Prema Entha Madhuram Serial Today September 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరిని చూసి షాక్ అయిన రాకేష్ – పూజకు రాలేనన్న అభయ్
Prema Entha Madhuram Today Episode: గౌరిని చూసిన రాకేష్ భయపడిపోతూ మళ్లీ పుట్టారా? లేక అను పోలికలు వచ్చాయా? అని టెన్షన్ పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today September 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరిని చూసి షాక్ అయిన రాకేష్ – పూజకు రాలేనన్న అభయ్ Prema Entha Madhuram serial today episode September 12th written update Prema Entha Madhuram Serial Today September 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరిని చూసి షాక్ అయిన రాకేష్ – పూజకు రాలేనన్న అభయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/12/63035d43fb94fa5201b6228abae23d8a1726106993797879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: కాలనీ వినాయకుడి దగ్గర ఉన్న గౌరికి సంధ్య ఫోన్ చేసి పూజకు అంతా రెడీ చేశామని త్వరగా రమ్మని లేదంటే మళ్లీ రాహు కాలం వస్తుందని చెప్పడంతో గౌరి సరేనని శంకర్ ను పిలిస్తే డాన్స్ చేస్తున్న శంకర్ నువ్వు వెళ్లు నేను తర్వాత వస్తానని చెప్పడంతో గౌరి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్తున్న గౌరికి రాకేష్ ఎదురవుతాడు. బృందావనం కాలనీకి వెళ్లాలని మెయిన్ రోడ్డు నుంచి దారి తెలుసు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇలా వచ్చాను అని చెప్పడంతో గౌరి సరేనని మా కాలనీయే అని చెప్పి రాకేష్ కారులో వెళ్తూ దారి చూపిస్తుంది. మరోవైపు గణేష్ దగ్గర డాన్స్ చేస్తున్న శంకర్ కూడా ఇంటికి వస్తుంటాడు.
గౌరి: ఇక్కడే ఆపేసేయండి. ఇదే సిక్త్ ఫేస్..
రాకేష్: ఓ థాంక్యూ అండి.. మరి మిమ్మల్ని ఎక్కడ దింపాలి.
గౌరి: ఇదిగో ఇక్కడే ఇదే మా ఇల్లు
రాకేష్: ఈ ఇల్లా..
గౌరి: అవును ఇదే మా ఇల్లు..
రాకేష్: మీరు ఇక్కడే ఉంటారా?
గౌరి: అవును ఆ ఇంట్లో కింది ఫోర్షన్ లో ఉంటాము.
అని చెప్పి గౌరి కారు దిగి వెళ్లిపోతుంటే ఎవరో వస్తూ హాయ్ గౌరి అక్కా అంటూ పలకరించగానే రాకేష్ షాక్ అవుతూ కారు దిగుతాడు. ఇంతలో గౌరి లోపలికి వెళ్లి ముఖం కడుక్కుంటుంది. గౌరిని చూసిన రాకేష్ భయపడతాడు. అకి అందుకే గౌరి అంత క్లోజ్ గా ఉందా? మరి ఆర్యవర్థన్ ఎక్కడున్నాడు అని టెన్షన్ పడుతుండగానే ఇంతలో శంకర్ వస్తాడు.
శంకర్: హలో బ్రో ఎవరు వయ్యా నువ్వు ఎదురుగా మనుషులు వస్తే చూసుకోవా? గుద్దుకుంటా పోతున్నావు..
పాండు: శంకర్ ( అనగానే రాకేష్ మళ్లీ షాక్ అవుతాడు.) నువ్వు వెళ్లు వీడి సంగతి నేను చూసుకుంటాను.
శంకర్: హలో రాను రాను మీకు నా మీద ప్రేమ ఎక్కువవుతుంది.
గౌరి లోపలి నుంచి శంకర్ ను పిలుస్తుంది. శంకర్ లోపలికి వెళ్లిపోతాడు.
పాండు: ఏమయ్యా గుద్దేదేదో ఆ శంకర్‌ను కారుతో గుద్దేయోచ్చు కదా పీడ విరగడయ్యేది.
రాకేష్: శంకర్ అంటే అతనేనా..?
అని అడగ్గానే ఓనరు అవునని చెప్పగానే రాకేష్ షాక్ అవుతాడు. కోపంతో రగిలిపోతుంటాడు. అది పసిగట్టిన పాండు నేను శంకర్ కు శత్రువేనని మన ఇద్దరం కలిస్తే వాని పీడ విరగడి చేసుకోవచ్చు అంటాడు. దీంతో ఆలోచించి చెప్తానని రాకేష్ వెళ్లిపోతాడు. ఇంతలో యాదగిరి వచ్చి ఎవరతను అని పాండును అడుగుతాడు. ఎవరో తనకు తెలియదని చెప్తాడు. మరోవైపు ఇంట్లో వినాయకుని పూజ మొదలవుతుంది. ఇంకోవైపు రాకేష్ గౌరి, శంకర్ లు గుర్తు చేసుకుని భయపడుతుంటాడు. ఇంకోవైపు అభయ్ ఆఫీసులో మీటింగ్ లో ఉంటాడు. రాకేష్ కు ఫోన్ చేస్తాడు.
రాకేష్: అభయ్ కాల్ చేస్తున్నాడేంటి? గౌరి వాళ్ల ఇంటికి వెళ్లాలి అంటాడేమో.. వాణ్ని వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి. హలో అభయ్ నేనే కాల్ చేద్దామనుకుంటున్నాను. నువ్వే చేశావు. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు.
అభయ్: జోసెఫ్ వాళ్లతోనే ఉన్నాను. నీకోసమే వెయిటింగ్ ఏంటి లేటు. నువ్వు వస్తే ఇద్దరం కలిసి గౌరి వాళ్ల ఇంటికి లంచ్ కు వెళ్దాం అనుకున్నాం కదా?
రాకేష్: నో వే అభయ్ నేను ఇంకా ఇక్కడే ఉండిపోయాను. హెవీ ట్రాఫిక్. క్లియర్ అవ్వడానికి 4 గంటలు పట్టొచ్చు అంటున్నారు.
అభయ్: ఓకే రాకేష్ సరేలే.. అకి కాల్ చేస్తుంది తనకు రాలేనని చెప్పేస్తాను.
అని అకి ఫోన్ లిఫ్ట్ చేసి అభయ్ రాలేనని ట్రాఫిక్ ఉందట అని చెప్పడంతో అకి డిస్సపాయింట్ గా ఫోన్ కట్ చేస్తుంది. వినాయకుని పూజ అయిపోగానే అందరూ కలిసి భజన చేస్తుంటారు. తర్వాత రాకేష్ ఎవరో స్వామిజీ దగ్గర కూర్చుని ఉంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కు ఐ లవ్ యూ చెప్పిన నక్షత్ర – పూరికి ఇందును సారీ చెప్పమన్న చంద్ర
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)