Satyabhama Serial Today August 26th: సత్యభామ సీరియల్: సత్య ప్రెగ్నెంట్ కాదని అనుమానంలో మహదేవయ్య పెద్దమ్మ.. సత్య, క్రిష్‌లు ఏం చేయనున్నారు!
Satyabhama Today Episode సత్య ప్రెగ్నెంట్ కాదని తెలిసిన భైరవి సత్యని తన పెద్ద అత్త దగ్గర ఇరికించాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Satyabhama Serial Today August 26th: సత్యభామ సీరియల్: సత్య ప్రెగ్నెంట్ కాదని అనుమానంలో మహదేవయ్య పెద్దమ్మ.. సత్య, క్రిష్‌లు ఏం చేయనున్నారు! satyabhama serial today august 26th episode written update in telugu Satyabhama Serial Today August 26th: సత్యభామ సీరియల్: సత్య ప్రెగ్నెంట్ కాదని అనుమానంలో మహదేవయ్య పెద్దమ్మ.. సత్య, క్రిష్‌లు ఏం చేయనున్నారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/856fb08cb09330952e5b0d7f2d16de5f1724644484843882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Satyabhama Serial Today Episode మహదేవయ్య పెద్దమ్మ ఇంటికి వస్తుంది. అందర్ని చూడాలి అనిపించి వచ్చానని అంటుంది. ఇక భైరవి తన భర్తకి పిల్లలు అంటే ఇష్టమని నెలల తేడాలోనే ఇద్దరు వారసులు వస్తున్నారని చెప్తుంది. విశ్వనాథం కూడా తనకు చాలా సంతోషంగా ఉందని అంటాడు. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు.
భైరవి: మనసులో నవ్వుకోండి నవ్వుకోండి కొద్ది సేపట్లో ఆ నవ్వులు ఆవిరి అయిపోతాయి.
మహదేవయ్యపెద్దమ్మ: మహదేవయ్య ఏంటి నీ కూతురు పుట్టింటికి వచ్చి చుట్టంలా కూర్చొంది పుట్టింటికి వచ్చిన సంతోషమే లేదు.
మహదేవయ్య: అది కొంచెం అలిగింది పెద్దమ్మ కొన్ని రోజులు ఆగితే అదే సెట్ అవుతుంది.
జయమ్మ: అలా అని దూరం పెడితే ఎలా దగ్గరకు తీసుకోవాలి.
మహదేవయ్యపెద్దమ్మ: ఇన్ని దినాల నుంచి నేను నిన్ను దగ్గరకు తీసుకుందాం అంటే నువ్వు నన్ను దూరం పెట్టడం లేదా ఇది అంతే. నీ లెక్క అది కూడా మొండిది సంతోషం ఏంటి అంటే గంట పక్కన పెట్టి గొంతుతో మాట్లాడుతున్నావ్.
క్రిష్, సత్యలు బయట నుంచి వస్తారు. అందరూ సత్యకి కంగ్రాట్స్ చెప్తారు. సత్య డల్‌గా ఉంటుంది. క్రిష్, సత్య ఇద్దరూ మహాదేవయ్య పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక విశ్వనాథం కూతురి చేతికి సంచి ఇస్తే భైరవి మూట తీసుకొని నా కోడలితో బరువులు మోయించొద్దని అంటుంది. ఇక సత్య, క్రిష్‌లని కొన్ని రోజులు పుట్టింటికి తీసుకెళ్తానని విశ్వనాథం అంటాడు. రేణుక సత్య కోసం మామిడి కాయ ముక్కలు తీసుకొస్తుంది. సత్య టెన్షన్ పడుతూనే తింటుంది. మహదేవయ్య పెద్దమ్మ సత్యని అనుమానిస్తుంది. సత్య గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. క్రిష్ కూడా వెనకాలే వస్తాడు. అందరిని మోసం చేస్తున్నామ్ అని సత్య అంటే క్రిష్ నచ్చచెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సత్య అందరితో అబద్దం చెప్పాల్సి వస్తుందని ఏడుస్తుంది.
భైరవి క్రిష్ దగ్గరకు వచ్చి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావ్ అంటే క్రిష్ తల్లిమీద చిరాకు పడతాడు. సత్య రెడీ అయిన తర్వాత తాను రెడీ అవుతానని అంటాడు ఇక క్రిష్ కళ్లు మూసుకొని లోపలికి వెళ్తాడు. ఇక సత్య ఫోన్‌కి ప్రెగ్నెన్సీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అంటుంది. రిపోర్ట్ నెగిటివ్ వచ్చాయని అందరికీ చెప్దామని అంటే ఇప్పుడు చెప్పడం కుదరదు అని క్రిష్ అంటాడు. పూజలో ముందు కూర్చొని తర్వాత తండ్రికి విషయం చెప్తానని క్రిష్ అంటాడు. ఇద్దరూ పూజకి రెడీ అయి కిందకి వస్తారు. పూజకు అన్నీ ఏర్పాట్లు మొదలవుతాయి. సత్య క్రిష్‌లు కిందకి వస్తారు. ఇద్దరూ పూజలో కూర్చొంటారు. ఇక పంతులు ఇంటి ఆడపడుచుతో జంటకి హారతి ఇవ్వమంటే నందిని తనని ఆడపడుచుగా చూడరని బాధతో హారతి ఇవ్వనని అంటుంది. విశ్వనాథం ఒప్పించే ప్రయత్నం చేస్తే నేను మీ కోడలిగా వచ్చానని అంటుంది.
క్రిష్ చెప్పడంతో నందిని హారతి ఇస్తుంది. క్రిష్ కట్నం ఇస్తే నందిని మీ అమ్మకి చీర కొనిపెట్టని చిరాకు పడుతుంది. సత్య క్రిష్‌లు హోమం చేస్తారు. ఇంతలో మహదేవయ్య పెద్దమ్మ సత్య దగ్గరకు వెళ్లి నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా అని అడుగుతుంది. సత్య, క్రిష్‌లు టెన్షన్ పడతారు. సత్యనే సమాధానం చెప్పమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)