటం. మీ ఇంట్లో మా కూతురు నవ్వుతూ ఉండటం. భైరవి ఆ ముడుపు సామాను పెద్ద మనిషికి ఇవ్వు. ముడుపు ఎవరు కడితే ఏంటి. నా వారసుడిలో ఉండేది నా కొడుకు రక్తం. ఆటోమెటిక్‌గా నా పౌరుషం వస్తుంది. చెల్లమ్మ ముడుపు కడితే జరంత చదువు కూడా వస్తుందేమో చూద్దాం. పంతులు చూస్తారేంటి ఆ ముడుపు సామాను చెల్లమ్మ చేతికి ఇవ్వండి.

విశాలాక్షి: ఇద్దరం కలిసి చేద్దామా వదిన.

భైరవి: అవసరం లేదు కానీ. నెల తిరిగే సరికి నీ కూతురు నెల తప్పకపోతే అప్పుడు చెప్తా. 

సత్య గుడి మొత్తం కడుగుతుంది. క్రిష్ బిందెతో నీరు మోస్తాడు. క్రిష్ నీరు మోసి అలసి పోయి ఇబ్బంది పడతాడు. కడగడం అయిన తర్వాత సత్య మెట్లకు పసుపు రాస్తే క్రిష్ కుంకుమ పెడతాడు. ఇక క్రిష్ అలసిపోయి కూలబడిపోతే సత్య కుంకుమ తీసుకొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆట మొదలైందిగా.. ప్రియురాలి కడుపులో కృష్ణ, మురారిల బిడ్డ.. ఆదర్శ్‌కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద!

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
Nindu Noorella Saavasam Serial Today August 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శారీకి బగ్‌ పెట్టిన అమర్‌ - ఇంట్లోంచి పారిపోవడానికి సిద్దమైన చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శారీకి బగ్‌ పెట్టిన అమర్‌ - ఇంట్లోంచి పారిపోవడానికి సిద్దమైన చంభా
Illu Illalu Pillalu Serial Today August 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ ప్రయత్నాన్ని అమూల్య అర్థం చేసుకుంటుందా! ప్రేమని రెచ్చగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ ప్రయత్నాన్ని అమూల్య అర్థం చేసుకుంటుందా! ప్రేమని రెచ్చగొట్టిన ధీరజ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget