అన్వేషించండి

Satyabhama Serial Today May 14th : సత్యభామ సీరియల్: పిల్లలు పుట్టకుండా మందులు వాడుతున్న రేణుక.. నందినిని శాశ్వతంగా పుట్టింట్లో ఉంచేందుకు భైరవి ప్లాన్!

Satyabhama Serial Today Episode : రేణుకకి గర్భం రాకుండా ఉండాలని రుద్ర ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : నందినిని మహదేవయ్య ఇంటికి తీసుకొస్తారు. డాక్టర్ చూసి జ్వరమని రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు. ఇక భైరవి బయటకు వచ్చి నందిని వీక్‌గా ఉంది జాగ్రత్తగా చూసుకోవాలని లేదంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ చెప్పారని అందరికీ చెప్తుంది. 

సత్య: వేరే సమస్యలు అంటే..

భైరవి: భయం వేసి ఆ మాట నేను అడగలేదమ్మ. అంతే కాదు మెంటల్‌గా కూడా ఏదో పరేషాన్‌లో ఉందని అనిపిస్తుందట. ఒక్కదాన్నే ఒంటరిగా విడిచిపెట్టొద్దని చెప్పారు. ఇలాంటప్పుడే బిడ్డకు తల్లి ప్రేమ అవసరం అవుతుంది. 

విశాలాక్షి: నందినికి మానసికంగా బాధ పడే అంత అవసరం ఏంటి.

భైరవి: అది నాకు ఎలా తెలుస్తుంది. కోడల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. అక్కడేం జరుగుతుందో మాకేం తెలుసు సీసీ కెమెరాలు పెట్టామా ఏంటి.

హర్ష: కావాలి అంటే పెట్టుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు.

సత్య: అత్తయ్య నందినిని వేరే ఎవరైనా మంచి డాక్టర్‌కి చూపిద్దామా. 

రుద్ర: నాయినా నీ కోడలికి మన ఇంటి మనుషుల మీదే కాదు మన ఫ్యామిలీ డాక్టర్ మీద అనుమానమే. 

భైరవి: నాకు తెలీక అడుగుతా వదినే..దానికి బాలేనప్పుడు గుడికి ఎందుకు తీసుకొచ్చారు. 

విశాలాక్షి: నందినికి జ్వరం అన్న విషయం మాకు తెలీదు వదినా. గుడిలో కూడా బాగానే ఉంది కదా.

హర్ష: ఎందుకో తను డల్‌గా ఉన్నట్లు అనిపించింది. అడిగాను కూడా పొగరుగా సమాధానం చెప్పింది.  

మహదేవయ్య: ప్రేమగా చూసుకుంటే ఎవరూ పొగరుగా ఉండరు. 

క్రిష్: పొగరుగా మాట్లాడింది అని పట్టించుకోకుండా ఉంటామా.

మహదేవయ్య: రేపు ప్రాణం మీదకు వచ్చినా ఇంతేనా.

సత్య: అసలు సమస్య ఏంటో నందినినే పిలిచి అడుగుదాం. అదిగో నందిని గుమ్మం దగ్గరే ఉంది.

భైరవి: మనసులో.. లోపల ఉండమంటే ఇది బయటకు ఎందుకు తగలబడింది. 

విశ్వనాథం: అది కాదమ్మా నువ్వు మెంటల్‌గా ఏదో ఇబ్బంది పడుతున్నావంట. అందరి ముందు అడుగుతున్నా నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పమ్మా. 

భైరవి: మనసులో.. సచ్చింది గొర్రె.

నందిని: బాపు నన్ను ఏం అడగొద్దు. ఇక్కడ ఉన్న వాళ్లంతా మంచోళ్లే. నేనే చెడ్డదాన్ని. ఒక్కటి మాత్రం నిజం బాపు నీ మీద అమ్మ మీద దిగులు పెట్టుకున్నాను.

భైరవి: బిడ్డను కొన్ని దినాలు మన దగ్గరే ఉంచుకుందామయ్యా. 

మహదేవయ్య: సరే కానీ రెండు దినాలు ఇక్కడే ఉంటుంది. అల్లుడు కూడా ఉంటాడు. 

హర్ష: నాకు కుదరదు.  

నందినిని ఇంటి దగ్గర వదిలేసి హర్ష వాళ్లు వెళ్లిపోతారు. మరోవైపు రుద్ర తన భార్య రేణుక దగ్గరకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇచ్చి తన దగ్గరకు రమ్మని అంటాడు. రేణుక పిల్లలు లేకుండా ఇలా ఎంత కాలమని మనసు మార్చుకోమని అంటుంది. దీంతో రుద్ర అవసరం అయితే పెళ్లాన్ని మార్చేస్తా కానీ పిల్లల విషయంలో మనసు మార్చుకోనని చెప్తాడు.

ఇక రేణుక దగ్గరకు సత్య వస్తుంది. సత్య రావడంతో ట్యాబ్లెట్స్ దాచేస్తుంది. ఇక సత్య ట్యాబ్లెట్స్ చూసి ఏంటవని అడిగితే రేణుక తలనొప్పి అంటే తన భర్త ఇచ్చాడని చెప్తుంది. 

ఇక నందిని పుట్టింటికి వచ్చిన ఆనందంలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. భైరవి కూతురు దగ్గరకు వచ్చి సంబరపడిపోతుంది. ఇక రెండు రోజులు కాకుండా జీవితాంతం ఇక్కడే ఉంచేస్తానని భైరవి అంటుంది. 

నందిని: అమ్మా ఎందుకో కానీ మీ అల్లుడులో మార్పు కనిపిస్తుంది. చూపుల్లో ప్రేమ తొంగి చూస్తుంది. మాటల్లో దగ్గరవ్వాలి అన్న ఉత్సాహం కనిపిస్తుంది. అందుకే రెండు దినాల తర్వాత ఇంటికి వచ్చి తీసుకెళ్లిపోతా అంటాడేమో. 

భైరవి: వస్తే రానీ నేను వెనక్కి పంపిస్తా కదా. నా కూతురు కావాలి అంటే ఈ ఇంట్లో ఇళ్లరికం ఉండమని అంటా. లేదు అంటే విడాకులు ఇచ్చేమంట. ఇక నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి ఆ సత్యని ఆడుకుంటా. 

సత్య క్రిష్‌లు వేరు వేరు బెడ్‌ల మీద పడుకొని ఉంటారు. క్రిష్‌ సత్య వైపు తిరిగి పడుకొని ఉన్న సత్యని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. జీవితాలు విడదీశావ్, మంచాలు విడదీశావ్ కానీ అందాన్ని మాత్రం నా కళ్ల ముందే ఉంచావని అనుకుంటాడు. ఇంతలో సత్య లేచి చూసే సరికి క్రిష్ పడుకున్నట్లు నటిస్తాడు. ఏయ్ ఏం చూస్తున్నావ్ అని సత్య అరుస్తుంది. ఇక క్రిష్‌ని తిట్టి సత్య పడుకుంటుంది. 

క్రిష్ సత్య పని చెప్పాలి అని ఫోన్ చూసి పక్కనే పెడతాడు. ఇక ఇంతలో రూమ్ డోర్ కొట్టడంతో ఎవరు అని అనుకుంటారు. ఇక సత్య క్రిష్‌ని మంచాలు దగ్గరకు వేయమని అంటుంది. క్రిష్ నో చెప్పడంతో సత్య బెడ్ దగ్గరకు సర్ది డోర్ తీస్తుంది. ఇంతలో ఎదురుగా పంకజం పాలు పట్టుకొని వస్తుంది. పంకజాన్ని సత్య వెళ్లిపోమంటే క్రిష్‌ పాలు తెమ్మని మెసేజ్ చేశాడని అంటుంది. దీంతో సత్య కోపంగా క్రిష్‌ని చూస్తుంది. ఇక పంకజం వెళ్లిపోయిన తర్వాత సత్య క్రిష్‌ని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: వాట్ ఏ సీన్.. ఆదర్శ్‌ని చూసి ముకుంద ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌కు కథంతా తారుమారు..!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
Yashaswini Swami: తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Godavari Serial Today July 10th: 'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు ఉన్నాడా! కల్యాణ్ కూడా ఫ్రాడేనా!
'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు కూడా ఉన్నాడా! కల్యాణ్ ఫ్రాడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget