అన్వేషించండి

Prema Entha Madhuram Serial: ఇంకెన్నాళ్లు? ఓకే ఇంట్లో ఉన్నా.. భార్యని కనుక్కోలేకపోతున్న హీరో - ఇంకెప్పుడు కలుపుతారు ఆ ఇద్దరినీ?

Prema Entha Madhuram Serial: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుంది.. ఎన్నో మలుపులు తిరిగిన ఈ సీరియల్ ప్రస్తుతం అభిమానులకు విసుగు కలుగుతుంది.. కారణం?

Prema Entha Madhuram Serial: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు నెంబర్ వన్ సీరియల్.. మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకొని మొదటి రెండు స్థానాల్లో ఉండేది. ఈ సీరియల్ మొదట్లో 40 ఏళ్ళు దాటిన వ్యక్తికి 20 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయికి మధ్య ప్రేమ పెళ్లి అనే కొత్త కాన్సెప్ట్ జనాలకి నచ్చటంతో సీరియల్ ని చాలా బాగా ఆదరించారు ప్రేక్షకులు.

హీరో హీరోయిన్ల మధ్య లవ్.. హీరోకి కుటుంబం మీద ఉన్న గౌరవం.. ఇవన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అయితే రాను రాను ప్రేక్షకులు ఈ సీరియల్ బోర్ ఫీల్ అయ్యేలా కథ కొనసాగుతుంది. ఎందుకంటే సీరియల్లో మరీ సాగదీత ఎక్కువైపోయింది. విడిపోయిన భార్యాభర్తలని ఒక సందర్భంలో కాకపోతే మరొక సందర్భంలో అయినా డైరెక్టర్ కలుపుతాడేమో అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కలుస్తున్నట్టే కలిసి విడిపోవడానికి ఒక కారణం చూపించడంతో విసుగు చెందుతున్నారు ప్రేక్షకులు.

అసలు భార్యాభర్తలు విడిపోవడానికి చూపించిన కారణం కూడా అంత లోతైన విషయం కాదు అంటూ పెదవి విరుస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరూ ఒక ఇంట్లో ఉంటున్నప్పటికీ ఒకరిని ఒకరు చూసుకోలేకపోవడం ఏమిటి? ఇంకా వెటకారం ఏమిటంటే ఎప్పుడూ హీరోయిన్ అను ఆర్యని చూసి జాగ్రత్త పడిపోతుంది. కానీ ఆర్య ఒక్కసారి కూడా అనుని చూడకపోవటం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రేమ ఎంత మధురం, 100 జన్మల సంబంధం అని ఇద్దరి సాన్నిహిత్యం గురించి అంత గొప్పగా కథ మొదలైన కానీ.. ఆ భర్త తన భార్య చేతి వంటని కానీ ఆమె గొంతుని గాని ఎందుకు పసిగట్టలేకపోతున్నాడు? పైగా ఆమెని రాజనందిని ఆవహిస్తూ ఉండేది. ఈ మధ్యన ఎందుకు రాజనందిని కథ పక్కన పెట్టేశారంటు అంటూ సెటైరికల్ ప్రశ్నలు వేస్తున్నారు ప్రేక్షకులు. ఎప్పుడూ అను ఇంట్లో ఉంటే ఆర్య బయట ఉండడం, అను బయట ఉంటే ఆర్య ఇంట్లో ఉండటం వాళ్ళిద్దరూ కలుస్తారు అనే సమయానికి ఏదో ఒక ట్విస్ట్ పెట్టడం సీరియల్ లో రోజూ జరుగుతూనే ఉన్నాయి.

ఇక వారిద్దరినీ కలపరా అంటూ ప్రేక్షకులు సైతం విసుకు చెందుతున్నారు. అయితే సీరియల్ ఎంత సాగదీస్తున్నప్పటికీ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ మంచి రేటింగ్ నే ఇస్తున్నారు కానీ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు అంటూ కామెంట్ ల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలని కలపకుండా ఆ బాధ్యత పిల్లల మీద పెట్టారు, ఈ వయసులో పిల్లల మీద పెద్ద బాధ్యత పెట్టారు అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ వైరల్ అవుతుంది.

అది నిజమే కదండి ఈ వయసులో పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టడం అవసరమా డైరెక్టర్ గారు మీరైనా కొంచెం ఆలోచించాలి కదా అని కొందరు కామెంట్స్ పెడుతుంటే నిజంగా పిల్లలు ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించేస్తున్నారు అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సీరియల్లో ఈ పాయింట్ పై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఏర్పడిందని అంటున్నారు ప్రేక్షకులు.

ఇప్పటికే ఈ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా సీరియల్ ని సాగుదీత ఎక్కువైతే జనాలకి మొహాలు మొత్తడం ఖాయం. ఇప్పటికైనా వాళ్ళని కలిపి స్టోరీని ముందుకి తీసుకువెళ్తే మళ్ళీ సీరియల్ పూర్వవైభవం సంపాదించుకుంటుంది అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

Also Read : చిన్నోడు vs పెద్దోడు - ‘గుంటూరు కారం’తో ‘సైంధవ్’ పోటీపై స్పందించిన వెంకటేశ్

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుతో పెళ్లి గురించి మాట్లాడిన వెంకీ – ఆఫీసు లాభాలను ఇంట్లో వాళ్లకు ఇచ్చిన రాజు   
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుతో పెళ్లి గురించి మాట్లాడిన వెంకీ – ఆఫీసు లాభాలను ఇంట్లో వాళ్లకు ఇచ్చిన రాజు   
Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget