అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today September 16th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: కొడుకుతో గొడవపడ్డ యాదగిరి – గౌరిని కిడ్నాప్ చేసేందుకు పాండు ప్లాన్

Prema Entha Madhuram Today Episode: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన కొడుకుతో యాదగిరి గొడవ పడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: మూడు జంటలు ఒకరికి తెలియకుండా ఒకరు రాత్రికి గార్డెన్‌ లో కలుసుకుందామనుకున్న చీటి చూసి ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు. ఒకర్ని చూసి ఒకరు చెట్ల చాటున దాక్కుంటారు. చాలా ఫన్నీగా సీన్‌ జరుగుతుంది. ఇంతలో ఫేస్‌ ప్యాక్‌ పెట్టుకున్న శ్రావణిని చూసి శంకర్‌ దెయ్యం అంటూ భయపడటంతో అక్కడే దాక్కున్న అందరూ లేచి పరుగెత్తుకొస్తారు. ఒకర్ని ఒకరు చూసి షాక్‌ అవుతారు. బయటకు ఎందుకు వచ్చారని అడగ్గానే ఒక్కోక్కరు ఒక్కో అబద్దం చెప్తారు.

శ్రావణి: అక్కా నువ్వెందుకు వచ్చావు.

శంకర్‌: చెప్పండి మీ చెల్లెలు అడుగుతుంటే ఊఊ అంటారేంటి? చెప్పండి.

గౌరి: చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను నిలదీస్తున్నారా?

శంకర్‌: నేనేం చేశానండి..

గౌరి: మీరే కదా నన్ను తొమ్మిదింటికి బయటకు రమ్మన్నారు.

శంకర్‌: నేను మిమ్మల్ని బయటకు రమ్మన్నానా?

గౌరి: ఇదిగో సాక్ష్యం

 అంటూ చీటీ చూపిస్తుంది.  ఆ చీటి చూసిన చిన్నొడు. పెద్దోడు, శ్రావణి, సంధ్య షాక్‌ అవుతారు. చీటి చూసిన శంకర్‌ ఓపెన్‌ చేసి చదివి ఈ స్లిప్‌ కు నాకు ఏటువంటి సంబంధం లేదండి అంటాడు.

శ్రావణి: మరి మీరు రాయకపోతే మా అక్క దగ్గరకు ఎలా వచ్చింది.

శంకర్‌: ఇదిగో దెయ్యం పిల్లా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ స్లిప్పుకు నాకు ఎలాంటి సంబందం లేదు.

గౌరి: ఆ రైటింగ్‌ ఎవరిదో కనిపెడితే తెలిసిపోతుంది.

శంకర్‌: ఎలా కనిపెడతారండి. ఇందలో అక్షరాలు కూడా కనిపించనంత నలిపేశారు. అయినా సరే భూతద్దంలో చూసి కనిపెట్టేస్తాను.

సంధ్య: ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఈ స్లిప్పు నాదే

శ్రావణి: నీకెవరు రాశారే..?

సంధ్య: నా ఫ్రెండ్‌ కావ్య ఉంది కదా? తను రాసింది.

 అనగానే అవన్నీ కాదు కానీ నిజం చెప్పు వీళ్లల్లో ఎవరు రాశారు అని గౌరి అడగ్గానే లేదు అక్కా మొన్న  ఫేర్‌ వెల్‌ పార్టీ రోజు రాసింది. అని చెప్పగానే గౌరి గిల్టీగా ఫీలవుతుంది. దీంతో శంకర్‌ నా తమ్ముళ్లనే అనుమానిస్తారా? అంటూ అయినా మీరెందుకు దాక్కున్నారురా అంటూ అడగ్గానే మీరు రావడం చూసి చాటున దాక్కు్న్నాము అని చెప్పగానే గౌరి తన చెల్లెల్లను తీసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు మార్కెట్‌ కు వెళ్లి వచ్చిన యాదగిరి, జ్యోతి తమ ఇల్లు తెరచి ఉండటం చూసి షాక్‌ అవుతారు. దొంగలు పడ్డట్టున్నారు అనుకుని కర్ర పట్టుకుని లోపలికి వెళ్తారు. లోపల రవిని చూసి జ్యోతి ఎమోషన్‌ అవుతుంది.

జ్యోతి: నాన్నా రవి ఎన్నాళ్లు అయిందిరా నిన్ను చూసి. ఇన్ని రోజుల నుంచి నీకు ఈ అమ్మ గుర్తుకు రాలేదా? ఇల్లు ఇప్పుడు గుర్తుకు వచ్చిందారా నీకు.

రవి: నేను దుబాయ్‌ కి వెళ్లాను అమ్మా. ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వస్తే నాకు ఇక్కడ ఏం గౌరవం జరుగుతుందో నాకు బాగా తెలుసు.

యాదగిరి: అక్కడే ఏదో ఒక పని చేసుకుని బతక్కుండా మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో..

జ్యోతి: ఏంటండి.. ఏం మాటలండి అవి మన కన్నబిడ్డ మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు.

రవి: అమ్మా మంచి ఉద్యోగం ఇస్తానని నన్ను ఒకడు మోసం చేశాడు. ఇన్ని రోజలు అక్కడ నానా చాకిరి చేశాను. ఇంక అక్కడ ఉండలేక ఇక్కడే ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందామని వచ్చాను.

 అని చెప్పగానే యాదగిరి కోపంగా తిడతాడు. వ్యాపారం పెట్టుకోవడానికి మనదేమయినా టాటా ఫ్యామిలా? అంటాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది.  ఇంతలో జ్యోతి అకి దగ్గరకు వెళ్లి రవికి ఉద్యోగం అడుగుతానని చెప్తుంది. వద్దని వారిస్తాడు యాదగిరి. దీంతో ఉద్యోగం ఏంటి పిల్లను  కూడా అడుగుతాను. తను మా అన్నయ్య కూతురు అడిగే హక్కు నాకుంది అంటుంది. మరోవైపు పాండు ఆటోలో వెళ్లి ఆ అమ్మాయి వచ్చి ఆటో అని పిలవగానే నువ్వు వచ్చి ఆ అమ్మాయిని ఆటో ఎక్కించుకుని నేను చెప్పిన అడ్రస్‌ కు తీసుకెళ్లు అని చెప్పి లోపలికి వెళ్లబోతుంటే గేటు దగ్గరే శంకర్‌ ఉంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: గురువారం (మార్చి 19) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే... ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్
గురువారం (మార్చి 19) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే... ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్
Lakshimi Raave Maa Intiki Serial Today March 18th: శ్రీలక్ష్మీని అవమానించాలనుకున్న మ్యాడీ, త్రిష ఎలా బోల్తాపడ్డారు..? విడాకుల పేపర్లు ఇంటికి రావడంతో గోపీ ఏం చేశాడు..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: శ్రీలక్ష్మీని అవమానించాలనుకున్న మ్యాడీ, త్రిష ఎలా బోల్తాపడ్డారు..? విడాకుల పేపర్లు ఇంటికి రావడంతో గోపీ ఏం చేశాడు..?
Jagadhatri Serial Today March 18th: జగధాత్రిపై రేవతి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? మీనన్ బతికే ఉన్నాడని జేడీ, కేడీకి తెలిసిపోయిందా...?
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రిపై రేవతి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? మీనన్ బతికే ఉన్నాడని జేడీ, కేడీకి తెలిసిపోయిందా...?
kalavari kodalu kanaka mahalakshmi serial today march 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి టార్చర్ మొదలు! అంబిక భుజంగం చేతులు కలుపుతారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి టార్చర్ మొదలు! అంబిక భుజంగం చేతులు కలుపుతారా!

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: తెలుగు ప్రజలకు ఉగాది కానుక! రెగ్యులర్ రైలుగా వైజాగ్ - తిరుపతి స్పెషల్ ట్రైన్!
తెలుగు ప్రజలకు ఉగాది కానుక! రెగ్యులర్ రైలుగా వైజాగ్ - తిరుపతి స్పెషల్ ట్రైన్!
Ustaad Bhagat Singh Twitter Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
Ugadi The Saffron Flag 2026: ఉగాది రోజు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయాలా? ఏంటి దీని విశిష్టత?
ఉగాది రోజు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయాలా? ఏంటి దీని విశిష్టత?
Ustaad Bhagat Singh Live Updates: 'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
Dhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Ugadi Wishes in Telugu 2026: ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫొటోస్, కొటేషన్స్ ఇవిగో!
2026 ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫొటోస్, కొటేషన్స్ ఇవిగో!
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Embed widget