అన్వేషించండి

Satyabhama Serial Today January 17th: ‘సత్యభామ’ సీరియల్ : మహదేవయ్యకు సంతకం చేసిన క్రిష్‌ – సత్యకు షాకిచ్చిన సంధ్య

Satyabhama Today Episode:  క్రిష్‌ మహాదేవయ్యకు సంతకం చేయడం.. సంధ్య కూడా సంతకం చేయడానికి రాకపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Satyabhama  Serial Today Episode:  అందరూ కలిసి నామినేషన్స్‌ వేయడానికి ఆఫీసు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన మహదేవయ్య సత్యను చూస్తూ నువ్వు నామినేషన్‌ వేయడానికి నీతో పది మంది లేరు కదా అంటాడు. ఒకసారి అటు చూడండి మామయ్య అంటుంది సత్య. అందరూ అటు చూస్తారు ఎవరు వచ్చారని అడుగుతారు.

మహాదేవయ్య: ఇంకెవరు నా చిన్న కొడుకు వచ్చాడు.. అరేయ్‌ చిన్నా నేను గెలవాలని నువ్వు మనఃస్పూర్తిగా సంతకం చేయరా..?

క్రిష్: మనసు చంపుకొని మా బాపుకి సపోర్ట్ గా నిలుస్తున్నాను సత్య నన్ను దయచేసి ఏమీ అనుకోవద్దు (అని మనసులో అనుకుంటాడు. సత్య అన్న మాటలు గుర్తుచేసుకొని క్రిష్ బాధపడతాడు.)

క్రిష్‌ సంతకం పెట్టగానే ఇక నెక్స్ట్‌ సత్య నామినేషన్‌ వేయాలి అని ఆఫీసర్లు చెప్తారు. సత్యకు సపోర్టుగా పది మంది ఉన్నారా..? లేరా అని అందరూ చూస్తుంటారు. సత్యకు పది మంది లేరని అనుకుంటారు. ఇంతలో మహాదేవయ్య, సత్య దగ్గరకు వస్తాడు.

మహాదేవయ్య: నా మీద పంతంతోనే నువ్వు పోటీ చేస్తున్నావని నాకు తెలుసు. నిన్న నరసింహ ఏమన్నాడో చూసావు కదా అలాంటి వాళ్ళు నోరు మూయాలంటే నువ్వు నామినేషన్స్ నుంచి తప్పుకుంటావో లేకపోతే నామినేషన్లు వేస్తావో అది నీ ఇష్టం కోడలా..

అని మహాదేవయ్యా చెప్పగానే.. రుద్రా కూడా సత్యను ఎగతాళి చేస్తాడు.

రుద్ర: నామినేషన్‌ వేయడానికే పది మంది లేరు. ఇక ఎలా గెలుస్తావు. నీ మొగుడు కూడా నీకు సంతకం చేయలేదు..

సత్య: సరే మామయ్య కానీ చిన్న కొడుకు చెప్తే నేను ఏదైనా చేస్తాను. తను నామినేషన్‌ వేయమంటే వేస్తాను. లేదంటే వేయను..

భైరవి: ఇదేదో ఇంటిదగ్గర చెప్తే బాగుండేది కదా అప్పుడే వెనక్కి తగ్గే వాళ్ళం ఇంత జరిగేది కాదు కదా

క్రిష్: ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గితే ఏదో ఒకటి అవుతుంది. సత్య వెనక్కి తగ్గకూడదు.. సత్య తప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తప్పుకుంటే మనం తప్పించామని  అందరూ అనుకుంటారు.

మహాదేవయ్య: అవునా అయితే సత్య దగ్గర పదిమంది లేరు కదా

సత్య: నా దగ్గర పదిమంది లేరని మీరు అనుకుంటున్నారు ఒకసారి అటు చూడండి నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారో..

అని సత్య చెప్పగానే డోర్‌ వైపు చూస్తాడు మహాదేవయ్య.  చక్రవర్తి రావడం చూసి మహదేవయ్య షాక్ అవుతాడు. చక్రవర్తికి ఎదురుగా వెళ్తాడు.

మహదేవయ్య:  నీ కోడలికి సపోర్ట్ చేయాలని వస్తున్నావా..? నా గురించి నీకు తెలియదా..?

అంటూ మహాదేవయ్య బెదిరిస్తాడు. అయినా చక్రవర్తి భయపడకుండా ఉంటాడు.

చక్రవర్తి: నేను ఇక్కడకు వచ్చింది సత్యకు ఒక మాట చెప్పడానికి.. ఆ మాటేదో చెప్పి వెళ్లిపోతాను.   

మహదేవయ్య: అయితే నువ్వు సపోర్టు చేస్తే సత్య గెలుస్తుందా..? అయితే నువ్వు సపోర్టు చేయాల్సిందే..?

అని చెప్తుండగానే చక్రవర్తి లోపలికి వెళ్తాడు. లోపలికి వచ్చిన చక్రవర్తిని అందరూ తిడతారు. సత్యతో మాట్లాడి చక్రవర్తి వెళ్లిపోతాడు.  ఇక సత్యకు సపోర్టు చేస్తానన్న సంధ్య ఇంకా రాలేదని విశ్వనాథం ఫోన్‌ చేస్తాడు. సంధ్య తాను రానని మామయ్య మీద అక్క పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్తుంది.  దీంతో సత్య డైలమాలో పడిపోతుంది. సత్య బాధను చూసిన క్రిష్‌ కూడా ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget