Prema Entha Madhuram Serial Today September 11th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: కాలనీ గణేష్ వేడుకల్లో గౌరి, శంకర్ – గౌరిని చూసిన రాకేష్ షాక్
Prema Entha Madhuram Today Episode: కాలనీ గణేస్ ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లిన గౌరి తిరిగి ఇంటికి వస్తుండగా రాకేష్ చూడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today September 11th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: కాలనీ గణేష్ వేడుకల్లో గౌరి, శంకర్ – గౌరిని చూసిన రాకేష్ షాక్ Prema Entha Madhuram serial today episode September 11th written update Prema Entha Madhuram Serial Today September 11th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: కాలనీ గణేష్ వేడుకల్లో గౌరి, శంకర్ – గౌరిని చూసిన రాకేష్ షాక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/70523db4a6974c16f559d56047f6d81e1726023276899879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: గౌరి కళ్లు తెరవడం లేదని శంకర్ ఐ లవ్ యూ అంటూ చెప్పడంతో గౌరి షాకింగ్ గా కళ్లు తెరిచి చూస్తుంది. అప్పుడు వెంటనే శంకర్ కళ్లల్లో పడిన నలకను తీస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. గౌరి తనకు ఐ లవ్ యూ ఎందుకు చెప్పావని అడుగుతుంది. దీంతో శంకర్ నిన్ను పెళ్లి చేసుకుందామని చెప్పాను అంటాడు. దీంతో కోపంగా షాక్ తెప్పించాలంటే ఐలవ్యూ అనే చెప్పాలా? మరేదైనా చెప్పొచ్చు కదా అంటూ లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత చిన్నొడు, పెద్దోడు కూడా శ్రావణి, సంధ్యలను తమ కళ్లల్లో నలక పడితే మమ్మల్నే పిలవండి అంటారు. దీంతో అందరూ వెళ్లిపోతారు.
జ్యోతి: చూశారా? మా అన్నయ్య వదినలను ఎలా దగ్గర చేస్తున్నానో..
యాదగిరి: చేస్తే చేయ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు నాకు చెప్పి చేయ్యవే.. సడెన్ గా చేస్తే బీపీ పెరిగిపోయేలా ఉన్నాను.
జ్యోతి: ఐడియాలు అప్పటికప్పుడు వస్తాయండి ముందే చెప్పడం కష్టం. మీరే కాస్త ప్రిపేర్డ్ గా ఉండండి.
అని చెప్పి జ్యోతి వెళ్లిపోతుంది. మరోవైపు అకి ఎర్లీగా ట్రెడిషన్ గా రెడీ అవుంతుంది. అభయ్ వచ్చి అకి చాలా త్వరగా రెడీ అయ్యావు అబ్రాడ్ లో ఉన్నప్పుడు చాలా లేజీగా ఉండేదని జెండేకు చెప్తాడు. ఇప్పుడు అమ్మానాన్న ఉండి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవారో అంటాడు. దీంతో ఇప్పుడు నేను అమ్మా నాన్నలతోనే ఉన్నాను కదా? అంటుంది అకి. దీంతో జెండే, అభయ్, రాకేష్ షాక్ అవుతారు. ఇంతలోనే అదే ఇండియాలో ఉంటే అమ్మా నాన్నలతో ఉన్నట్లే కదా అంటుంది. దీంతో అభయ్ కూడా నాకు అమ్మా నాన్నలకు దగ్గరగా ఉన్న ఫీల్ అనిపిస్తుంది. అంటాడు. తర్వాత అకి పూజకు వెళ్తుంది. అభయ్, జెండే లంచ్ టైం కు పూజకు వస్తామని చెప్పి ఆఫీసుకు వెళ్తారు. మరోవైపు శంకర్ వాళ్ల ఇంటి ఓనరు వస్తాడు. ఎందుకు వచ్చావని శంకర్ అడగ్గానే గౌరి తానే భోజనానికి రమ్మని పిలిచానని మనందరం ఇలా కలిసి ఉండటానికి కారణం ఆయనే కదా అంటుంది. ఇంతలో అకి వస్తుంది.
అకి: అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు.
యాదగిరి: ఈ కాలనీలో వినాయకుణ్ని నిలబెడుతున్నారమ్మా అందరం కలిసి అక్కడకు వెళ్తున్నాం.
అకి: అయితే నేను కూడా వస్తాను.
శంకర్: వద్దులే అకి..
గౌరి: అక్కడ అంతా గోలగోలగా ఉంటుంది.
శంకర్: అవును పైగా రంగులు కూడా చల్లుతారు. ఇంత చక్కగా రెడీ అయ్యావు అందుకే వద్దంటున్నాము.
యాదగిరి: కూతురు మీద తల్లిదండ్రుల ప్రేమ ఏ జన్మకు మారదు.
శంకర్: నువ్వు లోపల పూజ దగ్గర కూర్చో మేము వెంటనే వస్తాము.
అని అందరూ వెళ్లిపోతారు. అకి లోపలికి వెళ్తుంది. కాలనీ వినాయకుని దగ్గరకు వెళ్లిన అందరూ హ్యాపీగా డాన్సులు చేస్తూ రంగులు చల్లుకుంటూ గణపతి బప్పా మోరియా అంటూ ఉంటారు. ఇంతలో అదే కాలనీలోకి రాకేష్ వస్తాడు. కార్లన్నీ జామ్ అయిపోయి ఉంటాయి. అందరూ డాన్సులతో నిమగ్నమై ఉండగా ఇంతలో శంకర్, గౌరికి రంగు పూయగానే గత జన్మ గుర్తుకు వస్తుంది. గౌరి కూడా శంకర్ కు రంగు పూస్తుంది. ఇంటి ఓనరు తన బ్యాగులోంచి కారం తీసి శంకర్ కళ్లల్లో కొట్టడానికి ప్రయత్నిస్తాడు. శంకర్ తెలుసుకుని అదే కారం ఓనరు కళ్లల్లో కొడతాడు. దీంతో ఓనరు మంట మంట అని ఏడుస్తుంటాడు. తర్వాత గౌరి ఇంటికి వెళ్తుంటే రాకేష్ కారులో ఎదురుగా వస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ఐ లవ్ యూ చెప్పిన భూమి – భూమిని తోసేసిన గగన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)