అన్వేషించండి

Satyabhama Serial Today October 19th: సత్యభామ సీరియల్: రేణుకని కాపాడి రుద్రని అరెస్ట్ చేయించిన క్రిష్‌.. మామకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సత్యమ్మ!

Satyabhama Today Episode రేణుకని చంపడానికి ప్రయత్నించింది రుద్ర అని తెలుసుకున్న సత్య, క్రిష్‌లు రుద్రని అరెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య, క్రిష్ బాణం వేయడానికి వస్తారు. ఇద్దరూ మొదటి ప్రయత్నంలోనే బాణం వేస్తారు. అందరూ చప్పట్లు కొట్టి వాళ్లిని మొచ్చుకుంటారు. ఇంతలో రావణాసురుడి వెనక ఉన్న బొమ్మ వెనక రేణుక కదులుతూ ఉంటుంది. రేణుక కొంగు కదలడం చూసిన సత్య అక్కా అక్కా అని ఏడుస్తూ క్రిష్‌కి చెప్తుంది. దాంతో క్రిష్‌ వెళ్లి కాపాడుతాడు.

ఇక రుద్ర కంగారు పడుతూనే రేణుకని హాస్పిటల్‌కి తీసుకెళ్తా అంటాడు. సత్య అవసరం లేదని నేను చూసుకుంటానని అంటుంది. భైరవి కూడా తన భర్త చూసుకుంటాడు అంటే క్రిష్ ఆపుతాడు. వదినను కట్టి పడేసింది ఎవరో తెలియాలి అంటాడు. నర్శింహ చేసుంటాడని భైరవి అంటే రుద్ర పురమాయించిన రౌడీ రేణుక కిడ్నాప్ తర్వాత అక్కడ విరిగిపోయిన గాజులు ఏరడం క్రిష్‌కి గుర్తొస్తుంది. ఇక ఆ రౌడీని రుద్ర పారిపోమని సైగ చేస్తే క్రిష్ వాడిని గుర్తించేస్తాడు. ఆ రౌడీని పట్టుకొని నాలుగు తగిలిస్తే వాడు నేనే చేశాను కానీ రుద్ర బాబు చెప్తే చేశానని చెప్పేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. రేణుక ఏడుస్తుంది. భైరవి రౌడీని తిడుతుంది. వాడికి రెండు తగిలించురా నిజం చెప్తాడు అంటాడు. దానికి క్రిష్ వాడు అబద్ధం చెప్పడం లేదు అని అంటాడు.

క్రిష్: రక్త సంబంధం ఉంటే తప్పేంటి ఎవరు తప్పు చేస్తే వాళ్లని శిక్షించాలి.
మహదేవయ్య: చిన్నా లోపలకు వెళ్లి మాట్లాడుకుందాం పద.
క్రిష్: జరిగింది చిన్న తప్పు కాదు బాపు. అన్న వదినను చంపబోయాడు.
రుద్ర: నాకేం సంబంధం లేదు.
క్రిష్: పిల్లలు పుట్టకుండా వదినతో గోలిలు తినిపించిండు అడిగితే సంబంధం లేదు అన్నాడు. దగ్గరుండి గర్భం తీయించాడు అడిగితే సంబంధం లేదు అన్నాడు. మొన్నటికి మొన్న వదినను తోసేశాడు అడిగితే సంబంధం లేదు అంటున్నాడు. ఇంకా అన్నని నమ్ముతున్నారా.
రుద్ర: చేతకాని వాడు పెళ్లాం మాట నమ్ముతున్నాడు.

అన్నా అని ఒకర్ని ఒకరు కొట్టుకోవడానికి వస్తారు. ఇక ఇంతలో పోలీసులు వస్తారు. సత్య చెప్పిందని ఈసారి తప్పుడు కంప్లైంట్ అయితే తనని అరెస్ట్ చేయమని సత్య చెప్పిందని తమకు తిట్టిన భైరవితో పోలీసులు చెప్తారు. ఇక సత్య రేణుకతో అక్కా మీళ్లీ నువ్వు నీ భర్తని రక్షించుకుంటావని నాకు తెలుసు. నీకు బతడం చేత కాదు కానీ నేను చూస్తూ ఉండను నీ భర్త ధైర్యం కూడా అదే అని అంటుంది. నీ భర్తని రక్షించాలి అనుకుంటే నన్ను శిక్షించు ఏమీ అనుకోను అబద్ధం చెప్పు అని అంటుంది. నిన్ను నువ్వు రక్షించుకోవాలి అనుకుంటే నీ భర్తని శిక్షించు  అంటుంది. దాంతో రేణుక ఆయన్ని అరెస్ట్  చేసి తీసుకెళ్లిపోండి ఎస్‌ఐ గారు నన్ను చంపాలి అనుకున్నది ఆయనే అంటుంది. ఇక పోలీసులు రుద్రని, రౌడీని తీసుకెళ్లిపోతారు. భైరవి ఏడుస్తూ ఆపమని భర్తని చెప్తుంది. సత్య మీద కోప్పడుతుంది. శాపాలు పెడుతుంది. దానికి క్రిష్ వదిన చచ్చి బతికింది జాలి చూపవేంటి అయ్యో అనవేంటి అంటాడు. అన్నని విడిపించొద్దని అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ఇక సత్య మహదేవయ్యతో రేపోమాపో ఈ రావణాసురుడు కూడా మండిపోతాడు. క్రిష్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని మీ కొడుకునే జైలుకి పంపకుండా ఆపకుండా ఉండిపోయారని క్రిష్‌ ఎదురు తిరిగితే ఏం చేయలేకపోయారని అంటుంది. క్రిష్ మీ కొడుకు మీద చేయి లేపినట్లు మీకు ఎదురు తిరిగినప్పుడు మీకు అర్థమవ్వాలి మీ కొడుకు న్యాయం మీద నిలబడే వ్యక్తి అని అంటుంది. సత్య వెళ్లిపోయిన తర్వాత మహదేవయ్య ఈ మహదేవయ్య అంటే ఏంటో చూపిస్తా అని మీసం మెలేస్తాడు. 

రేణుక గదిలో బాధ పడుతుంటే క్రిష్ వెళ్తాడు. ఇంతలో సత్య అక్కడికి వస్తుంది. వదిన మాట్లాడటం లేదు అని క్రిష్ అంటే అక్కకి మన మీద కోపం ఉందని బావకి జైలుకి వెళ్లడం వెనక మనమే ఉన్నాం కదా మీద అక్కకి కోపం అంటుంది. రెండు చేతులు ఎత్తి రేణుకకి సత్య క్షమాపణ చెప్తుంది. కడుపులో బిడ్డ దేవుడి దగ్గరకు పోయాడు కట్టుకున్న భర్త జైలుకి వెళ్లిపోయాడు ఇక నేను దేనికి బతకాలి అని రేణుక అంటుంది. దానికి క్రిష్ మేం లేమా అని అడుగుతాడు. దానికి సత్య బావ మారుతారేమో అనే ఆశ లేదా అని అంటుంది. దానికి రేణుక మన ముగ్గురి మీద కోపంతో వస్తాడు అని అంటుంది. దానికి క్రిష్ అన్న మారి వస్తాడని అంటాడు. వాళ్ల మాటలు భైరవి వింటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో గొడవ పెట్టుకున్న నక్షత్ర – నక్షత్రను గగన్‌తో తిట్టించిన భూమి

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 13th: నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
Podarillu Serial Today July 13th:కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌
పొదరిల్లు: కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌
Nuvvu leka Neanu Lenu Serial Today July 13th: దమయంతి తెప్పించిన రాధ డీఎన్‌ఏ రిపోర్ట్‌లో ఏం ఉంది..? శీనయ్యను కలిసి ఏం చెప్పింది..?
నువ్వులేక నేను లేను: దమయంతి తెప్పించిన రాధ డీఎన్‌ఏ రిపోర్ట్‌లో ఏం ఉంది..? శీనయ్యను కలిసి ఏం చెప్పింది..?
Karthika Deepam 2 Serial Today July 13th: కార్తీకదీపం 2 సీరియల్: శివన్నారాయణని రెచ్చగొట్టిన దక్షిణామూర్తి! బెస్ట్ వంటకం పోటీలో జ్యోత్స్న రెస్టారెంట్స్ పాల్గొంటాయా!
కార్తీకదీపం 2 సీరియల్: శివన్నారాయణని రెచ్చగొట్టిన దక్షిణామూర్తి! బెస్ట్ వంటకం పోటీలో జ్యోత్స్న రెస్టారెంట్స్ పాల్గొంటాయా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget