Prema Entha Madhuram Serial Today Fabruary 13th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అభయ్, రవిల మధ్య గొడవ – వర్కర్స్ మీదకు రాళ్లు విసిరిన రాకేష్
Prema Entha Madhuram Today Episode: సమ్మె చేస్తున్న కార్మికుల మీదకు రాకేష్ రాళ్లు వేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: కంపెనీలో వర్కర్స్‌తో రవి గొడవ పెట్టుకున్నాడని తెలుసుకున్న అకి కంగారుగా రవికి ఫోన్ చేస్తుంది. ఏంటి రవి నువ్వు చేసిన పని నువ్వు ఫ్యాక్టరీకి వెళ్లినప్పుడే వర్కర్స్ తో కేర్‌ఫుల్ గా డీల్ చేయమని చెప్పాను కదా అంటుంది. దీంతో కోపంగా అకిని తిడతాడు.
రవి: ఏయ్ అసలు ఏంటి నీ ప్రాబ్లమ్..నువ్వు చెప్పినట్టు చేయడానికి నేనేం నీ సర్వెంట్‌ను కాదు. ఐ యామ్ యువర్ హస్బెండ్.. ఎండీ ఆఫ్ ది కంపెనీ.
అకి: ఆ పొజిషన్‌లో ఉన్నావు కాబట్టే వర్కర్స్ తో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కానీ వాళ్లతో గొడవ పెట్టుకుని స్ర్టైక్ జరిగేలా చేస్తావా..? ఇదేనా నువ్వు చేస్తున్న మేనేజ్‌మెంట్.
రవి: అకి యువర్ ఇన్‌సల్టింగ్ మీ..
అకి: ఇన్ సల్ట్ నీకు కాదు రవి. వర్దన్ ఫ్యామిలీకి. ఇలాంటిదేదో జరుగుతుందనే ఫ్రెండ్ హెల్ప్ తీసుకోమన్నాను. అందుకు కూడా నువ్వు నో చెప్పావు. ఇప్పుడు అన్నయ్య ఫ్యాక్టరీకి వస్తున్నారు. కనీసం అన్నయ్యతో నైనా గొడవ పడకు ఫ్లీజ్.
రవి: నేను ఇక్కడికి నువ్వు చెప్పినట్టో జెండే చెప్పినట్టో వినడానికి రాలేదు. అయినా వర్కర్స్ ను బతిమాలి పని చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పే క్లాసులు వినాల్సిన అవసరం అసలు లేదు. మీ అన్నయ్య వచ్చినా కూడా నేను కేర్ చేయను.
అంటూ ఫోన్ కట్ చేస్తాడు.
గౌరి: ఏమంటున్నాడు అకి..
అకి: రవి మొండిగానే మాట్లాడుతున్నాడు అమ్మా నేను చెప్పినా అసలు వినడం లేదు.
జెండే, రవి దగ్గరకు వెళ్తాడు..
జెండే: రవి జరిగిందేదో జరిగిపోయింది. వర్కర్స్ నేను మాట్లాడతాను. ఒకసారి నువ్వు వచ్చి వాళ్లకు సారీ చెప్పు.
రవి: వాట్ నేను నా కింద పనిచేసే వాళ్లకు సారీ చెప్పాలా..? ఏం మాట్లాడుతున్నారు. నెవర్ నేను సారీ చెప్పను.
జెండే: రవి వర్కర్స్‌ను తక్కువ చేసి మాట్లాడకు. మీ నాన్నగారు కూడా ఒక ఫ్యాక్టరీ వర్కరే అని మర్చిపోకు.
రవి: మా నాన్న వర్కరే కావొచ్చు కానీ నేను కాదు. నేను ఈ ఫ్యాక్టరీకి ఎండీని అని మీరు మర్చిపోవద్దు. సారీ చెప్పడానికి నేను ఏ తప్పు చేయలేదు.
జెండే: మేనేజ్‌మెంట్ వర్కర్స్ పట్ల దురుసుగా ప్రవర్తించడం తప్పు. వాళ్లు లేకపోతే ఫ్యాక్టరీలో ఏ వర్క్ జరగదు. ఈ స్ర్టైక్ వల్ల ఫ్యాక్టరీకి ఎంత లాసో నీకు అర్థం అవుతుందా..?
రవి: అయితే వర్కర్స్ అందరినీ తీసేసి కొత్తవాళ్లను పెట్టండి. భయంతో ఇంకొకసారి తప్పు చేయరు. అంతేకానీ సారీ చెప్పి బుజ్జగిస్తే వాళ్లు నెత్తికొకుతారు.
అని చెప్పి వెళ్లిపోతారు.
శంకర్ నారాయణ: రవి ఇంత మొండిగా మాట్లాడుతున్నాడేంటి సార్.
జెండే: పరిస్థితి చేయి దాటుతుంది నారాయణ గారు. శంకర్ తప్పా ఈ ప్రాబ్లమ్ ను ఎవ్వరూ సాల్వ్ చేయలేరు.
అని చెప్తాడు జెండే.. మరోవైపు ఇంట్లో శంకర్ చెస్ ఆడుతుంటాడు. ఇంతలో గౌరి వచ్చి శంకర్‌ను తిడుతుంది. సమస్య పెద్దది అవుతుంటే మీరు తీరిగ్గా ఆడుకోవడం ఏంటి…? అంటుంది. దీంతో శంకర్ గౌరిని మీకు గేమ్ రాదని చెప్పండి అంటాడు. అయితే మిమ్మల్ని ఓడిస్తాను చూడు అంటూ గౌరి కూడా చెస్ ఆడుతుంది. ఇంతలో జెండే ఫోన్ చేస్తాడు. ఫ్యాక్టరీలో జరుగుతున్న విషయం మొత్తం చెప్తాడు. ఇప్పుడేం గొడవ జరుగుతుందోనని నాకు భయంగా ఉంది నువ్వు వెంటనే రావాలని చెప్తాడు. దీంతో నేను ఇక్కడే పావులు కదుపుతున్నాను అని మీరు జరిగేది చూస్తూ ఉండండి నేను ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెడతాను అంటాడు. జెండే ఓకే అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు ఫ్యాక్టరీకి వెళ్లిన అభయ్‌కి రవికి మధ్య గొడవ జరగుతుంది. అక్కడే ఉన్న మాయ రాకేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్తుంది. దీంతో రాకేష్ వెళ్లి బయటి నుంచి వర్కర్స్ మీదకు రాళ్లు విసురుతాడు. దీంతో రవి కావాలని రాళ్లు వేయించాడని వర్కర్స్ మరింత రెచ్చిపోయి రవి మీదకు దూసుకువస్తుంటారు. వాళ్లను అభయ్ అపుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















