Prema Entha Madhuram Serial Today Fabruary 1st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అకిని ఇంటికి తీసుకెళ్లిన రవి – కోపంతో రవిని కొట్టబోయిన యాదగిరి
Prema Entha Madhuram Today Episode: అభయ్ గో గొడవ పడి అకిని ఇంటికి తీసుకెళ్తాడు రవి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: శంకర్, యాదగిరికి ఫోన్ చేసి తన తమ్ముళ్లను మాయ కేసులో ఇరికించిందని చెప్తాడు. అలాగే రవి మళ్లీ మాయ మాటలు వింటున్నాడని అకిని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని నువ్వే ఏదైనా చేసి ఆపాలని చెప్తాడు. అలాగే గౌరిని ఇంకేదో పూజ పేరుతో గుడిలోనే ఉంచు.. ఈలోపు మేము వస్తాము అని చెప్పగానే యాదగిరి సరే అంటాడు. మరోవైపు రవి ఇంటికి వస్తాడు.
అకి: నీ కోసమే ఇందాకటి నుంచి వెయిటింగ్ రవి..
రవి: ఎందుకు ..?
అకి: గుడికి వెళ్లాలి రవి..అమ్మ ఏదో పూజకు ఏర్పాట్లు చేయిస్తుందట. నువ్వు ముందు ప్రెష్ అయి రా..
రవి: పూజలు, పునష్కారాలు చేసేంత టైం లేదు. నువ్వు ముందు బయలుదేరి రా..?
అకి: ఏమంటున్నావు రవి.. ఎక్కడికి ..
రవి: మన ఇంటికి పండగ కూడా అయిపోయింది కదా..? ఇంకా ఇక్కడేం పని పద వెళ్దాం.
అభయ్: అదేంటి ఉన్నపళంగా తనను తీసుకెళ్తానంటావేంటి..? తను ఎక్కడికి రాదు ఇక్కడే ఉంటుంది.
రవి: అంటే నన్ను ఇల్లరికం అల్లుడిగా ఇక్కడే ఉండాలంటారా..?
అభయ్: వర్దన్ కుటుంబం ఇంటి అల్లుడి గౌరవం పెంచుతుంది కానీ తగ్గించదు.
అకి: అన్నయ్యా ప్లీజ్ మీరిద్దరూ ఆర్గూ చేసుకోకండి.. రవితో నేను మాట్లాడతాను. ఏంటి రవి సడెన్ గా ఇది.
రవి: సడెన్ గా కాదు.. ఎన్నో రోజులు చెప్తున్నాను కదా..?
అభయ్: మంచి రోజు చూసి పంపిస్తాను
రవి: ఇంకా మంచి రోజు ఏంటి..?
శంకర్: రవి.. కొద్దిరోజులు ఓపిక పట్టు
రవి: మీకేం ఓపికగా ఉండమంటారు. కానీ ఇక్కడ అవమానాలే.. పైకి కనిపించరు కానీ.. ఈ ఫార్మాలిటీస్ నాకేం అవసరం లేదు. రా అకి..
అంటూ చేయి పట్టుకుని లాక్కెల్లబోతుంటే.. తన రాదు అంటూ అభయ్ చేయి పట్టుకుంటాడు. ఇంతలో మాయ వచ్చి అభయ్ ఇంటి అల్లుడి మీదకు ఎందుకు కోపంగా చూస్తున్నావు అంటుంది. రవికి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అంటుంది. ఎవరేం చెప్పినా వినను.. ఇప్పుడు నాతో వస్తే తీసుకెళ్తా.. లేదంటే.. ఇక్కడే వదిలేసి వెళతా శాశ్వతంగా అంటాడు రవి. దీంతో అందరూ షాక్ అవుతారు. అకిని తీసుకుని రవి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న చిన్నొడు, పెద్దొడు బాధపడుతుంటారు. మనల్ని కాపాడాలని అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటారు. ఇంతలో శ్రావణి, సంధ్య వచ్చి వాళ్లిద్దరిని ఓదారుస్తారు. తమ ఇంటికి అకిని తీసుకెళ్లిన రవి మౌనంగా చూస్తుంటాడు.
అకి: ఇంకెంత సేపు మౌనంగా ఉంటావు రవి. మాట్లాడవేంటి రవి సమాధానం చెప్పు. అక్కడ అందరి ముందు మాట్లాడితే నీకే పరువు తక్కువ అని తీసుకొచ్చాను.
రవి: నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే అక్కడే ఉండిపోవాల్సింది ఎందుకు వచ్చావు.
అకి: దీనికి విలువిచ్చి నీ మాటకు విలవ ఇచ్చి వచ్చాను రవి. నేను వర్ధన్ కుటుంబ ఆడపిల్లను రవి. బంధాల విలువ నాకు తెలుసు. మా అమ్మ భర్త అనే స్థానానికి ఎంత విలువ, గౌరవం ఇచ్చేదో నాకు తెలుసు. నువ్వు ఇంటికి తీసుకురావడం కరెక్టు కాదు రవి. నీలో నేను ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడ్డానో ఆ క్వాలిటీస్ ఇప్పుడు నీలో కనిపించడం లేదు.
అంటూ అకి ఎమోషనల్ అవుతుంది. నన్ను ఎందుకు తీసుకొచ్చావో సమాధానం చెప్పు అంటూ నిలదీస్తుంది. ఇంతలో రవి కోపంగా అకిని కొట్టబోతుంటే.. యాదగిరి వచ్చి చేయి పట్టుకుంటాడు. కోపంగా రవిని కొట్టబోతుంటే.. అకి అడ్డుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















