అన్వేషించండి

Satyabhama Serial Today May 29th: సత్యభామ సీరియల్: క్రిష్‌ ఎదుటే ఒకరినొకరు హగ్‌ చేసుకున్న శివ, సత్య చెంప పగలగొట్టిన రౌడీ బాయ్.. హర్షని వాటేసుకున్న నందిని! 

Satyabhama Serial Today Episode : సత్యకు తన కాలేజ్ ఫ్రెండ్ శివ కనిపించడం ఇద్దరూ చాలా చనువుగా మాట్లాడుకోవడంతో రగిలిపోయిన క్రిష్‌ శివని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : సత్య కోసం క్రిష్ క్యాంప్ ఫైర్ వెలిగించాలి అని ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో క్రిష్ చేతికి మళ్లీ గాయం అవుతుంది. సత్య కంగారు పడుతుంది. ఇక చక్రవర్తి వచ్చి మంట అంటుకుంది అని అంటాడు. తర్వాత ఆయన క్యాంప్ ఫైర్ వెలిగిస్తాడు. ఇంతలో రొమియో, జూలియట్ అని మరో ఇద్దరు అక్కడికి వస్తారు. ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటే మిగతా రెండు జంటలు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక చక్రవర్తి అంత్యాక్షరి ఆడమని అంటారు. అయితే మనసులో ఉన్న భావాలనే పాటలు పాడాలని అంటాడు.

సత్య ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అని పాడుతుంది. తర్వాత క్రిష్ జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ పాడుతాడు. తర్వాత నందినికి పాడమని అంటే తనతో ఈ పంచాయితీ కాదు అని నిద్రొస్తుందని వెళ్లిపోతుంది. హర్ష కూడా నందిని వెనకాలే వెళ్లిపోతాడు. రోమియో జూలియట్‌లు కూడా వెళ్లిపోతారు. చక్రవర్తి సత్య, క్రిష్‌లకు ఏకాంతంగా ఉండమని అంటాడు.

క్రిష్: మనసులో.. ఈ రోజు కాకపోయిన రేపు అయినా నీకు నా ప్రేమ అర్థమవుతుంది. విడాకుల విషయంలో నీ మనసు మారితే బాగుంటుంది. 

నందిని: ఫ్రెష్ అయి నైట్‌ డ్రెస్ వేసుకొని వచ్చి.. ఏంటి అలా చూస్తున్నావ్.

హర్ష: ఎలా చూస్తున్నాను.

నందిని: మింగేసే లెక్క.

హర్ష: భయం వేస్తుందా. 

నందిని: అంత లేదు చిరాకు పుడుతుంది.

హర్ష: రెగ్యులర్‌గా చీరల్లో చూసి సడెన్‌గా నైట్ డ్రస్‌లో కనిపించే సరికి డిఫరెంట్‌గా ఉన్నావ్ ఇలా కంటిన్యూ చేయొచ్చు కదా.

నందిని: ఏంటి నా మీద స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నావ్. 

హర్ష: ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం. ఇక్కడ నాకు మరే పని కూడా లేదు. అందుకే ప్రతీక్షణం నిన్ను స్పెషల్‌గా గమనిస్తున్నాను. 

నందిని: చూడు ఏం తోచకపోతే ముసుగేసుకొని పడుకో. ఫోన్ ఆన్ చేసుకొని లైక్‌లు షేర్లు చేసుకో నన్ను సతాయించకు. అంటూ నందిని వెళ్లబోతూ బొద్దింక చూసి కెవ్వుమని హర్షని వాటేసుకుంటుంది. కొద్ది సేపటికి హర్షకి కాల్ రావడంతో వెళ్లిపోతాడు. నందినికి భైరవి కాల్ చేస్తుంది.  

నందిని తన తల్లితో జరిగింది చెప్తుంది. భైరవి నందిని తిడుతుంది. మరోవైపు సత్య వర్షంలో ఎంజాయ్ చేసిన క్షణాలు గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. క్రిష్ అక్కడికి వచ్చి సత్యని చూస్తూ అలా ఉండిపోతాడు. సత్య చూసే సరికి తలగడ కోసం వచ్చాను అని తాను సోఫాలో పడుకుంటా అని అంటాడు. సత్య సరే అంటుంది. తర్వాత లేచి క్రిష్‌ని చూస్తుంది. క్రిష్ చూసే సరికి గుడ్ నైట్ అని చెప్తుంది. క్రిష్ సత్య గుడ్ నైట్ చెప్పిందని మురిసిపోతాడు. రేపు మరో ట్రీట్ సత్యకు ఇవ్వాలని అనుకుంటాడు. 

ఉదయం రుద్ర పనిలో ఉన్న వాళ్లని పిలిచి బాపుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా తాగి పడుకుండిపోతారా అని తిడతాడు. రౌడీలు క్షమించమని అడిగినా వినకుండా కొడతాడు. మహదేవయ్య వచ్చి అడ్డుకుంటాడు. 

రుద్ర: నేను చిన్నా ఇంట్లో లేమని ఆ నర్శింహ గాడికి ఎవరో చేరవేశారు. అందుకే ఇలా చేశాడు.

మహదేవయ్య: చిన్నా గాడు ఈడ లేకపోయినా వాడి పాణం మాత్రం ఇక్కడే ఉందిరా. హనీమూన్‌లో ఉండి కూడా మనకు కాపలా కాస్తున్నాడు.

రుద్ర: ఆ నర్శింహ గాడిని వదల కూడదు ఇప్పుడే పోయి వాడి సంగతి చెప్తా.

మహదేవయ్య: రుద్రా ఆగరా. ఆవేశంతో కాదురా సమయం చూసి వాడిని దెబ్బకొడదాం. రాజకీయాల్లో ఉన్నాం చేతికి మట్టి అంటకుండా పని కానీయ్యాలి.

క్రిష్, సత్యలు బయట తిరుగుతూ ఉంటారు. ఇంతలో సత్య ఫ్రెండ్ ఓ వ్యక్తి సత్య వెనక నుంచి వచ్చి కళ్లు మూస్తాడు. సత్య ఎవరు అని అడుగుతుంది. సత్య ఈ వాయిస్ ఎక్కడో ఉన్నట్లు ఉంది అని శివ అని పిలుస్తుంది. దాంతో శివ కాలేజ్ అయిపోయి చాలా రోజులు అయినా గొంతు బాగానే గుర్తుంచుకున్నావ్ అని అంటాడు. సత్యని పొడిగేస్తాడు. ఇద్దరూ చాలా క్లోజ్‌గా మాట్లాడుతారు. సత్య కోసం శివ తనకు ఇష్టమైన పాట పాడుతాడు. సత్య భుజాల మీద చేయి వేసి శివ మాట్లాడుతాడు. ఇంతలో క్రిష్ వచ్చి కోపంతో సత్య భుజాల మీద నుంచి చేయి తీసి శివని తోసేస్తాడు.

శివ: ఏయ్ ఎవరు నువ్వు.

క్రిష్: నువ్వు ఎవరి భుజాల మీద చేయి వేసి మాట్లాడావో ఆ మనిషి నాది. 

సత్య: శివ తను క్రిష్ నా భర్త. 

శివ: క్రిష్‌కి షేక్ హ్యాండ్ ఇస్తే క్రిష్ ఇవ్వడు. కాలేజ్‌లో నేను సత్య ఒకే గ్రూప్‌లో ఉండేవాళ్లం. 

క్రిష్: అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావ్. 

శివ: సీరియస్‌గా ఉంటూ కూడా మీ ఆయన భలే జోకులు వేస్తున్నాడు. ఇంట్రస్టింగ్‌ క్యారెక్టర్. సత్య చెప్పడం మర్చిపోయాను. వచ్చే నెల నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి. అంటూ సత్య, శివలు క్లోజ్‌గా మాట్లాడుతారు. శివ సత్యను హగ్‌ చేసుకుంటాడు. దాంతో క్రిష్‌ శివని కొడతాడు. శివతో క్రిష్ గొడవ పడతాడు. సత్య శివకి సారీ చెప్తుంది. శివని అక్కడి నుంచి పంపేస్తుంది. 

సత్య: నువ్వు అసలు మనిషివేనా ఏంటి ఆ కొట్టడం. చాలా కాలం తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్ నన్ను కలిసి మాట్లాడాడు.

క్రిష్: మాట్లాడితే పర్లేదు. ముట్టుకున్నాడు. హగ్ చేసుకున్నాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మేకప్ లేకుండా డస్కీ లుక్​తో ఫోటోషూట్ చేసిన శివానీ రాజశేఖర్.. ఫోటోల్లో చాలా Rawగా ఉందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget