అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today March 15th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆర్య ప్లాన్‌ సక్సెస్‌ - చైర్మన్‌గా ఎన్నికైన ఆర్య – పారిపోయిన అజయ్

Prema Entha Madhuram Today Episode: తిరిగి బోర్డు మెంబర్స్ ఆర్యను చైర్మన్ గా ఎన్నుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: షేర్స్‌ ఎక్కువగా ఉన్న  నేనే చైర్మన్‌ అవుతాను. అది నువ్వు తెలుసుకోవాలి అంటూ అజయ్‌ చెప్పగానే ఆర్యవర్దన్‌ నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతున్నారు మీకు రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ తెలియవా అంటూ మీరా ప్రశ్నిస్తుంది. దీంతో తెలుసని నీకే తెలియని విషయం ఉందని ఈ కంపెనీ లో  15 పర్సెంట్‌ షేర్స్‌ ఉన్న శర్మ గారు ఉన్నారని అయన ఓటింగ్‌ కూడా ఇక్కడ చెల్లుతుందని ఆర్య చెప్పగానే ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కదా అంటుంది మీరా. మరోవైపు అను శర్మగారిని తీసుకుని ఆఫీసుకు వస్తుంది.

అజయ్‌: సో వాట్‌ ఆయనెవరో రావాలి కదా?

కేశవ: వస్తారు..

అను: వచ్చారు. సార్‌ రండి

శర్మ: నమస్కారం ఆర్యవర్ధన్‌ గారు.

ఆర్య: నమస్కారం ఎలా ఉన్నారు..

శర్మ: బాగున్నాను సార్‌. అందరికీ నమస్కారం. ప్రశాంతంగా బతకాలని నేను అన్ని వదులుకుని  సిటీకి దూరంగా బతుకుతున్నాను. కానీ ఇవాళ ఇక్కడ నమ్మకానికి అన్యాయం జరుగుతుందని నేను ఈ మీటింగ్‌కు రావాల్సి వచ్చింది.

మీరా: మీరు కంపెనీ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌ మెంబర్‌ కాదు కదా?

శర్మ: మీరా గారు నేను కంపెనీ అన్ని వివరాలు తెలుసుకుంటున్నాను. కంపెనీ టర్నోవర్‌ నుంచి టైఅప్‌ వరకు నాకు అన్నీ వివరాలు తెలుసు. కంపెనీ ప్రాసెసింగ్‌ లో అందరు బోర్డు మెంబర్స్‌ సంతకాలతో పాటు నా సంతకం కూడా ఉంది.

కేశవ: ఎస్‌ నేనే స్వయంగా వెళ్లి సంతకాలు తీసుకునేవాడిని

శర్మ: ఆర్యవర్థన్‌ గారినే నేను చైర్మన్‌గా సపోర్టు చేస్తున్నాను.

అని శర్మ సంతకం చేస్తాడు. దీంతో మిగతా బోర్డు మెంబర్స్‌ కూడా సంతకాలు చేస్తారు. దీంతో కేశవ మెజారిటీ ఓటింగ్‌ తమకే వచ్చిందని చెప్పడంతో అజయ్‌, మీరా షాక్‌ అవుతారు.  కోపంగా అజయ్‌ అక్కడినుంచి వెళ్లిపోతాడు. మీరా వెళ్తుంటే

ఆర్య: ఒక్క నిమిషం మీరా.. ఇదే కంపెనీలో ఒకప్పుడు నీతినిజాయితీతో పనిచేసిన మీరాహెగ్డేను చూశాను. ఇప్పుడు పగ ధ్వేషాలతో మంచి చెడు విచక్షణ తెలియకుండా పోయిన మీరావర్ధన్‌ను చూస్తున్నాను. నిన్ను నువ్వు కోల్పోయి ఏం సాదిద్దామని.

అనగానే మీరా వెళ్లిపోతుంది. తర్వాత శర్మ వెళ్లిపోతారు. ఇంతలో నీరజ్‌కు పిల్లలు వీడియో కాల్ చేసి ఆర్య, అనులతో మాట్లాడతారు. తర్వాత శారదాదేవి ఇంట్లో ఎదురుచూస్తుంది. ఇంతలో ఆర్య, అను, నీరజ్‌ వస్తారు.

శారదాదేవి: కంగ్రాట్స్‌ నాన్నా.. మొత్తానికి సాధించావు. అక్కడ సమస్యేం రాలేదు కదా

నీరజ్‌: అమ్మా దాదా కొట్టిన దెబ్బకి ఆ అజయ్‌ మైండ్‌ దిమ్మతిరిగిపోయింది.

శారదాదేవి: వాళ్ల నాన్నతోనే వైరం ముగిసిపోయిందనుకున్నాను. వీడు మళ్లీ మోసుకొచ్చాడు జాగ్రత్తగా ఉండండి నాన్నా..

 అర్య: అలాగే అమ్మా

అను: అత్తమ్మా పిల్లలు ఎక్కడ?

శారదాదేవి: పిల్లలు మీకు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారమ్మా..

 అనగానే పిల్లలు కుకింగ్‌ డ్రెస్‌ వేసుకుని అవును సర్‌ప్రైజ్‌ అంటూ వస్తారు. అమ్మా నాన్నల కోసం స్పెషల్‌ స్నాక్స్‌ చేశామని చెప్తారు.  మీరు ఎలా చేశారని అడిగితే పిన్ని హెల్ప్‌ చేసిందని చెప్తారు. పిల్లలు చేసిన స్నాక్స్‌ తిని అందరూ చాలా రుచిగా ఉన్నాయని చెప్తారు. మరోవైపు అజయ్‌ కోపంగా ఫీలవుతుంటే మీరా వచ్చి దీనికే ఇంత డిస్టర్బ్‌ అయితే ఎలా అంటూ అజయ్‌ని కూల్‌ చేస్తుంది మీరా. ఆర్యవర్థన్‌ను ఓడించాలంటే ఆవేశం కాదు ఆలోచన ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్యవర్ధన్‌ ఆకాశం లాంటివారు. కూల్‌గా ఆలోచించు అజయ్‌ అంటూ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ప్రభాస్ 'కల్కి' పై అమితాబ్ పోస్ట్ - మరోసారి ఆ రూమర్స్‌కి చెక్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 2nd: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం
నిండుమనసులు: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం
Illu Illalu Pillalu Serial Today June 2nd: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?
Podarillu Serial Today June2nd:చక్రిపై నిందలు తిప్పికొట్టిన మహాలక్ష్మీ...తన భర్త కనిపించడంలేదంటూ మాధవ్‌కు చెప్పిన మహా
పొదరిల్లు:చక్రిపై నిందలు తిప్పికొట్టిన మహాలక్ష్మీ...తన భర్త కనిపించడంలేదంటూ మాధవ్‌కు చెప్పిన మహా
Gundenininda Gudigantalu Serial Today: తండ్రిని మరోసారి చంపేసిన పార్లలమ్మ, బెడిసికొట్టిన బాలు ప్లాన్, చింతామణి కొత్త స్కెచ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్
తండ్రిని మరోసారి చంపేసిన పార్లలమ్మ, బెడిసికొట్టిన బాలు ప్లాన్, చింతామణి కొత్త స్కెచ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget