అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today October 3rd : ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాకేష్‌కు నిజం చెప్పిన రవి – వినయ్‌ బండారం బయటపెడతామన్న శంకర్‌

Prema Entha Madhuram  Today Episode: దుబాయ్‌ షేకుల్లా వేషం వేసుకుని వచ్చిన శంకర్‌ తన తమ్ముళ్లతో గౌరి ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా  జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  రవి త్వరగా నిద్ర లేచి వెళ్తుంటే యాదగిరి ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతాడు. అకికి ఏదో ముఖ్యమైన పని ఉందని అందుకే నన్ను త్వరగా రమ్మని చెప్పింది అందుకే నేను వెళ్తున్నాను అని వెళ్లిపోతాడు రవి. మరోవైపు పాండు వినయ్ మాట్లాడుకుంటుంటే గౌరి, శ్రావణి, సంధ్య వస్తారు. ఏంటండి ఏదో సెట్‌ చేస్తాను అంటున్నారు అని అడగ్గానే పాండు అబద్దాలు చెప్తాడు. ఇంతలో గౌరి బాబాయ్ వచ్చి మీ ఫ్రెండ్స్‌ ఇంకా రాలేదా? అని అడుగుతాడు. ఆన్‌ ది వే లో ఉన్నారని పాండు చెప్తాడు. మరోవైపు రవి అకి వాళ్ల ఇంటికి రాగానే రాకేష్‌ ఎదురవుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇంతలో రవి వినయ్ బండారం బయటపెట్టేది మొత్తం చెప్తాడు. దీంతో రాకేష్‌ పాండుకు  ఫోన్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో అభయ్ వస్తాడు.

అభయ్‌: ఏంటి రాకేష్‌ టెన్షన్‌గా కనిపిస్తున్నావు.

రాకేష్‌: టెన్షనా.. ఏం లేదే? ఇప్పటిదాకా రవితో మాట్లాడుతున్నాను. ఫోన్‌ వస్తే పక్కకు  వచ్చాను.

అభయ్‌: రవి వచ్చాడా? ఎక్కడ..?

రాకేష్‌: అదిగో.. అక్కడ..

అభయ్‌: సరే రా.. హాయ్‌ రవి.. ఎంత సేపు అయింది వచ్చి.

రవి: జస్ట్‌ ఇప్పుడే వచ్చాను సార్‌.

అభయ్‌: రాకేష్‌ ఈరోజు మన ప్లానేంటి? మీటింగ్స్‌ ఏమైనా ఉన్నాయా…?

రాకేష్‌: యా అభయ్‌ మనం వెంటనే స్టార్ట్‌ అయి గచ్చిబౌలి వెళ్లాలి. ఫోర్‌ వరకు మీటింగ్‌ ఉంటుంది. లంచ్‌ కూడా అక్కడే.

అభయ్‌: అదేంటి రాకేష్‌. లంచ్‌కు అకితో కలిసి గౌరి గారి ఇంటికి వెళ్లాలనుకున్నాం కదా?

రాకేష్‌: అంటటే అది చాలా ఇంపార్టెంట్‌ మీటింగ్‌  కదా అందుకే..

   ఇంతలో అకి వచ్చి కోప్పడుతుంది. దీంతో అభయ్‌ ఎన్ని మీటింగులు ఉన్నా సరే క్యా్న్సిల్‌ చేసుకుని వస్తాను అంటాడు. దీంతో అకి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కాల్‌ చేసి ఇస్తాను నువ్వు గౌరిగారికి వస్తు్‌న్నాం అని చెప్పు అన్నయ్య అని కాల్ చేస్తుంది. గౌరితో మాట్లాడిన అభయ్‌ మీ కూర తిన్నాక నాకు మా అమ్మ గుర్తుకు వచ్చిందని చెప్తాడు. మరోసారి మీ చేతివంట తినాలని ఉందని చెప్తాడు. గౌరి సరే అంటుంది. మరోవైపు పాండు, యాదగిరి కోసం ఎదురుచూస్తుంటాడు. అరబ్బు షేకులను తీసుకుని వస్తానన్నాడు ఇంకా రాలేదేంటి అనుకుంటాడు. ఇంతలో యాదగిరి స్కూటీ మీద వచ్చి పాండు మీదకు వెళ్తాడు. ఇంతలో అరబ్బు షేకుల వేషంలో శంకర్‌ వాళ్ల తమ్ముళ్లు వస్తారు.

పాండు: ఈ ఇంట్లో ఒక వేస్ట్‌  ఫెలో ఉన్నాడు. వాణ్ని పెద్ద ఎన్నారై అని చెప్పి తీసుకొచ్చిన. ఏంటి అలా కొట్టారు.

శంకర్‌: నీది బుగ్గలు మాకీ నచ్చాయి. అది టచ్‌ చేశా. ఫ్రెండ్లీగా..

పాండు:  అయితే ఓకే.. ఇప్పుడు  మీరంతా ఆ ఎన్నారైగాడు మీ ఫ్రెండు అని బిల్డప్‌ ఇచ్చి  నమ్మేలా చేయాలి.

 అని చెప్పగానే శంకర్‌ మళ్లీ కొడతాడు. దీంతో ఎందుకు మళ్లీ కొట్టావు అని అడుగుతాడు. నీ తల మీద డస్ట్‌ ఉందని కొట్టా అంటాడు. తర్వాత పాండు నేను లోపలికి వెళ్తున్నాను తర్వాత మీరు లోపలికి రండి అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు అకి, రవి కలిసి గౌరి వాళ్ల ఇంటికి వెళ్తున్నామని లంచ్‌ టైం కు నువ్వు అక్కడికి రా అంటూ జెండేకు చెప్తారు. ఇంతలో జోగమ్మ వస్తుంది. తప్పు జరుగుతుంది. మీరు  ఏదైతే అనుకుంటున్నారో అది అమ్మకు ఒప్పు కాదు అంటూ హెచ్చరిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Embed widget