అన్వేషించండి

Satyabhama Serial Today December 25th: సత్యభామ సీరియల్: భామ సత్యభామ.. కృష్ణ తెగించిన కృష్ణ.. భార్యభర్తల పోటీ.. ఎమ్మెల్యే అయ్యేది ఎవరు గెలిచేసి ఎవరు!

Satyabhama Today Episode మహదేవయ్యకు సాయం అడిగిన వృద్ధురాలిని ఆయన పట్టించుకోకపోవడం సత్య వెంట ఉండి న్యాయం చేస్తా అని తిరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్యకి ఎమ్మెల్యే టికెట్‌ రావడంతో క్రిష్ నామినేషన్ ఫాం తీసుకురావడానికి వెళ్తాడు. ఇంతలో ఒకామె ఏడుస్తూ పెద్దయ్య గారితో మాట్లాడాలి అని వస్తుంది. ఆమె ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నానని ఆ స్థలాన్ని ఒక రాక్షసుడు కబ్జా చేశాడని మీరు తలచుకుంటేనే పని అవుతుందని వాడు కేశవ  అని మీ మనిషి అని పార్టీ ఇన్‌ఛార్జీ కొడుకు అని చెప్తుంది. 

మహదేవయ్య: మనసులో ఇప్పుడు కానీ వాడి జోలికి పోతే పార్టీ టికెట్ కిందా మీద అవుతుంది.
సత్య: మీ మనిషే అంటున్నారు కదా ఒక్క ఫోన్ చేయండి. వృద్ధులకు సాయం చేసిన వాళ్లు అవుతారు. మీ గురించి గొప్పగా చెప్తారు.
మహదేవయ్య: వాడు నా మనిషే కానీ నా మాట వినే మనిషి కాదమ్మా నువ్వే ఏదో ఒకటి చేసుకో పో. 
మహిళ: మీకు దండం పెడతా అయ్యా. 
సత్య: అదేంటి మామయ్య మహదేవయ్య అంటే ఎంత పేరున్న మనిషి మీ మాట కూడా వినని వాళ్లు ఉంటారా
మహదేవయ్య: నీకు తెల్వదు ఊరుకో. అనవసరంగా నన్ను ఇరికించకు అసలే ఎలక్షన్ టైం అమ్మా నువ్వు పో.
భైరవి: ఏమ్మా చేయగలిగితే చేసేవారు కదా పోమ్మా పో.
సత్య: రౌడీలు ఆమెని లాక్కెళ్తుంటే. ఆగండి.. ఇక్కడ ఓట్ల లెక్కే కానీ ఎవరికీ మానవత్వం లేదమ్మా. 
భైరవి: ఏయ్ ఎవర్ని అంటున్నావే.
సత్య: మానవత్వం లేని వాళ్లని తన కున్న దాంట్లో దిక్కులేని వృద్ధులకు సాయం చేస్తుందీ పెద్దావిడ. తను సమస్యలో ఉండి సాయానికి వస్తే ఇదేనా మీరు ట్రీట్ చేసే విధానం. 
మహదేవయ్య: నువ్వు ఈ మేటర్‌లో ఇన్వాల్వ్ అవ్వకు సత్య.
సత్య: అవుతాను మామయ్య. ఆవిడతో పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తా.
భైరవి: ఆమె ఇచ్చుకుంటుందిలే సమస్య అవుతుందని మీ మామయ్య చెప్తున్నాడు కదా నువ్వు లోపలికి రా. 
సత్య: అవతల ఎంత పెద్ద వాళ్లు ఉన్నారో కూడా నాకు అవసరం లేదు మా మామయ్యకు సమస్య అవుతుందేమో కూడా నాకు అవసరం లేదు అత్తయ్య ఈ పెద్దావిడకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాను. 
జయమ్మ: సత్య గొడవలు వద్దు లోపలికి వచ్చేయ్.
భైరవి: ఇంత మంది చెప్తున్నా నీ తలకు ఎక్కడం లేదా ఏంటే నీ మొండి తనం నిన్నూ.
సత్య: ఆగండి అత్తయ్యా తప్పు చేసిన వాడికంటే సరిదిద్ద గల స్థాయిలో ఉండి సాయం చేయని వారిదే అసలు తప్పు.
మహదేవయ్య: భైరవి నువ్వు అడ్డుకోకు. సత్య ఏం చేయాలి అనుకుంటే అది చేయని నోరు పెట్టుకొని అరిస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే తెలుస్తుంది న్యాయం ఎంత బలహీనంగా ఉంటుందో పోయి రా సత్య. నిన్ను ఎవరూ ఆపరు.  

సత్య ఆ మహిళను తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. ఇక సత్య కబ్జా గురించి కేశవ గురించి చెప్తే ఆయన షాక్ అయిపోతాడు. భయంతో నీళ్లు నములుతాడు. వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకొని కాంప్రమైజ్ అవ్వమని అంటాడు. వాళ్లు ఫేక్ డాక్యూమెంట్లు కూడా సిద్ధం చేసుకొని ఉంటారని ఆవిడను వదిలేయమని పోలీస్ అంటాడు. ఈ విషయం ఎక్కడ తేల్చుకోవాలో తెలుసు అని సత్య ఆవిడను తీసుకొని బయటకు వెళ్తుంది. ఆ మహిళ కాంప్రమైజ్ అవుతా అంటే సత్య కోర్టుకి వెళ్దామని అంటుంది. ఆ పెద్దావిడ తనకు తాను సర్దిచెప్పుకుంటే సత్య నేను సాయం చేస్తా మీ కోసం తిరుగుతా పోరాడుతా అని చెప్తుంది. ఇక సత్య తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని పవర్ వస్తే కేశవ లాంటి రౌడీలకు చెక్ పెడతా అంటుంది.

క్రిష్ వెళ్తూ వెళ్తూ నర్శింహను చూసి ఆగి కాకా మా బాబుకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫ్మమ్ అయిపోయిందని సెటైర్లు వేస్తాడు. మా బాపుని నేను గెలిపిస్తానని అంటాడు. మహదేవయ్య ఎమ్మెల్యే అవ్వడం జరగదు అని అంటాడు. దానికి క్రిష్ తన బాపునకు ఎవరు అడ్డు వచ్చినా గెలిపిస్తానని అనుకుంటాడు. ఇక అక్కడ సత్య ఎవరు అడ్డం వచ్చినా నేనే గెలుస్తా అని అంటుంది. మహదేవయ్య కాళ్ల మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతుంటే భైరవి మహదేవయ్యతో చిన్నా గాడు నీ కాళ్ల దగ్గర ఉంటే వాడి పెళ్లాం నీ నెత్తి మీద ఆడుతుంది. అయినా దానికి ఏం అనడం లేదు రోషం పోయిందా నీ పద్ధతి అర్థం కావడం లేదని అంటుంది. సత్య వస్తే దాని సంగతి చూస్తా అని భైరవి అంటే మహదేవయ్య అది నీ సమస్య కాదు వదిలేయ్ నేను చూసుకుంటా అంటాడు. సత్య ఇంటికి రావడంతో భైరవి కోప్పడే సరికి మహదేవయ్య ఆపేసి లోపలికి పంపేస్తాడు. ఎగురు కుంటూ వెళ్లావ్ ఏం చేశావ్ అంటే నాకు పవరు వస్తే అప్పుడు మీ సంగతి చెప్తా అని సత్య అంటుంది.

మహదేవయ్య ఇప్పుడు పూర్తిగా అలర్ట్‌గా ఉన్నాడు నా జోలికి రాలేవు అని పోయి నీ భర్తతో కాపురం చేసుకో అని అంటాడు. సత్య తనతో తాను చెప్తా మీ పని చెప్తా అని అనుకుంటుంది. ఇక సంధ్య పరీక్షలకు చదువుతూ ఉంటుంది. ఇంతలో మైత్రి వచ్చి ఆంటీ లోపలికి రావొచ్చా అని అడుగుతుంది. ఇంతలో హర్ష నందినికి బాక్స్ అడుగుతాడు. మైత్రిని చూసి పలకరిస్తాడు. నందిని హర్షతో ఆఫీస్‌కి టైం అయింది కాదా వెళ్లు అంటే రెండు నిమిషాలు అని మైత్రి ఆపుతుంది. మైత్రి విశ్వనాథం దగ్గరకు వెళ్లి నిస్సహాయ స్థితిలో నాకు ఆశ్రయం ఇచ్చారు. హర్ష నా కోసం చాలా అప్పులు చేసి కష్టపడ్డాడు అని ఇంటి డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఇంటిని అమ్మి నా వల్ల చేసిన అప్పులు తీర్చండి అని అంటుంది. హర్ష తీసుకోవద్దని అంటాడు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని దెబ్బకొట్టడానికి క్రిష్ దగ్గర మాట తీసుకున్న మహదేవయ్య.. మామ కాని మామకు MLA టికెట్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget