అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 22nd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గౌరితో శంకర్ కు రాఖీ కట్టించాలనుకున్న బాబాయ్ – జెండేపై అభయ్ కి కోపం వచ్చేలా చేసిన రాకేష్

Prema Entha Madhuram Today Episode: గౌరితో శంకర్ కు రాఖీ కట్టించేందుకు గౌరి వాళ్ల బాబాయ్ ప్రయత్నించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: గౌరి వాళ్ల బాబాయ్‌  వచ్చి ఎక్కడికి పారిపోతున్నారని ఇవాళ రాఖీ పండుగ మా అమ్మాయిలు మీకు రాఖీలు కడతామన్నందుకే నీ తమ్ముళ్లు ఎగ్జామ్స్‌ పేరుతో పారిపోతున్నారు అని చెప్పడంతో శంకర్‌ అదేం లేదని రాఖీ కట్టుకున్న తర్వాతే వెళ్తామని పిలవండి మీ అమ్మాయిల్ని.. కట్టిపడేస్తాం తాళి.. అని శంకర్‌ అనగానే బాబాయ్‌ షాక్‌ అవుతాడు. అదే రాఖీ కట్టుకుంటాం అని చెప్పగానే శంకర్‌ తమ్ముళ్లు ఇద్దరు చేతులు కడుకున్ని వస్తామని లోపలికి వెళ్తారు. బాబాయ్‌ కూడా లోపలికి వెళ్లి గౌరి వాళ్లను పిలుస్తాడు. శ్రావణి ఒక్కతే వస్తుంది.

బాబాయ్‌: నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా.. అక్కా సంధ్య ఎక్కడ?

శ్రావణి: అది వాళ్లు రెడీ అవుతామని చెరో గదిలో చేరారు. ఇంతవరకు రాలేదు.

బాబాయ్‌: ఆ అబ్బాయిలకు మీరు రాఖీ కడతారని ముందే తెలిసినట్టుంది అమ్మ.. అందుకే పరీక్ష పేరు చెప్పి పారిపోదామనుకున్నారు.  నేను గేటు దగ్గరే నిలిపేసి వచ్చాను. ఇదిగో ఈ రాఖీలు తీసుకుని అక్కను సంధ్యను తీసుకుని వచ్చేయ్‌.

శ్రావణి: సరే బాబాయ్‌ నువ్వొక పని చేయ్‌. నువ్వు బయటే ఉండి వాళ్లను వెళ్లకుండా ఆపు.

 అని చెప్పి శ్రావణి లోపలికి వెళ్తుంది. మరోవైపు లోపలికి వెళ్లిన చిన్నోడు, పెద్దోడు యాదగిరికి ఫోన్‌ చేసి రాఖీ కట్టిస్తున్నాడు  నువ్వు త్వరగా రా అంటూ చెప్పగానే యాదగిరి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్తాడు. ఇంతలో చిన్నోడు, పెద్దోడు కిందకు వస్తారు. ఇంతలో అకి వస్తుంది. గౌరి వాళ్ల బాబాయ్‌ బయటకు వచ్చి రాఖీలు కట్టమని చెప్తాడు. అకి రాఖీలు కట్టడమేంటని అరుస్తుంది. ఇంతలో గౌరి బయటకు వచ్చి మొగుడు పెళ్లాళ్ల నటించి రాఖీలు కట్టడమేంటో కర్మ అనుకుంటుంది.

అకి: అమ్మా.. డాడీకి రాఖీ కట్టడమేంటి మామయ్యా..?

యాదగిరి: నువ్వుండమ్మా నేను ఏదో ఒకటి చేస్తానుగా..  శంకర్‌ సార్‌ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే..

శంకర్‌: బాబాయ్‌ నువ్వు ఆగు బాబాయ్‌. ఈ పంచాయతీ ఎంటో ఇక్కడ తేలిపోవాల్సిందే..

యాదగిరి: నీ తెల్ల చొక్కా మీద  కాకి రెట్ట వేయ.. ఇక్కడ వరుసలు మారిపోతున్నాయంటే నువ్వు వరుసగా నిలబడమంటావేంటయ్యా..

అకి: మామయ్యా లాభం లేదు. ఆయన్ని అలా పక్కకు తీసుకుని రా..

యాదగిరి: వద్దమ్మా రివాల్వర్‌కు లైసెన్స్‌ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్లను చంపకూడదు.

అకి: అది కాదు మామయ్యా అసలు విషయం చెప్పంది వర్కవుట్‌ కాదు. అందుకే అంటున్నా..

 అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. యాదగిరి, గౌరి బాబాయ్‌ని.. శంకర్‌‌ ను పక్కకు తీసుకెళ్తాడు. అకి కూడా గౌరిని తీసుకెళ్తుంది. అక్కడ బాబాయ్‌కి తామిద్దరు భార్యభర్తల్లా నటించామని చెప్తారు. చెల్లెల్లా చదువు కోసం తప్పలేదని గౌరి చెప్తుంది. దీంతో శంకర్‌, గౌరిని, గౌరి, శంకర్‌ ను వెనకేసుకొస్తారు.  దీంతో బాబాయ్‌ ఇద్దరినీ మెచ్చుకుంటాడు. రాఖీ ఫ్రోగ్రాం క్యాన్సిల్ చేస్తాడు బాబాయ్‌. అకి ఊపిరి పీల్చుకుంటుంది. మరోవైపు అకిని ఫాలో అయిన రౌడీలు రాకేష్‌ ఫోన్‌ చేసి... తను ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. తాను తెలివిగా ఎస్కేప్‌ అయ్యిందని చెప్తారు. ఇంతలో అభయ్‌ కిందకు వస్తుంటే.. ఫోన్‌ మట్లాడినట్లు నటిస్తాడు.

అభయ్‌: ఏమైంది రాకేష్‌..ఎవరితోనో చాలా కోపంగా మాట్లాడుతున్నావు.

రాకేష్‌: ఏం లేదులే అభయ్‌. నువ్వుదో యాప్‌ డెవలప్‌ చేసే ప్లాన్‌ లో ఉన్నావు  కదా.. అది త్వరగా ఫినిష్‌ చేయ్‌.

అభయ్‌: నువ్వేదో మాట మారుస్తున్నావని నాకు అర్థం అయ్యింది. అదేంటో చెప్పు

రాకేష్‌: ఐ కాంట్‌ టెల్‌‌య అభయ్‌.

జెండే: ఎందుకు అభయ్‌ కి కూడా చెప్పలేనంత రహస్యం మెయింటెన్‌ చేస్తున్నావా? అడుగుతున్నప్పుడు చెప్పొచ్చు కదా?

రాకేష్‌: ఆ విషయం వింటే అభయ్‌ హర్ట్‌ అవుతాడు అంకుల్‌

జెండే: ఈ రాకేష్‌ ఏదో అభయ్‌ తో మైండ్‌ గేమ్‌ ఆడబోతున్నాడు. ( అని మనసులో అనుకుంటాడు)

అభయ్‌: రాకేష్‌ చెప్తావా? చెప్పవా?

 అని గట్టిగా అడగ్గానే నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోకపోవడంతో అందరూ నిన్ను తక్కువగా అనుమానిస్తున్నారు. నీకు జెండే అంకుల్‌ రెస్పెక్ట్‌ ఇవ్వడం లేదనుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే నువ్వు అకి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. అని చెప్పగానే అది డిసైడ్‌ చేయడానికి నువ్వెవరు రాకేష్‌ అంటూ అకి వస్తుంది. మరోవైపు బెస్ట్ కఫుల్‌ అవార్డులో వచ్చిన అమౌంట్‌ ఇంకా ఇవ్వలేదని లెక్కలేస్తుంది గౌరి. శ్రావణి అడగ్గానే మాటా మారుస్తుంది గౌరి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అప్పుడు బూత్... ఇప్పుడు డీమాంటీ కాలనీ - రామ్ గోపాల్ వర్మ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata Passed Away | తుదిశ్వాస విడిచిన గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా | ABP Desamకశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
Ratan Tata Health News: ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Embed widget