అన్వేషించండి

Satyabhama Serial September 2nd: సత్యభామ సీరియల్:  సత్య, క్రిష్‌లను కలపడానికి రంగంలోకి దిగిన ఆర్‌డీఎక్స్ గ్యాంగ్.. క్రిష్‌ నుంచి విడిపోనని తల్లితో చెప్పిన సత్య!

Satyabhama Today Episode సత్య, క్రిష్‌లను కలపాలని సత్య స్నేహితులు ప్రయత్నించడం ఈ క్రమంలో సత్య కిడ్నాప్ విషయం తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య తన అత్తమామల 30వ పెళ్లి రోజు వేడుకల్ని జరుపుతుంది. ఆ వేడుకకు తన స్నేహితులు కూడా వస్తారు. సత్యతో తన తల్లి విశాలాక్షి అల్లుడు చాలా బాధ పడుతున్నాడని అంటుంది. సత్య తల్లిని కంగారు పడొద్దని తాను క్రిష్‌ని కానీ తన కుటుంబాన్ని కానీ దూరం చేసుకోనని చెప్తుంది. ఇక భైరవిని ఇద్దరూ కోడళ్లు, మహదేవయ్యని రుద్ర తీసుకొని పసుపు రాయడానికి తీసుకొస్తారు. 

మహదేవయ్య, భైరవిలకు విశ్వనాథం, విశాలాక్షిలు పసుపు రాస్తారు. ఇక నందినిని మహాదేవయ్య పిలుస్తాడు. నందిని ముఖం మాడ్చుకుంటుంది. సంధ్య, హర్ష ఒప్పించి నందినిని తీసుకెళ్తారు. తర్వాత అందరూ ఇద్దరికీ పసుపు రాసి సందడి చేస్తారు. ఇక సత్య స్నేహితులు హల్దీలో ఎవరైనా వాళ్లకు నచ్చిన వాళ్లకి పసుపు రాయొచ్చని అంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ సత్య వెంట పరుగులు తీస్తారు. తప్పించుకోవడానికి సత్య పరుగుందుకుంటుంది. ఇంతలో క్రిష్ వస్తే సత్య క్రిష్ వెనకాలే దాక్కుంటుంది. ఇంతలో సంధ్య వెంట పడటంతో ముగ్గురు ఫ్రెండ్స్ పారిపోతారు. ఇక సత్య ఎవరూ లేకపోవడంతో క్రిష్‌కి చందనం రాస్తుంది. నచ్చిన వారికి పసుపు రాయమని చెప్పారు నీకంటే నాకు నచ్చిన వారు ఎవరూ లేరని సత్య క్రిష్‌కి రాస్తుంది. తర్వాత క్రిష్ చేతికి పసుపు ఇచ్చి తనకు రాయమని చెప్తుంది. క్రిష్ రాస్తాడు. సత్య ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. క్రిష్ సత్యతో నీ ఫ్రెండ్స్ ముందు నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకోవాలనే ఇలా చేశావ్ కదా నేను కూడా నీ కోసం నటించాను నటిస్తానని అంటాడు. సత్య చాలా ఫీలవుతుంది. 

ఇక నందిని, సంధ్య హర్షని వెంటపడి మరి గంధం పూస్తారు. ఇక ఆర్‌డీఎక్స్ గ్యాంగ్ రాధ, దీప్తి, జెనాలు సత్య దగ్గరకు వచ్చి క్రిష్‌ గంధం పూయడం సంతోషంగా ఉందని అంటారు. సత్య బుంగ మూతి పెట్టుకొని క్రిష్‌ తన గాలి తీసేశాడని ప్రేమని చూపిస్తే నీ ఫ్రెండ్స్ కోసం నటిస్తున్నావని అన్నాడని చెప్తుంది. ఇక దీప్తి సత్యతో క్రిష్‌ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూనే ఉండు అర్థమవుతుందని అంటుంది. ఇక మరోవైపు విశ్వనాథం, క్రిష్ దగ్గరకు వెళ్తాడు.

విశ్వనాథం: బాబు నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఇది వరకు లాగా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. తెలియని ఇబ్బంది  ఉంది.
క్రిష్: అట్లా ఏం లేదు. ఏం చెప్పాలి అనుకున్నారో చెప్పండి మామయ్య.
విశ్వనాథం: మా అమ్మాయికి నీకు మధ్య సమస్య ఏంటి బాబు. మీరిద్దరూ ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నారు. మనుషులు దగ్గరే ఉంటున్నారు. కానీ మనసులు దగ్గర కాలేకపోతున్నాయి.  ఈ దూరానికి తప్పు సత్యదేనా.
క్రిష్: కలిసి నడుస్తున్నప్పుడు తప్పొప్పులు చూడకూడదు మామయ్య. ఇదంతా సత్యనే చేసింది మా బాపు చాలా కుషిగా ఉన్నాడు
విశ్వనాథం: మరి నువ్వు. మీ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మాట ఇవ్వగలవా.
క్రిష్: మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒక్క వారం ఆగితే ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అని క్రిష్ వెళ్లిపోతాడు.

రుద్ర సత్య కిడ్నాప్ గురించి రౌడీలతో మాట్లాడుతాడు. సత్య కిడ్నాప్ చేయాలనుకుంటున్న విషయం సత్య ఫ్రెండ్స్ వినేస్తారు. ఇక రౌడీలు బేరర్ అవతారం ఎత్తుతారు. వాళ్లని సత్య ఫ్రెండ్స్ గమనిస్తూ ఉంటారు. రౌడీలు సత్య ఫొటో పట్టుకొని సత్య కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్లు చూడకుండా సత్య ఫ్రెండ్స్ సత్యని పిలిచేస్తారు. ఇక తన ఫ్రెండ్స్ రౌడీతో కాసేపు ఆడుకుందామని అనుకుంటారు. మాటి మాటికి వాడిని పిలిచి తిప్పిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పేపర్ల కాఫీలు విసిరిన గాయత్రీ పాపని చూసేసిన నయని.. ఇప్పటికైనా తొలిబిడ్డ అని కనిపెడుతుందా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget