అన్వేషించండి

Prema entha maduram Serial Today March 4th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: బర్త్‌డే పార్టీకి వచ్చిన ఆనంది - అలిగిపోయిన అఖి, అభయ్

Prema entha maduram Today Episode: బర్తుడే పార్టీకి ఆనంది రావడంతో అఖి, అభయ్ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema entha maduram Serial Today Episode: బర్తుడే పార్టీ కోసం అను రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో పిల్లల ఇద్దరూ రెడీ అయ్యి అను దగ్గరకు వస్తారు. అమ్మా నువ్వు చాలా సూపర్‌గా రెడీ అయ్యావు అంటూ అభయ్‌ అనగానే అను నవ్వుతుంది. ఇంతలో అఖి మా డాడీ కూడా ఇంకా బాగా రెడీ అయ్యుంటాడు అనగానే మిమ్మల్ని నేను కష్టపడి రెడీ చేస్తే నువ్వు మీ డాడీకి సపోర్టు చేస్తావా? అంటుంది. ఇంతలో ఆర్య రెడీ అయ్యి రూంలోకి రాగానే ముగ్గురూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అను ఆర్య దగ్గరకు వచ్చి మా దిష్టే తగిలేలా ఉందని ఆర్యకు దిష్టి చుక్క పెడుతుంది. నీకు కూడా దిష్టి తగులుతుందని ఆర్య అనుకు కూడా దిష్టి చుక్క పెడతాడు.

అఖి: చూశావా అన్నయ్యా వాళ్ల కోసం మనం గొడవ పడుతుంటే వాళ్లేమో ఒకర్ని ఒకరు పొగుడుకుంటున్నారు.

అభయ్‌: ప్రేమ ఎంత మధురం అంటే అదే మరి. అర్థం అయ్యిందా అఖి.

అను: సరే సరే ముందు మీకు ఏం గిఫ్ట్‌ కావాలో నాన్నను అడగండి.

అఖి: నాన్నా ఏం అడిగినా ఇస్తారా?

అని పిల్లలిద్దరూ అడగ్గానే సరే అడగండి అని అర్య చెప్తాడు. అయితే మా బర్తుడే పార్టీలో మనం మన ఫ్యామిలీ మెంబర్స్‌, మా ఫ్రెండ్స్‌ తప్పా ఇంకెవ్వరూ ఉండకూడదు. ముఖ్యంగా ఆనంది ఉండకూడదు అని అడుగుతారు. ఆర్య సరే అంటాడు. పిల్లలు బయటకు వెళ్తారు. ఆనందిని పంక్షన్‌లో లేకుండా ఎలా చేయాలి అని ఆర్య ఆలోచిస్తుంటాడు. మరోవైపు మాన్షి ఆనందిని అందంగా రెడీ చేస్తుంది. తర్వాత కేక్‌ కటింగ్‌కు ఆర్య, అను పిల్లలతో కలిసి కిందకు వస్తారు. పిల్లలందరూ అఖి, అభయ్‌లకు బర్తుడే విషెష్‌ చెప్తుంటారు. ఇంతలో ఆర్య కేశవను ఆనంది కిందకు రాకూడదుని ఏదో ఒకటి చేయాలని చెప్తాడు. కేశవ, ఆర్య పైకి వెళ్తారు. ఆనంది గదిలో ఉండదు. పార్టీకి వచ్చిన పిల్లలందరూ అఖి, అభయ్‌ మాస్కులు వేసుకుని తమను  గుర్తుపట్టమని అడుగుతారు. ఒక్కొక్కరిని అఖి, అభయ్‌ గుర్తుపడుతుంటారు. ఇంతలో అఖికి అనుమానం వచ్చి నువ్వెవ్వరు అంటూ మాస్క్‌ తీయగానే ఆనంది అని చెప్తుంది. ఆనందిని చూసిన అఖి, అభయ్‌లతో పాటు మిగతావాళ్లు షాక్‌ అవుతారు. నువ్వెవ్వరూ అఖి వాళ్ల నైబర్‌వా? అందుకే గ్రాండ్‌గా రెడీ అయ్యాయా అని అడుగుతారు. దీంతో ఆనంది ఇవాళ తన బర్తుడే అని చెప్తుంది. దీంతో పిల్లలందరూ ఆనందికి విషెష్‌ చెప్తారు. అభయ్‌, అఖి బాధగా చూస్తుండిపోతారు.

నీరజ్‌: పిల్లలు లేట్‌ అయిపోతుంది. కదా.. రండి రండి..

పిల్లాడు: వెయిట్‌ అంకుల్‌ ఇంకో బర్తుడే గర్ల్‌ కూడా యాడ్‌ అవ్వాలి కదా?

అంటూ ఆనందిని అఖి, అభయ్‌ల పక్కన నిలబెట్టగానే పిల్లలిద్దరూ డల్‌గా ఉండిపోతారు. నీరజ్‌ క్యాండిల్స్‌ వెలిగించి అఖి, అభయ్‌లను క్యాండిల్స్‌ ఊది కేక్‌ కట్‌ చేయండి అని చెప్పగానే పిల్లలు చూస్తుండిపోతారు. ఇంతలో ఆనంది క్యాండిల్స్‌ ఊదుతుంది. దీంతో అభయ్‌ కేక్‌ను తోసేస్తాడు.

ఆర్య: అభయ్‌ ఏం చేస్తున్నావు తప్పు కదూ..

అభయ్‌: నాకు ఈ బర్తుడే చేసుకోవడం అసలు ఇష్టం లేదు.

అంటూ పిల్లలిద్దరూ పైకి వెళ్లిపోతారు. వారి వెనకాలే అను, ఆర్య వెళ్తారు.

అను: అఖి, అభయ్‌ ఏం చేస్తున్నారు మీరు. అలా పార్టీ మధ్యలోంచి వచ్చేయొచ్చా? నాన్నకు ఎంత ఇన్‌సల్ట్‌ తెలుసా?

అభయ్‌: నాన్నకు ఇన్‌సల్ట్‌ అని అంటున్నావు కానీ మాకు ఎంత ఇబ్బంది ఉందో తెలుసా?

అంటూ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఆనంది ఉంటే మాకు ఇష్టం లేదు. పార్టీకి ముందు మిమ్మల్ని ఏం గిఫ్ట్‌ అడిగాము ఆనంది పార్టీలో ఉండకూడదని అడిగాము అంటూ ఏడుస్తుంటారు. మీరింతకముందు ఇలా ఉండేవారు కాదు ఇప్పుడెందుకు ఇంత జెలసీ.. అని అను అడగ్గానే ఎందుకంటే అప్పుడు నాన్న మా దగ్గర లేడు. ఇప్పుడు నాన్న ప్రేమ తెలిశాక నాన్న ప్రేమంతా మాకే కావాలనిపిస్తుంది. అంటూ ఏడుస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న 'గుంటూరు కారం' బ్యూటీ - ఈసారి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ షేర్!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget