అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today January 6th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:   మాయకు వార్నింగ్‌ ఇచ్చిన శంకర్‌ – భయంతో వణికిపోయిన రాకేష్‌

Prema Entha Madhuram  Today Episode:  రౌడీలు తనపై అటాక్ చేయడం మొత్తం నా డైరెక్షన్‌ లోనే జరిగిందని శంకర్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌ ఒక్కడే కారులో ఆఫీసుకు వెళ్తుంటే రౌడీలు అడ్డగిస్తారు. శంకర్‌ కారు ఆపి రోడ్డు మధ్యలో కార్లు ఆపారు సెన్స్‌ లేదా అని అడుగుతాడు. మాకు లైసెన్సే లేదు సెన్స్‌ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. అయితే గొడవ పెట్టుకోవడానికే వచ్చారు. రండిరా అనగానే రౌడీలు అందరూ శంకర్‌ మీదకు వెళతారు. రౌడీలను పిచ్చకొట్టుడు కొడుతుంటాడు శంకర్‌. మరోవైపు శంకర్‌  కోసం జెండే, అభయ్‌, మాయ, రవి వస్తుంటారు. రౌడీలు పెద్ద కర్ర తీసుకుని శంకర్‌ తల మీద కొడతారు. ఇంతలో అభయ్‌ వాళ్లు వస్తారు. ఎవరు శంకర్‌ గారు వాళ్లు అని అభయ్‌ అడుగుతాడు.

శంకర్‌: ఎవరో తెలియదు అభయ్‌. రోడ్డులో సడెన్‌గా కారు ఆపి కొట్టడానికి వచ్చారు.

జెండే: ఇంకెవరు ఉంటారు  ఆ రాకేష్‌ గాడే ఇలా చేసి ఉంటాడు

అభయ్‌: రాస్కెల్ చంపేయాలి వాణ్ని.

జెండే: అభయ్‌, శంకర్‌ను ఇంటికి తీసుకెళ్దాం పద..

శంకర్‌: వద్దు సార్‌ అభయ్‌కు ఆఫీసులో వర్క్‌ ఉంది కదా..? నేను వెళ్తాను. మీరు ఆఫీసుకు వెళ్లండి.

అభయ్‌: శంకర్‌ గారు మీకన్నా ఆఫీసు ఎక్కువ కాదు. ఫ్రెండ్‌ కారు తీయండి వెల్దాం.

రవి: అభయ్‌ మీరు ఆ కారులో వెళ్లండి మేము ఈ కారు తీసుకొస్తాం.

అభయ్‌: అలాగే రవి..

శంకర్‌ను తీసుకుని జెండే, అభయ్‌ వెళ్లిపోతారు.

రవి: చా మీ అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు.

మాయ: యూస్‌లెస్‌ ఆలోచనలు చేస్తాడు కాబట్టే యూస్‌లెస్‌ రిజల్ట్‌ వస్తాయి.

రవి: ముందు కాల్‌ చేసి అడుగు మనం చూసుకుంటాం అని చెప్పాము కదా..?

మాయ: అయిపోయాడు ఇవాళ నా చేతిలో…

రాకేష్‌: హలో సిస్టర్‌ ఎనీ గుడ్‌ న్యూస్‌..

మాయ: షటప్‌.. శంకర్‌ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా..? నువ్వెందుకు అనవసరమైన ప్లాన్లు వేస్తున్నావు.

అని మాయ తిట్టగానే.. నేనే ప్లాన్లు చేయలేదు. ఏ రౌడీలను నేను పంపలేదు అంటాడు రాకేష్‌. నువ్వు డీల్‌ చేస్తా అన్న తర్వాత నేనెందుకు ప్లాన్‌ చేస్తాను. వాడే వంద మంది రౌడీలను పంపే రకం అని చెప్తాడు. ఇదంతా ఆ శంకర్‌ ప్లాన్‌ అని నీకు ఇంకా అర్థం కాలేదా..? ఆర్యవర్థన్‌ అంటేనే అంచనాలకు అందడు.. శంకర్‌ అంచనాలను తారుమారు చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు రాకేష్‌. మరోవైపు ఇంటికి వచ్చిన శంకర్‌ ను చూసి గౌరి కంగారు పడుతుంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చారని అభయ్‌, జెండేల మీద అరుస్తుంది. దీంతో అసలు మీరు గౌరి గారేనా అని శంకర్‌ అనుమానంగా అడుగుతాడు. గౌరి, అభయ్‌, జెండే, అకి, యాదగిరి షాక్‌ అవుతారు. అందరూ కలిసి శంకర్‌ను రూంకి తీసుకెళ్తారు.

గౌరి: సార్‌ ఇప్పుడు మీకు కంఫర్ట్‌ గానే ఉంది కదా…

శంకర్‌: నా కంఫర్ట్‌ గురించి మీరు ఎందుకు ఇంత టెన్షన్‌ పడుతున్నారో నాకు అర్థం అయిపోయింది. నేను మిమ్మల్ని కిడ్నాప్‌ చేసిన వాళ్ల నుంచి కాపాడాను కాబట్టి. అంతే కదా..?

గౌరి: ఏం లేదు సార్‌ నేను వెళ్లి మీకు జ్యూస్‌ తీసుకొస్తాను.

శంకర్‌: జెండే సార్‌ గౌరి గారు చాలా మారిపోయారు. కారణం ఏమై ఉంటుంది.

జెండే: కొన్ని మార్పులకు కారణం ఉండదు శంకర్‌. కాలమే అన్నింటినీ మారుస్తుంది. అకి, అభయ్‌ జాగ్రత్తగా చూసుకోండి.

 అని చెప్తూ.. కిచెన్‌ లోకి వెళ్లగానే.. అక్కడ గౌరి ఏడుస్తుంది. జెండే, యాదగిరి.. గౌరిని ఓదారుస్తారు.  తర్వాత మాయ, రవి వచ్చి శంకర్‌ను తిడతారు. ఇంతలో జెండే వచ్చి మాయను తిడతాడు. దీంతో ఆ రౌడీలను సెట్‌ చేసింది ఈ శంకరే అంటుంది. జెండే అడగ్గానే ఈ హోల్‌ సీన్‌కు శంకరే డైరెక్టర్‌ అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కొండదేవర వచ్చి జోస్యం చెప్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today May 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు పెళ్లి చెడగొట్టేందుకు రేఖ ప్లాన్‌ - నిజం తెలుసుకున్న స్వాతి
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు పెళ్లి చెడగొట్టేందుకు రేఖ ప్లాన్‌ - నిజం తెలుసుకున్న స్వాతి
Nindu Noorella Saavasam Serial Today May 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం మర్చిపోయిన అమర్‌ - అయోమయంలో భాగీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం మర్చిపోయిన అమర్‌ - అయోమయంలో భాగీ  
Godavari Serial First Episode: మిథున 'గోదావరి' సీరియల్: జానూగా మిథున 'గోదావరి' ఈదగలదా! అందరూ తెలిసిన వాళ్లే!
మిథున 'గోదావరి' సీరియల్: జానూగా మిథున 'గోదావరి' ఈదగలదా! అందరూ తెలిసిన వాళ్లే!
Nindu Manasulu Serial Today May 11th: నిండు మనసులు: ప్రేరణకు భర్త్‌డే సర్‌ఫ్రైజ్ ఇచ్చింది ఎవరు? సిద్ధూ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఏముందో ప్రేరణ చూస్తుందా!
నిండు మనసులు: ప్రేరణకు భర్త్‌డే సర్‌ఫ్రైజ్ ఇచ్చింది ఎవరు? సిద్ధూ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఏముందో ప్రేరణ చూస్తుందా!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Embed widget