అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 14th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: తెలివిగా రౌడీలను పట్టించిన శంకర్‌ - డిప్రెషన్‌లో పడిపోయిన రాకేష్‌

Prema Entha Madhuram Today Episode: ఫంకన్ చెడగొట్టడానికి వచ్చిన రాకేష్ కిరాయి మనుషులను శంకర్ తెలివిగా పట్టించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  అకి స్టేజి మీదకు వచ్చి తన అభిప్రాయాలు చెప్తుంది. తన అమ్మానాన్నాలను (ఆర్యవర్థన్‌, అను) గుర్తు చేసుకుంటుంది. రూంలో ఉన్న గౌరి, శంకర్‌ లు అకి మాటలు వింటూ ఎమోషనల్‌ అవుతుంటారు. పెళ్లి గురించి.. భార్యాభర్తల అనుబంధం గురించి మాట్లాడుతుంది. దీంతో అక్కడికి వచ్చిన వాళ్లంతా అకి స్పీచ్‌కు ఎమోషనల్‌ గా ఫీలవుతారు. తర్వాత చాలా బాగా మాట్లాడావని జెండే మెచ్చుకుంటాడు. పెద్దోడు, చిన్నోడు శ్రావణి, సంధ్య కూడా అకి స్పీచ్‌ కు ముగ్ధులైపోతారు. తర్వాత జెండేకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లిపోతాడు. రాకేష్‌, తన మనిషికి ఫోన్‌ చేసి పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు. మన వాళ్లందరూ ఫంక్షన్‌ హాల్‌లోకి వచ్చారని మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు డిస్టర్బ్‌ చేస్తారని చెప్తాడు. తర్వాత ఫంక్షన్‌ హాల్‌లో రౌడీలందరూ వచ్చి కూర్చుంటారు. గణేష్‌ వచ్చి ఇక్కడ కాసేపట్లో గొడవ జరగబోతుందట సార్‌ అని జెండేకు చెప్తారు.

గణేష్‌: వెంటనే అందర్నీ ఖాలీ చేయిద్దాం సార్‌.

జెండే: అలా చేస్తే వెంటనే గొడవ స్టార్ట్‌ చేస్తారు. పైగా ఇది ఆకాంక్షకి చాలా ఇంపార్టెంట్‌ ఈవెంట్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవెంట్‌ జరిగి తీరాలి.

గణేష్‌: మరి ఎలా సార్‌.

జెండే: ముందు వీళ్లలో ఎవరెవరు అనుమానంగా ఉన్నారో చూడండి. ఆ తర్వాత ఏం చేయాలో  నేను చెప్తాను.

యాదగిరి: ఏంటి సార్‌ ఇది అకి పాప తన అమ్మా నాన్నలను కళ్లారా చూడబోతుంది. మనం ఆ క్షణాల కోసం ఎదురుచూస్తుంటే ఈ గొడవేంటి సార్‌.

జెండే: ఇదంతా ఆ జలంధర్‌ గాడి కొడుకే చేయిస్తుంటాడు యాదగిరి. వినాశకాలే విపరీత బుద్ది. వాడికి బుద్ది చెప్పే టైం దగ్గర పడింది. నువ్వేం కంగారు పడకు ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు గౌరి, శంకర్‌ లను జాగ్రత్తగా చూసుకో..

  అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో యాదగిరి భార్య వచ్చి వాళ్లు వెళ్లడం లేదు. అక్కడేమో అన్నయ్య వదిన రాలేమని భీష్మించుకు కూర్చున్నారు అని చెప్తుంది. అయితే ఏదో ఒకటి చేద్దామని శంకర్‌ దగ్గరకు వెళ్తారు.  మీరేం చేయలేరని నేనే ఒక ప్లాన్‌ చేప్తాను మీరు ఫాలో అవ్వండి అని చెప్పి.. తన తమ్ముళ్లకు ఫోన్‌ చేస్తాడు. అలాగే గౌరి కూడా తన చెల్లెళ్లకు ఫోన్‌ చేస్తుంది. ఇద్దరూ ఎక్కడున్నారు అని అడిగితే బయట ఉన్నామని చెప్తారు. అయితే వెంటనే ఇంటికి వెళ్లండి అక్కడ ఇంపార్టెంట్‌ పార్శిల్‌ వచ్చిందని చెప్పగానే సరే అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసి తిరిగి చూసే సరికి శ్రావణికి శంకర్‌, పెద్దోడికి గౌరి కనిపిస్తారు. యాదగిరి ఆయన భార్య వెళ్లి మేనేజ్‌ చేస్తారు. తర్వాత అందరూ ఫంక్షన్‌ హాల్‌ నుంచి వెళ్లిపోతారు. తర్వాత కపుల్స్‌ ఒక్కొక్కరిని స్టేజీ మీదకు పిలిచి అకి మాట్లాడుతుంది. ఫైనల్‌ టాస్క్‌ గురించి రెండు ప్రశ్నలు అడుగుతుంది.

యాదగిరి: సర్‌ తమ్ముళ్లు, చెల్లెల్లు వెళ్లిపోయారు. ఆ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయ్యింది.

జెండే: వెరీ గుడ్‌ యాదగిరి.

యాదగిరి: మరీ రౌడీలు ఎవరో తెలిసిందా? సార్‌.

జెండే: తెలియడం లేదు యాదగిరి. ఎవర్నీ అనుమానించినా ప్రాబ్లమ్‌ గానే అనిపిస్తుంది.

యాదగిరి: ఒక పని చేద్దాం సార్‌ స్టేజీ మీదకు సార్‌ ను మేడంను లేటుగా రమ్మందాం. ఈలోపు ప్రాబ్లమ్‌ ను మనం సాల్వ్‌ చేద్దాం

   అని యాదగిరి చెప్పగానే జెండే ఓకే అంటాడు. మరోవైపు తమ తమ్ముళ్లు, చెల్లెల్లు తమను చూసినట్లు తెలుసుకుని టెన్షన్‌ పడుతుంటారు. ఇంతలో జెండే వచ్చి ఫంక్షన్‌ లో గొడవ చేయడానికి ప్లాన్‌ చేసినట్లు తెలిసిందని చెప్పగానే శంకర్‌ వాడెవడో తనకు తెలిసిందని.. మేనేజర్‌ను పట్టిస్తాడు శంకర్‌. దీంతో జెండే, శంకర్‌, యాదగిరి కలిసి మేనేజర్‌ను పట్టుకుని కొట్టి రౌడీలను బయటకు పిలిస్తాడు. మరోవైపు రాకేష్‌ తన గురించి తెలిసపోయిందా? అని భయపడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బంటి రూంలోకి షిప్టైన అప్పు కాపురం – కావ్యను ఇంట్లోంచి గెంటివేసేందుకు రుద్రాణి ప్లాన్

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 8th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
Nindu Manasulu Serial Today July 8th: నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
Podarillu Serial Today July 8th Episode: ఇదిగో తాళి, చక్రి నా భర్త, వరాలుకి ఇచ్చి పడేసిన మహాలక్ష్మి - పొదరిల్లు జూలై 08 ఎపిసోడ్!
పొదరిల్లు జూలై 08 ఎపిసోడ్: ఇదిగో తాళి, చక్రి నా భర్త, వరాలుకి ఇచ్చి పడేసిన మహాలక్ష్మి
Gundeninda Gudigantalu July 08 Episode: బాలు త్యాగం, బుద్ధి చూపించిన రోహిణి, మనోజ్ కి చూపు వస్తుందా? గుండెనిండా గుడిగంటలు జూలై 08 ఎపిసోడ్!
గుండెనిండా గుడిగంటలు జూలై 08 ఎపిసోడ్: బాలు త్యాగం, బుద్ధి చూపించిన రోహిణి, మనోజ్ కి చూపు వస్తుందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget