అన్వేషించండి

Satyabhama Serial Today April 26th: సత్యభామ సీరియల్: క్రిష్‌కి కారం తినిపించి చుక్కలు చూపించిన సత్య.. హర్షని ఇళ్లరికం ఉండిపోమన్న భైరవి, వద్దన్న మహదేవయ్య!

Satyabhama Serial Today Episode నందినికి అత్తింటికి వెళ్లడం ఇష్టం లేదని హర్షని ఇళ్లరికం ఉండిపోమని భైరవి చెప్పగా హర్ష గొడవ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్ మీద రివేంజ్ తీర్చుకోవడానికి ఉగాది పచ్చడిలో చాలా మిరపకాయలు కట్ చేసి సత్య వేస్తుంది. అది చూసిన సంధ్య ప్రశ్నించడంతో మీ బావగారిని నువ్వు ఆటపట్టించడం లేదు కదా అందుకే నేను ఆటపట్టిస్తున్నా అంటుంది. నోరు మండిపోతుందని సంధ్య అంటే పర్వాలేదని అంటుంది. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని సంధ్యతో సత్య చెప్తుంది. సంధ్య అందికీ ఇస్తే సత్య క్రిష్‌కి ఇస్తుంది.

సత్య: పెద్ద బౌల్‌లో తీసుకొచ్చాను మొత్తం తినగలరా..
క్రిష్: నీ చేతితో ఇస్తే ఎంత అయినా ఏది అయినా తినేస్తా..
పంతులు: బాబు కొంచెం కూడా వదలకూడదు. అప్పుడే వ్రత ఫలితం దక్కుతుంది. 
సత్య: విన్నారు కదా మొత్తం తినాలి. 
క్రిష్: అస్సలు వదిలిపెట్టను. సత్యకు కూడా చెప్పండి మొత్తం తినిపించాలి అని.
సత్య: అయ్యో వ్రత ఫలం కోసం చేతిలో హారతి వెలిగించుకున్నదాన్ని ఆ మాత్రం తినిపించలేనా మీకు. అస్సలు వెనక్కి తగ్గను.
క్రిష్: ముందు నేను నీకు తినిపిస్తా..
సత్య: మనసులో.. అది తింటే అల్లాడిపోతాను. దొంగ సచ్చినోడు తెలిసో తెలీకో ఇలా ఇరికించేశాడు ఏంటి.
సంధ్య: వద్దు.
శాంతమ్మ: ఏంటే అంత గట్టిగా అరిచావ్.
సంధ్య: అంటే ఇంతకు ముందు చెప్పారు కదా అక్క బదులు బావ హారతి వెలిగించకూడదు అని ఇప్పుడు బావ కూడా అక్కతో షేర్ చేసుకోకూడదు.
సత్య: అవునవును.. ఇలా ఇవ్వండి నేను తినిపిస్తా..
క్రిష్: వామ్మో ఇంత కారంగా ఉంది ఏంటి.   
సత్య: మనసులో.. మండుతున్నట్లుంది. ఈ కారం ప్లాన్ ఈ సత్యది. అయ్యో తినండి ఒక్క స్పూనే కదా ఇంక బౌల్ అంతా ఖాళీ చేయాలి. 
విశాలాక్షి: ఏమైంది బాబు కళ్లలో నీళ్లు వస్తున్నాయి. 
సంధ్య: అవి ఆనందభాష్పాలు.
శాంతమ్మ: భార్య అందరి ముందు తినిపిస్తే ఆ మాత్రం ఆనందం రాదా.. 
పంతులు: ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం.
క్రిష్: నాకు ఎందుకో ఒకటే రుచి తెలుస్తుంది పంతులుగారు. 
సంధ్య: కావాలని మా అక్కను ఏడిపించడానికి అలా అంటున్నారు కదా మీరు. ఇక సత్య తినను అని క్రిష్ అంటే సత్య మొత్తం తినిపించేస్తుంది. 

మరోవైపు మహదేవయ్య ఇంట్లో అందరూ ఉగాది పచ్చది తింటారు. నందినికి రేణుక ఉగాది పచ్చడి ఇస్తే నందిని వద్దు అని అంటుంది. వదినను కసిరేస్తుంది. మరోవైపు ఇద్దరు ఆడవాళ్లు వచ్చి కూతురికి అత్తింటిలో ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే అల్లుడిని ఇళ్లరికం ఉంచేయాలి అని  అంటుంది. దీంతో భైరవి అల్లుడు ఒప్పుకోవాలి కదా అంటుంది. దీంతో వాళ్లు అల్లుడిని ఒప్పించండి ఇప్పుడే ఇళ్లరికం తెచ్చుకోండి అని అంటుంది. భైరవి తన భర్తను అడుగుతుంది. మహదేవయ్య మౌనంగా ఉండటంతో ఓకే చెప్పారు అనుకుంటుంది. పంతులికి కాల్ చేసి ముహూర్తం పెట్టిస్తామని వాళ్లు కాల్ చేయగా హర్ష అడ్డుకుంటాడు.

హర్ష: ఆగండి.. ఈ ఇంటి అల్లుడి విషయంలో మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి.
భైరవి: తప్పేంటి అల్లుడు మీ పెద్ద వాళ్లు ఒప్పుకోరు అని భయమా. అది నేను చూసుకుంటా.
హర్ష: మా వాళ్లు ఒప్పుకోవడం కాదు నేను ఒప్పుకోను. జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల మీద కొడుకుగా నా బాధ్యత నాకు ఉంటుంది. వాళ్లని వదులుకొని ఈ ఇంటికి నేను ఎలా వస్తాను అనుకుంటున్నారు. 
భైరవి: బాధ్యతలు వదులుకొని రమ్మని ఎవరు అంటున్నారు అల్లుడు. నెల నెలా పైసలు పంపిద్దాం. నువ్వు కూడా ఆ ఉద్యోగం వదిలేయ్. మీ మామ నీతో బిజినెస్ పెట్టిస్తాడు. మీ మామ ఎమ్మెల్యే అయ్యాక నువ్వు పీఏ అవ్వొచ్చు.
రుద్ర: ఇలాంటి బంపర్ ఆఫర్ ఎవరు ఇస్తారు. నీ జీవితంలోకి అదృష్టం నడిచివచ్చినట్లే.
హర్ష: మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ డబ్బుతోనే ఆలోచిస్తారా.. ఇల్లరికం నాకు ఇష్టం లేదు. పండగ కదా. అందుకే వచ్చాను. లేదంటే రాకపోయేవాడిని. నందినితో ఈ సాయంత్రం మా చెల్లి సంధ్య పెళ్లిచూపులు త్వరగా రెడీ అవ్వు వెళ్లాలి. 
భైరవి: చూస్తావ్ ఏంటి అయ్యా నువ్వు అయినా అల్లుడికి నచ్చచెప్పు. ఇళ్లరికానికి ఉండమను.
మహదేవయ్య: ఇలాంటి విషయాల్లో ఎవరి మనసులకు నచ్చినట్లు వాళ్లే తీసుకోవాలి. అయినా అల్లుడి ఆలోచన కూడా కరెక్టే కదా తప్పేముంది.
హర్ష: ఇంకా కూర్చొన్నావ్ ఏంటి బయల్దేరు బ్యాగ్ సర్దుకో.
మహదేవయ్య: వెళ్లు బేటా వెళ్లు. అని చెప్పడంతో కోపంగా అక్కడి నుంచి నందిని వెళ్లిపోతుంది. 

మరోవైపు క్రిష్‌ నోటి మంట తగ్గడానికి స్వీట్స్ తింటాడు. ఇక సత్య తన చేతికి మందు పెట్టుకుంటుంది. ఒకర్ని ఒకరు మాటలు అనుకొని గొడవ పడతారు. క్రిష్‌ది దొంగ ప్రేమ అని సత్య అంటుంది. ఇంతలో విశ్వనాథం తలుపు కొడతాడు. దీంతో సత్య డోర్ తీస్తుంది. విశ్వనాథం వచ్చి అల్లుడిగారితో మాట్లాడుతాను అంటాడు. క్రిష్ కోపంగా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతాడు.

సత్య: నాన్న అది నేను అరచేతిలో హారతి వెలిగించుకున్నాను అది బాధపడుతున్నారు.  
విశ్వనాథం: నీకే కాదు బాబు మాకు కూడా కష్టం గానే అనిపించింది. మీ కాపురం కుదురుగా ఉండటానికే కదా సత్య ఆ పని చేసింది. చేతి గాయం ఈరోజు కాకపోయినా రేపు అయినా తగ్గిపోతుంది. కానీ జీవితానికి గాయం కాకుండా చూసుకోవాలి. 
క్రిష్: ఎవరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా జరగాల్సినవి 
జరుగుతూనే ఉంటాయి. ఎవరూ ఆపలేరు.
విశ్వనాథం: అవును బాబు అలా అనుకొనే మీ పెళ్లి జరగనిచ్చాం. మీరు సంతోషంగా ఉన్నారా లేదా.. మంచి జరగాలి అనుకుంటే ఏంది జరిగినా మన మంచికే అనిపిస్తుంది. సరే బాబు నేను ఓ మాట చెప్పడానికి వచ్చాను. సాయంత్రం సంధ్య పెళ్లి చూపులు మీరే దగ్గరుండి చూసుకుంటారు కదా..
సత్య: నాన్న నందని, అన్నయ్య వస్తారు కదా. మీరు నిశ్చింతగా ఉండండి ఏదైనా అనుకుంటే మీ అల్లుడు చేసే వరకు నిద్ర పోరు. 
క్రిష్: నీకు మీ వాళ్లకి నేను ఆడుకోవడానికి ఫుడ్ బాల్‌లా దొరికాను. 
సత్య: ఏదైనా ఈ ఒక్కరోజే కదా.

అల్లుడిని ఇళ్లరికం రమ్మని చెప్పకుండా నందినిని ఏడిపిస్తున్నావ్ అని భైరవి భర్తతో చెప్తుంది. దీంతో మహదేవయ్య అల్లుడికి ఇష్టం లేకుండా ఏం చేయను అంటాడు. అల్లుడికి గట్టిగా ఒక మాట చెప్తే వింటాడు నువ్వు చెప్పు అని భైరవి అంటే  మహదేవయ్య చెప్పను అంటాడు. నందిని పుట్టింటిలో ఉండటం తనకు ఇష్టం లేదని మహదేవయ్య అంటాడు. భైరవి షాక్ అయిపోతుంది. తన రాజకీయ భవిష్యత్ కోసం నందినిని ఆ బికారి ఇంటికి పంపాను అని ఇళ్లరికం తీసుకురాను అని తేల్చి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'కల్కి'కి ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే! - బడ్జెట్ లో 25 శాతం, ఎన్ని కోట్లంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
IPL 2024: హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం,  ఊదేస్తారా? ఉసూరుమనిపిస్తారా?
హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం, ఊదేస్తారా? ఉసూరుమనిపిస్తారా?
Anasuya: అనసూయ కామెంట్స్ మీద సందీప్ ఏమంటాడో? 'యానిమల్'పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన హాట్ లేడీ
అనసూయ కామెంట్స్ మీద సందీప్ ఏమంటాడో? 'యానిమల్'పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన హాట్ లేడీ
Tadipatri News: తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SIT Investigation in Tirupati | పోలింగ్ అల్లర్ల ఘటనలపై తిరుపతిలో సి‌ట్ పర్యటన | ABPJC Prabahakar Reddy vs Pedda Reddy | Tadipatri Tension |తాడిపత్రిలో పర్యటిస్తున్న సిట‌్ బృందంRCB Fans Celebrations | RCB vs CSK Highlights | ప్లే ఆఫ్స్ లోకి బెంగళూరు.. బెంగళూరులో రచ్చ రచ్చDrunk Man Beats Police In Visakhapatnam | During Drunk And Drive Test లో మందుబాబు వీరంగం | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
IPL 2024: హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం,  ఊదేస్తారా? ఉసూరుమనిపిస్తారా?
హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం, ఊదేస్తారా? ఉసూరుమనిపిస్తారా?
Anasuya: అనసూయ కామెంట్స్ మీద సందీప్ ఏమంటాడో? 'యానిమల్'పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన హాట్ లేడీ
అనసూయ కామెంట్స్ మీద సందీప్ ఏమంటాడో? 'యానిమల్'పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన హాట్ లేడీ
Tadipatri News: తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
Manchu Manoj First Look : ‘మిరాయ్‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది, బర్త్​డేకి స్పెషల్ గ్లింప్స్​ కూడా.. ఫ్యాన్స్​కి పండగే
‘మిరాయ్‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది, బర్త్​డేకి స్పెషల్ గ్లింప్స్​ కూడా.. ఫ్యాన్స్​కి పండగే
TS TET-2024: రేపటి నుంచి తెలంగాణ 'టెట్' పరీక్షలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే
TS TET-2024: రేపటి నుంచి తెలంగాణ 'టెట్' పరీక్షలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే
Visakha News: మద్యం మత్తులో యువకుడి వీరంగం - కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని హల్చల్
మద్యం మత్తులో యువకుడి వీరంగం - కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని హల్చల్
Karimnagar News: నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు
నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు
Embed widget