అన్వేషించండి

Satyabhama Serial Today October 9th: భామ సీరియల్: హమ్మయ్యా.. సత్య, క్రిష్‌ల ఫస్ట్ నైట్ అయిపోయిందోచ్.. మైత్రి దిమ్మతిరిగే షాక్!

Satyabhama Today Episode క్రిష్ సత్య పెట్టిన టెస్ట్‌లో నెగ్గడం సత్య, క్రిష్‌ల తొలిరాత్రి జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode హర్ష, మైత్రి బండి మీద తిరిగి రావడం చూసిన నందిని భర్తని ప్రశ్నిస్తుంది. పెద్దవాళ్ల మీరు ఎందుకు అడగటం లేదని నందిని అంటుంది. దానికి హర్ష నేను ఆఫీస్‌ నుంచి వస్తూ సంగీత ఇంటి దగ్గర ఉన్న మైత్రిని పిక్ చేసుకొని వచ్చా ఈ మాత్రం దానికి గుమ్మం ముందే ఆపి ఎంక్వైరీలు ఏంటీ అని హర్ష అంటాడు. నందినికి మీరు అయినా నచ్చచెప్పమని హర్ష అంటాడు.

విశ్వనాథం: ఆ మాట ఫోన్ చేసి నందినీకే చెప్పొచ్చు కదరా.
హర్ష: ఎలాగూ ఇంటికే కదా  వస్తున్నా అని.
నందిని: అది మామయ్య మీ అబ్బాయి ముచ్చట.
మైత్రి: నందిని హర్షని అపార్థం చేసుకుంటున్నావ్ అతను చాలా మంచోడు.
నందిని: అదే కదా ప్రాబ్లమ్ నా భర్త గురించి నీకు నా కంటే ఎక్కువ తెలుస్తుంది.
మైత్రి: హర్ష నీ గురించి ఎంతలా ఆలోచిస్తాడో తెలుసా.
నందిని: ఎలా వదిలేయాలా అనా.
మైత్రి: హార్ష్‌గా మాట్లాడి హర్షని ఇబ్బంది పెడుతున్నావ్ నందిని కొంచెం అర్థం చేసుకో.
నందిని: ఇదే కదా నా ప్రాబ్లమ్ నా భర్తతో ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తున్నావ్. ఇద్దరి నడుమ అంత అండర్ స్టాండింగ్ ఉంది.
హర్ష: మైత్రి నువ్వు లోపలికి వెళ్లు తనకి ఈ జన్మకి అర్థం కాదు.

మైత్రి హర్షతో నందిని మంచిదాయమని నిన్ను ఇష్టపడుతుందని చెప్పి నందినితో హర్షని నేను నచ్చచెప్తాను అంటుంది. దానికి నందిని మా ఇద్దరి మధ్యలోకి రావడానికి నువ్వు ఎవరు అని మైత్రిని అడుగుతుంది. నీకు ఏం హక్కు ఉందని ప్రశ్నిస్తుంది. నీ వల్లే గొడవలు అవుతున్నాయని అంటుంది. నందిని గదిలోకి వెళ్తే హర్ష కూడా వెనకాలే  వెళ్తాడు. ఇక ఇంటిళ్ల పాది మైత్రితో నందిని మాటలు పట్టించుకోవద్దని అంటారు. సంధ్య నందినిని గదిలోకి తీసుకెళ్తుంది. 

మరోవైపు సత్య క్రిష్‌ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. తన పిచ్చి క్లూస్స్‌తో ఇబ్బంది పెడుతున్నానని ఎంత ఇబ్బంది పడుతున్నాడో అనుకుంటుంది. ఇంతలో క్రిష్ వచ్చి సత్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. పందెం గెలిచానని పుట్టిన రోజు చెప్పేస్తాడు. ఇంతలో బాబీ క్రిష్‌కి కాల్ చేస్తాడు. తనని చితక్కొట్టేశారని చెప్తాడు. ఇక క్రిష్ గది నెంబరు తెలుసుకున్నానని బాబీతో చెప్తాడు. పందెం గెలిచానని అంటాడు. బాబీ క్రిష్‌ని పొగిడేస్తాడు. ఇక సత్య చాలా సంతోషంగ ఉందని అంటాడు. దాంతో బాబీ అన్న పండగ చేసుకో అని అంటాడు. ఇక ఫోన్ పెట్టేస్తాడు క్రిష్‌. క్రిష్‌, సత్యల రొమాన్స్ రుద్ర చూస్తాడు. ఇక సత్య ఆల్రెడ్రీ గది రెడీ చేశానని అంటుంది. పెళ్లి విషయంలో బాపు తనకి చాలా అన్యాయం చేశాడని క్రిష్‌కి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తనకు మాత్రం మబ్బు ముఖాన్ని అంట గట్టాడని అనుకుంటాడు.  

క్రిష్ సత్యని ఎత్తుకొని గదిలోకి తీసుకొస్తాడు. గది చాలా బాగుందని క్రిష్‌ అంటే నేనే డెకరేట్ చేశా అని సత్య చెప్తుంది. సత్య తనకు కూడా ఆరాటంగా ఉందని అందుకే దూరం పెట్టానని సత్య అంటే క్రిష్‌ అయితే ఇంకో రెండు దినాలు దూరంగా ఉందామని అప్పుడు ఇంకా ఆరాటం పెరుగుతుందని అంటాడు. దానికి సత్య బుంగు మూతి పెట్టుకుంటుంది. ఇక ఆగటం నా వల్ల కాదు అని క్రిష్‌ని బెడ్ మీదకు తోసేసి తాను వెళ్తుంది. "సమీరా.. సమీరా" అంటూ ఓ క్లాసిక్ రొమాంటిక్ సాంగ్తో ఇద్దరూ రొమాంటిక్‌గా గడుపుతారు. మొత్తానికి సత్య, క్రిష్‌ల ఫస్ట్ నైట్ అయిపోతుంది. 

మరోవైపు నందిని హర్షతో మైత్రిని ఇంటి నుంచి గెంటేయ్ మంటుంది. ఇప్పటికి ఇప్పుడు మైత్రిని పంపించడం కష్టమని అంటాడు. వారం గడువు ఉంది కదా అప్పుడు చూద్దామని అంటాడు. మైత్రి మీద తనకు అనుమానంగా ఉందని నందిని అడుగుతుంది. వారం ఆగితే మైత్రి ఈ దేశంలోనే ఉండదని అంటాడు. పై చదువుల కోసం మైత్రి ఫారెన్ వెళ్తుందని హర్ష అంటాడు. ఆ మాటలను మైత్రి చాటుగా వింటుంది. మాట తప్పొద్దని నందిని అంటుంది. ఇక హర్ష, నందిని ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటారు. నిన్ను వదిలి పెట్టి ఫారెన్ ఎలా వెళ్తాను హర్ష అనుకుంటుంది మైత్రి. 

ఉదయం క్రిష్ నిద్ర లేచే సరికి కాఫీ తీసుకొని సత్య వస్తుంది. సత్యని చూసి క్రిష్ పడుకున్నట్లు నటిస్తాడు. అది చూసిన సత్య కాఫీ అక్కడ పెట్టినట్లు పెట్టి వెళ్లిపోబతే క్రిష్ చీర పట్టుకొని ఆపుతాడు. నిద్ర లేపకుండా అలా వెళ్లిపోతావేంటి అని అడుగుతాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుతూ సత్యకి ముద్దు అడుగుతాడు. ఇక క్రిష్‌ బుగ్గ మీద సత్య పెట్టిన ముద్దు మార్క్ ఉంటుంది. అది సత్య ఇంట్లో వాళ్లకి చూపిస్తానని అంటాడు. సత్య ఆపడానికి ప్రయత్నించినా క్రిష్ వినడు. పరువు తీసేలా ఉన్నాడని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీని మెడ పట్టుకొని గెంటేసిన పద్మాక్షి.. లక్ష్మీకి అండగా విహారి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Embed widget