Satyabhama Serial Today September 13th: సత్యభామ సీరియల్: రుద్ర ఓవర్ యాక్షన్‌కి క్రిష్‌లో అనుమానం.. అత్త దగ్గర పగ్గాలు తీసుకున్న సత్య.. మైత్రిని తీసుకొచ్చిన హర్ష!
Satyabhama Today Episode మహాదేవయ్యని చంపడానికి ప్లాన్ వేసుకున్న రుద్ర తండ్రికి చివరి సేవలు అంటూ ఓవర్ చేయడం క్రిష్‌కి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode తన పనుల్లో ఇన్వాల్స్ అవ్వొద్దని క్రిష్ చెప్పడంతో సత్య బుంగ మూతి పెట్టుకుంటుంది. తన ఇగో హర్ట్ అయిందని క్రిష్‌తో చెప్తుంది. దాంతో నీ విషయాలతో పాటు ఇంట్లో అన్ని విషయాల్లోనూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అంటుంది. దాంతో క్రిష్ తన మాట వెనక్కి తీసుకుంటున్నానని సత్యని బతిమాలుతాడు.
సత్య: నేను చెప్పినట్లు నువ్వు వినాలి. గొడవలకు దూరంగా ఉండాలి అప్పుడు నేనే నీకు ముద్దు పెట్టుకుంటా.
క్రిష్: రెండోది ఒకే కానీ మొదటిదే కొంచెం కష్టం. నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావో నేను మా బాపు కోసం అలాగే ఆలోచిస్తున్నా.
సత్య: ముద్దు పెట్టుకోవాలనా.
క్రిష్: ఏయ్ కాదు. ఎమ్మెల్యే అవ్వడం మా బాపు కల. నన్ను నమ్ముకున్నాడు. అందుకు అన్నని కూడా దూరం పెట్టాడు. సడెన్‌గా నేను వెనక్కి తగ్గితే దానిని వెన్ను పోటు అంటారు. నువ్వు చదువుకున్నావ్ కదా నీకు తెలీదా ఇలాంటివి. నువ్వే చెప్పు.
సత్య: నేనేం చెప్పను. నువ్వు చెప్తే వినడానికే నిలబడ్డాను.
క్రిష్: సరే ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం. మా బాపు ఎమ్మెల్యే అయిన వరకు మా బాపు మాట వింటాను ఆ తర్వాత నీ మాటే వింటాను. ఒక్కసారి బాపు ఎమ్మెల్యే అయితే శత్రువులు ఎక్కడి వాళ్లు అక్కడ పారిపోతారు. వరంగల్‌కి బాపు రాజు అయితే నేను యువరాజు. అప్పుడు నీ కొంగు పట్టుకొని తిరుగుతా.
సత్య: అంత అవసరం లేదు.
క్రిష్: నా కోసం కాఫీ తీసుకొచ్చి ఇంత నాటకం ఆడావా.
సత్య: మరి నువ్వు అంటే నాకు అంత ఇష్టం.
క్రిష్: ఈరోజు రాత్రికి పార్టీ ఫిక్స్ కదా.
సత్య: పో..
మైత్రి రోడ్డు మీద ఒంటరిగా నడిచి వెళ్తుంటుంది. అందరూ మైత్రిని తన తండ్రి గురించి మాట్లాడి పరామర్శిస్తారు. దాంతో మైత్రి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఎదురుగా వచ్చిన కారుని ఢీ కొట్టి కింద పడిపోతుంది. హర్ష అటుగా వెళ్తూ అది చూసి మైత్రిని లేపి ఒంటరిగా వదలకూడదని తన వెంట తీసుకెళ్తాడు. భైరవి రేణుకకి మహదేవయ్య కోసం టీ పెట్టమని అంటుంది. మహదేవయ్య ఎమ్మెల్యే అయితే అందరం హుషారుగా ఉండాలని చకచకా పనులు చేయాలని అంటుంది. ఇంతలో సత్య వచ్చి మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య అని కొంగు బిగిస్తుంది.
భైరవి: నువ్వేంటే కొంగు బిగిస్తున్నావ్.
సత్య: ఇక నుంచి ఈ ఇంటి యజమాయిషీ నాదే కదా అత్తయ్య.
భైరవి: కొత్తగా మాట్లాడుతున్నావేంటే.
సత్య: లెక్కలు మారాయి అన్నారు కదా. అక్క ఇక నుంచి నువ్వు కూడా నా మాట వినాల్సిందే ఏ పని చేయకూడదు పక్కకి జరుగు. పని మనిషితో ఏంటి నోరు తెరిచి అలా చూస్తున్నావ్ ఏం వండుతున్నావ్ ఇక నుంచి నువ్వేం వండాలో ఏం చేయాలో నేను చెప్తా అది ఫాలో అవ్వు. ఈ ఇంట్లో నా చిన్న కోడలి పోస్ట్ కన్ఫ్మమ్ అయింది ఇప్పటి నుంచి నేను యాక్షన్‌లోకి దిగుతున్నా.
భైరవి: నువ్వు యాక్షన్‌లోకి దిగితే నేనేం చేయాలే నోట్లో వేలు పెట్టుకొని కూర్చొవాలా.
సత్య: అవసరం లేదు అత్తయ్య. ఒక పడక కుర్చీ ఏర్పాటు చేస్తా హాయిగా రెస్ట్ తీసుకోండి. సరేనా.
పంకజం: పడక కుర్చీ పక్కన పెద్దమ్మగారి మరచెంబు, విసన కర్ర పెట్టమంటారమ్మా.
సత్య: సూపర్ భలే గుర్తు చేశావ్ పంకజం. ఏం లేదు అత్తయ్య జీవితంలో పరుగెత్తి పరుగెత్తి బాగా అలసిపోయారు. ఇంక రెస్ట్ తీసుకోండి సరేనా.
పంకజం: మీకు ఇక రిటైరేనా.
భైరవి: నువ్వు నోరు మూసుకో. దీని మాటలు ఏవో తేడా కొడుతున్నాయ్ జాగ్రత్త పడకపోతే ఇక చేతికి మరచెంబే
సత్య: ఇంటి బాధ్యతలు తీసుకోమని మీ అబ్బాయి చెప్పారు. భామ సత్యభామ ఇంక యాక్షనే. పంకజం అత్తయ్యకి చల్లని మంచి నీళ్లు ఇవ్వు.
రుద్ర: (క్రిష్, మహదేవయ్య చెస్ ఆడుతుంటే) ఆడుకో బాపు ఆడుకో ఈ దినం నీకు ఆఖరి రోజు నీకు నేను చెక్ పెట్టా. తొందరలోనే నీ స్థానంలో నేను కూర్చొని నీకు చెక్ పెడతా.
మహదేవయ్య: ఏంరా ఎలా ఆడుతున్నా.
రుద్ర: గేమ్‌లో అయినా లైఫ్‌లో అయినా నీకు ఎవరు ఎదురు రాలేరు బాపు. (నేను తప్ప)
మహదేవయ్య: ఏంట్రా ఈ దినం నీకు మాటలు జోరుగా వస్తున్నాయ్.
రుద్ర: నువ్వు ఎమ్మెల్యే అవ్వబోతున్న సంతోషం అంతే. నువ్వు ఇంకా ఇంకా ఎవరికీ అందనంత మీదకి పోవాలి బాపు. నీ వెనకనే ఉంటూ ఆ పని నేను చూసుకుంటా నీ రుణం తీర్చుకుంటా బాపు. (క్రిష్ ఆ మాటలకు అనుమానంగా చూస్తాడు) ఏంట్రా ఆ చూపు బాపుతోనే గేమ్ ఆడుతున్నావా. గెలవాలి అనుకోకు.
క్రిష్: నేను ఓడిపోతే బాపు పెంపకానికే అవమానం.
రుద్ర: మనసులో నేను ఓడిపోతే బాపు ఇచ్చిన ట్రైనింగ్‌కే అవమానం.
క్రిష్: చెక్ మేట్ ఇంక నువ్వు తప్పించుకోలేవు బాపు.
మహదేవయ్య: ఉడుకు రక్తం కదరా నీకు ఆవేశం ఎక్కువ.. నాకు వయసు అయింది కద అనుభవం ఉంది అంత ఈజీగా ఓడిపోతానా.
మహదేవయ్య పొలమారితే రుద్ర ఓవర్ చేసి నీళ్లు తాగిస్తాడు. కొత్తగా ఈ మర్యాదలు ఏంటని మహదేవయ్య రుద్రని అడిగితే మళ్లీ మళ్లీ ఈ అవకాశం దొరుకుతుందో లేదో అని అంటాడు. రుద్ర ప్రవర్తనకు క్రిష్‌కి అనుమానం వస్తుంది. ఇక మహదేవయ్యకు కాఫీ తీసుకొని సత్య వస్తుంది. భైరవి తాను వెళ్తాను అంటే మీకేం చెప్పాను అత్తయ్య అని సత్య అడిగితే పంకజం మరచెంబు కుర్చీ అని అంటే సత్య సూపర్ అని కాఫీ పట్టుకొని వెళ్తుంది. సత్య తెచ్చేలోపు రుద్ర ఓవర్ చేసి తండ్రికి ఆయనే కాఫీ ఇస్తాడు.
నందిని ఇంట్లో వాళ్ల కోసం కాఫీ చేస్తుంది. అందరూ వింతగా చూస్తూ షాక్ అయిపోతారు. పుట్టింటి వాళ్లని కాదు అనుకున్నానని మీరే అన్నీ అనుకున్నాను అని అందుకే సేవలు చేస్తున్నాను అని అంటుంది. ఇక హర్ష మీద కోపం వద్దని సర్దుకు పోమని నందినికి చెప్తారు. మైత్రి వల్ల నువ్వు అలా ఉంటడం వాడికి ఇష్టం లేదని ఇకపై అలా జరగదు మంచిగా ఉండని చెప్తారు. దాంతో నందిని తగ్గిపోతుంది. ఇక హర్షకి ఇష్టమైన వంటలు చేస్తానంటే విశాలాక్షి నేర్పిస్తాను అంటుంది. ఇక హర్ష రాగానే నందిని సంతోషంగా మాట్లాడుతుంది. కానీ హర్ష తనతో పాటు మైత్రిని తీసుకొస్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. మైత్రి కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటుందని హర్ష చెప్తాడు. దాంతో నందిని షాక్‌లో తన చేతిలోని కప్పులు కింద పడేస్తుంది. ఇక హర్ష మైత్రికి యాక్సిడెంట్ జరగబోయిందని ఒంటరిగా వదిలేస్తే ఏమైనా అవుతుందని ఇంటికి తీసుకొచ్చానని చెప్తాడు. పెళ్లి కాని ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే ఏం కాదా అత్తమ్మ అని నందిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్‌ని చంపడానికి డాక్టర్ అవతారం ఎత్తిన గజగండ, గంటలమ్మ.. పాప ఐడియా సూపర్!