అన్వేషించండి

Satyabhama Serial Today June 19th: సత్యభామ సీరియల్: తన మనసు గెలుచుకున్నావ్ అని క్రిష్‌తో చెప్పిన సత్య.. రేణుక విషయం తెలిసి మహదేవయ్య ఇంట్లో రచ్చరచ్చ!

Satyabhama Serial Today Episode రేణుక గర్భాన్ని తొలగించాలి అని రుద్ర ప్రయత్నించాడు అని తెలుసుకున్న మహదేవయ్య గన్ తెచ్చి రుద్రని చంపాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode రేణుక గర్భాన్ని రుద్ర తీయించాలి అన్న విషయం ఇంట్లో చెప్తాను అని క్రిష్ వదిన, సత్యలను తీసుకొని ఇంటికి వస్తాడు. మరోవైపు మహదేవయ్య పిల్లలు చెప్పకుండా వెళ్లారని భైరవి మీద కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో క్రిష్ వాళ్లు రావడంతో వాళ్లని కొట్టకుండా గట్టిగా చెప్పమని భైరవి అంటుంది. మహదేవయ్య ముగ్గురిని చూసి ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. చెప్పకుండా వెళ్లారని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని తిడతాడు. ఇక అప్పుడే రుద్ర వస్తాడు. భయపడుతూనే లోపలికి వస్తాడు.

సత్య: మీరు అడిగిన ప్రశ్నకి మేం సమాధానం చెప్పడం కంటే బావగారు చెప్తే బాగుంటుంది మామయ్య గారు.
క్రిష్: చెప్పకుండా పోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అని బాపు అడుగుతున్నాడు చెప్పు. 
సత్య: మౌనంగా ఉండాలి అని చూసినా మీరు చేసిన తప్పు ఒప్పు అయిపోదు కదా బావగారు. మీ నోటి తోనే చెప్పేయండి బావగారు మర్యాదగా ఉంటుంది.
భైరవి: ఏయ్ నిలదీస్తున్నావ్ ఏంటే.. పెద్దా చిన్నా లేదా.
క్రిష్: మర్యాద లేని పనులు చేస్తే పెద్దా చిన్నా ఉండదు అమ్మా. ఎవరైనా ఒక్కటే.
భైరవి: మర్యాద లేని పని వాడు ఏం చేశాడు.
మహదేవయ్య: నీ నోరు విప్పరా. అరే నువ్వు అయినా డైరెక్ట్‌గా చెప్పమ్మ.
సత్య: మీ పెద్ద కోడలు కడుపుతో ఉంది. మీ పెద్ద కోడలు కడుపులో ఉన్న ఈ ఇంటి వారుసుడిని ప్రాణాలతో బయటకు రాకుండా చేయడానికి ఈ పెద్ద మనిషి అక్కని హాస్పిటల్‌కి లాక్కెళ్లాడు. ఇది ఈయనకు మొదటి సారి కాదు. గతంలో కూడా రెండు సార్లు ఇదే పని చేశారు. 

సత్య మాటలకు షాక్ అయిన మహదేవయ్య కోపంతో రుద్రని చితక్కొడతాడు. తప్పునైనా క్షమిస్తాను కానీ మోసాన్ని క్షమించను అని అంటాడు. సత్య రుద్రని క్షమించొద్దు అంటే రేణుక సత్యని మాట్లాడొద్దని అంటుంది. నీకు నరకం చూపించిన ఈ మనిషిని ఎందుకు క్షమించమని అడుగుతున్నావ్ అని అంటుంది. 

భైరవి: ఇది వాళ్ల మొగుడు పెళ్లాల ముచ్చట నువ్వు లొళ్లి పెద్దది చేయకు సత్య.
మహదేవయ్య: ఏయ్ ఇది మొగుడు పెళ్లాల ముచ్చట కాదు ఈ ఇంటి వారసుడి ముచ్చట. ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవా. ఎంత సేపు నీ అర్బాటాలేనా.
రుద్ర: ఈ ఇంటి వారసుడి కోసం నా మనసు చంపుకోవాలా బాపు. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. నచ్చని మనిషితో కాపురం చేయాల్సిందే అన్నారు. ఈ ఇంటి కట్టుబాట్లకు మీ పెద్దరికానికి తల వంచి మీరు చెప్పినట్లు చేస్తున్నా అది సరిపోదా. అది నేను మీకు ఇస్తున్న మర్యాద కాదా. దాని కడుపున పుట్టిన బిడ్డతో నాయినా అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే దాని కడుపులో బిడ్డల్ని బయటకు రానియ్యలే. రెండు సార్లు కాదు. అది నా మాట వినకుండా ఎదురు తిరిగితే ఇరవై సార్లు అయినా ఇదే చేస్తా. 

