అన్వేషించండి

Satyabhama Serial Today June 3rd: సత్యభామ సీరియల్: హనీమూన్‌లో ఒక్కటైపోయిన సత్య, క్రిష్‌లు.. నెల తప్పిన రేణుక, రుద్రకు నిజం తెలిస్తే!

Satyabhama Serial Today Episode : కాళీకి పదిలక్షలు ఇవ్వకపోతే సత్య పరువు తీసేస్తాడు అని విశ్వనాథం పడుతున్న టెన్షన్‌ను విశాలాక్షి గమనించి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : తాగిన మైకంలో ఉన్న సత్యను క్రిష్ గదికి తీసుకెళ్తాడు. రౌడీయిజం చేస్తే అమ్మాయిలు పడరు అని అర్థం చేసుకోవాలి అని అంటుంది. తన పర్మిషన్ లేకుండా తన జీవితంలోకి ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నిస్తుంది. తనకు మనసు ఉంటుందని ఏడుస్తుంది. చంపేశావ్ అని అంటుంది. సత్య మాటలకు క్రిష్ చాలా బాధ పడతాడు. తాగిన మైకంలో చంపేస్తాను అంటూ క్రిష్‌ని కొడుతుంది. అలాగే క్రిష్ మీద పడుకుండిపోతుంది. 

మరోవైపు కాళీ ఇచ్చిన వార్నింగ్‌కు విశ్వనాథం కుమిలిపోతాడు. విశాలాక్షి వచ్చి విశ్వనాథం ప్రవర్తన విచిత్రంగా ఉందని అంటుంది. అర్థం లేకుండా మాట్లాడుతూ అర్థం లేని పనులు చేస్తున్నారు అని తనని తప్పించుకొని తిరుగుతున్నారని భర్తని నిలదీస్తుంది. 

విశ్వనాథం: విచిత్రంగా మాట్లాడుతున్నావ్ విశాలాక్షి. నేను ఎందుకు నిన్ను తప్పించుకొని తిరగడం ఏంటి.

విశాలాక్షి: అది మీకే తెలియాలి. ఎప్పుడైనా ఇలా షర్టు తడిచేలా నీరు తాగారా. మీరు ఎందుకో బాధ పడుతున్నారు. సమస్య ఏంటో నాకు చెప్పండి. మీరు ఏదో విషయంలో భయ పడుతున్నారు అని అనిపిస్తుంది. 

విశ్వనాథం: నా చిన్ననాటి స్నేహితుడి సమస్య వల్ల నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను. తన కూతురిని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అంట. తాను అడిగిన పదిలక్షలు ఇవ్వకపోతే తన కూతురి వీడియో బయట పెడతాడు అంట. పాపం వాడు ఏడుస్తున్నాడు విశాలాక్షి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.

విశాలాక్షి: అతని కంటే మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. మీరే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో మీరే అప్పు తీసుకోండి. ఆడపిల్ల వీడియో బయట పడితే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది.విశ్వనాథం తెలిసిన వాళ్లకి అప్పు అడుగుతాడు. అందరూ చేతులెత్తేస్తారు. విశ్వనాథం ఏడుస్తాడు.

మరోవైపు క్రిష్ కసరత్తులు చేస్తాడు. సత్య లేచి తన డ్రెస్ మారి ఉండటం చూస్తుంది. షాక్ అయిపోతుంది. రాత్రి చీర కట్టుకుంటే ఇప్పుడు డ్రెస్ ఉంది ఏంటి అని ఆలోచిస్తుంది. క్రిష్ సత్యకు కన్ను కొట్టి ఎలా ఉంది నీకు అని అడుగుతాడు. 

సత్య: ఎలా ఉండటం ఏంటి బాగానే ఉన్నాను.

క్రిష్: వావ్ గ్రేట్.. బాగా అలసిపోయి నాకు మాత్రం ఒళ్లంతా నొప్పులు.

సత్య: మనసులో.. వీడేమో అలసిపోయాను అంటున్నాడు ఇక్కడేమో నా శారీ మారి డ్రస్ వచ్చింది. ఏం జరిగి ఉంటుంది. 

క్రిష్: అంత ఆలోచిస్తున్నావ్ ఏంటి గుర్తు చేసుకుంటున్నావా తీపి జ్ఞాపకాలు.. 

సత్య: వీడి మాటలు ఏంటి తేడాగా ఉన్నాయి ఏంటి.

తన శారీ మార్చింది ఎవరు అని అడిగితే క్రిష్ రాత్రంతా జరిగింది మర్చిపోయావా అని మెలికలు తిరుగుతాడు. తానే డ్రస్ మార్చాను అని చెప్తాడు. సత్య నోరెళ్లబెడుతుంది. రాత్రి జరిగినది గుర్తు చేసుకుంటే మస్త్ మజా వస్తుందని.. నువ్వు అనుకున్నది జరిగిందని అంటాడు. ఫస్ట్ నైట్ రోజు మిస్ అయింది ఈ హనీమూన్ పుణ్యామా అని జరిగింది అని అంటాడు. వచ్చిన పని అయిపోయింది అని ఇంటికి వెళ్లిపోదాం రెడీ అవ్వు అని తాను నందిని వాళ్ల రూమ్‌కి వెళ్తానని అంటాడు. సత్య తెగ టెన్షన్ పడుతుంది. 

మరోవైపు రేణుక నెల తప్పుతుంది. తాను ఇప్పుడు అమ్మని కాబోతున్నానని తన భర్తకు తెలిస్తే తీసుకెళ్లి కడుపులో బిడ్డ ప్రాణం తీసేస్తాడు అని ఏడుస్తుంది. అప్పుడే ఎవరికీ నిజం చెప్పను అని అనుకుంటుంది. మరోవైపు హనీమూన్ జంటలు ఇంటికి బయల్దేరుతారు. క్రిష్ సత్యతో మనకు మగపిల్లాడు పుడతాడు అని అంటాడు. క్రిష్ చక్రవర్తికి రాత్రి ఏం జరిగింది అని చెప్పబోతే సత్య ఆపేస్తుంది. ఇంటికి బయల్దేరుదామని అంటుంది. కానీ క్రిష్ కవర్ చేస్తావు. తనకు ఈ రిసార్ట్ బాగా దగ్గర చేసిందని సత్యని ఏడిపించేలా మాట్లాడుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌కి గుండెపోటు.. పోటీల్లో విజయం సాధించిన సీత.. మధు పీడ పోయినట్లేనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Embed widget