రుద్ర మాటలకు మహదేవయ్య ఆవేషంగా మీదకి వెళ్లి గన్ పట్టుకొని వస్తాడు. ఇరవై సార్లు అయినా ఇదే చేస్తా అని తన పెద్దరికానికి ఛాలెంజ్ చేస్తున్నాడు అని ఇంత వరకు వచ్చిన తర్వాత వాడు అయినా ఉండాలి లేదా నేను అయినా ఉండాలి అంటాడు. రుద్ర చేతిలో గన్ పెట్టి తనని చంపమని అంటాడు. నీకు చేతకాకపోతే నేనే నిన్ను చంపుతా అంటాడు. అందరూ కంగారు పడతారు. రుద్ర మాత్రం తండ్రికి గురి పెట్టి చంపడానికి రెడీ అయిపోతాడు. ఇంతలో రేణుక వచ్చు మీ ఇద్దరు మొండితనం మానుకోకపోతే నేను చనిపోతా అంటుంది. 

రేణుక: నాకు నా కడుపులో బిడ్డ ఎంత ముఖ్యమో నా భర్త కూడా అంతే ముఖ్యం. నాకు నా బిడ్డ కావాలి. నా భర్త కావాలి.
సత్య: చూశారా బావగారు మీరు అక్కకి నరకం చూపించినా తను మీ మంచి తనం కోరుకుంటుంది. అక్క మంచి తనం ఇప్పటికైనా అర్థం అయిందా. అహంకారంగా ప్రవర్తించి ఆడదాని మనసుతో ఆడుకోకండి. దయచేసి అక్క కడుపులో బిడ్డ జోలికి వెళ్లకండి. బిడ్డని బతకనివ్వండి.
మహదేవయ్య: ఇంత మంచిగా చెప్పడం నాకు చేతకాదు. రేణుక కడుపులో బిడ్డ క్షేమంగా భూమ్మీద పడే బాధ్యత నీది తేడా రాకూడదు. నీ పెళ్లాంలో మొండితనమే ఉంది అనుకున్నా మంచి తనం కూడా ఉంది. అదృష్టవంతుడివి. నీ తోటి కోడలు బిడ్డ వరకు వస్తేనే ఇంతలా ఆలోచించావు అంటే నీ వరకు వస్తే ఇంకెంత జాగ్రత్త పడతావో. నీ కడుపులో బిడ్డని ఎంత ఇష్టపడతావో అర్థమైంది అమ్మ. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను డెలవరీకీ తీసుకెళ్లడానికి నీ పుట్టింటి వాళ్లు వస్తారేమో నేను పంపించను అని ఇప్పుడే చెప్పేయ్. నువ్వు ఇక్కడే మా మధ్యలోనే ఉండాలి. 

సత్య రేణుక ఒకర్ని ఒకరు హత్తుకుంటారు. ఇక గదిలో క్రిష్ చేతి కడియం సత్య వైపు రావడంతో క్రిష్ గీత దాటేస్తాడు. సత్య కోపంగా చూస్తే క్రిష్ భయపడతాడు. ఇక రేణుకను సపోర్ట్ చేసి అన్నని ఎదురించినందుకు సత్య క్రిష్‌కి థ్యాంక్స్ చెప్తుంది.  అది నా బాధ్యత అని క్రిష్ అంటాడు. మొదటి సారి నీలో నిజాయితీ చూశాను నీలో మంచితనం చూశాను అని సత్య అంటుంది. ఇక క్రిష్‌ సత్యకు మొదటిసారి నన్ను నమ్మినందుకు మెచ్చుకున్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు మారిపోయావ్ అని అనుమానం పక్కన పెట్టి అభిమానంగా చూస్తున్నావ్ అని అంటాడు. ఇక సత్య నవ్వుతూ నీ మీద గౌరవం పెరిగిందని మనసు గెలుచుకున్నావ్ అని అంటాడు. దీంతో క్రిష్ మురిసిపోతాడు. సత్య నవ్వుకుంటుంది. 

మహదేవయ్య క్రిష్ పిలిచి మహదేవయ్యని ఓడించడానికి ఎవరో ఎలక్షన్‌లో ఇండిపెండెంట్‌గా నిల్చొంటారు అని చెప్తాడు. ఇక రుద్ర అక్కడికి వస్తాడు. తాను చూసుకుంటాను అని రుద్ర అంటే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి బలంతో పాటు తెలివి ఉండాలి అని అది నేనే చూసుకుంటాను అని మహదేవయ్య అంటాడు. ఇక నేను వస్తాను అని రుద్ర అంటే వద్దని క్రిష్‌ని తీసుకెళ్తాడు. దాంతో రుద్ర రగిలిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: మగాడిలా మాట్లాడి బెంబేలెత్తించిన తిలోత్తమ.. దిష్టి తీయడంతో బయటపడ్డ అసలు రంగు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Crime News: ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
Budget 2025: పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keslapur Nagaoba Jathara | ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధం | ABP DesamG Trisha Century U19 Womens T20 World Cup | టీమిండియాను సెమీస్ కు తీసుకెళ్లిన తెలంగాణ అమ్మాయి | ABPMaha Kumbha Mela 2025 | ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్న భక్తులు | ABP DesamChiranjeevi Speech at Experium | ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును ప్రారంభోత్సవంలో చిరంజీవి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Crime News: ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
Budget 2025: పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
SSMB29: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
Crime News: చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !
చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !
Nara Lokesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
Embed widget