అన్వేషించండి

Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బంటి రూంలోకి షిప్టైన అప్పు కాపురం – కావ్యను ఇంట్లోంచి గెంటివేసేందుకు రుద్రాణి ప్లాన్

Brahmamudi Today Episode: కావ్యను, అప్పును ఒకేసారి ఇంట్లోంచి గెంటివేసేందుకు రుద్రాణి ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఫ్రెండ్స్‌ రూం నుంచి బయటకు వచ్చిన కళ్యాణ్‌, అప్పు గుడిలో కూర్చుని ప్రసాదం తింటుంటారు. ఒకరినొకరు ఓదార్చుకుంటారు.  నీకు క‌ష్టం రాకుండా చూసుకోవ‌డానికి నేనే ఏదో ఒక‌టి చేయాల‌ని అప్పు అంటుంది. అయితే నేను నీ భ‌ర్త‌ను ఆ మాట చెప్పాల్సింది నేను అంటాడు క‌ళ్యాణ్. నువ్వు నా భ‌ర్త‌...నేను నీ భార్య ఈ పిలుపు కొత్త‌గా ఉంద‌ని చెబుతుంది. అప్పు.  మరోవైపు బంటితో క‌లిసి అప్పు, క‌ళ్యాణ్‌ల‌ను వెతుక్కుంటూ గుడి దగ్గరకు వ‌స్తుంది కావ్య.

కావ్య: ఒరే బంటి నువ్వు వెళ్లి నీ రూంలో ఒక్కడినే ఉంటున్నానని చెప్పి అప్పు, కళ్యాణ్‌ లను ఒప్పించి నీ రూంకి తీసుకెళ్లు..

బంటి: సరే అక్కా..

అప్పు: బంటి ఎలా ఉన్నావు.

బంటి: నేను బాగానే ఉన్నాను అక్క.. కానీ మీరే అక్కా నేను నా రూంలో ఒక్కడినే ఉంటాను మీరు వచ్చి నా రూంలో ఉండొచ్చు అక్కా…

 అని బంటి తన మాటలతో అప్పు, కళ్యాణ్‌ను కన్వీన్స్‌ చేస్తాడు. దీంతో అప్పు కళ్యాణ్‌.. బంటి రూంకు వెళ్తారు. దేవుడి ముందు నిలబడి కావ్య బాధపడుతుంది. ఇలాగైనా కళ్యాణ్‌ ప్రయోజకుడు కావాలనే నేను ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదని వాళ్లిద్దరిని చల్లగా చూడమని దేవుడిని వేడుకుంటుంది కావ్య. మరోవైపు ధాన్యలక్ష్మీ బాధపడుతుంటే రుద్రాణి ఓదార్చినట్లు నటిస్తూ గొడవ పెద్దది చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది.

రుద్రాణి: ధాన్యలక్ష్మీ  నీకు నీ కొడుకు కావాలంటే ముందు నువ్వు అప్పును కోడ‌లిగా ఒప్పుకున్న‌ట్లుగా అంద‌రి ముందు నటించు. అప్పుడు నీ కొడుకు తిరిగి వస్తాడు.  ఆ త‌ర్వాత అప్పును ఇంట్లోంచి గెంటేద్దాం.

ధాన్యలక్ష్మీ: అవును రుద్రాణి నీ  ఐడియా బాగుంది. క‌ళ్యాణ్, అప్పు ఇంటికి రావ‌డం నాకు ఇష్ట‌మేన‌ని.. కళ్యాణ్‌ కోసం అప్పును కోడలిగా ఒప్పుకుంటానని ఇప్పుడే అంద‌రికి చెబుతాను.

 అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. అంతా గమనిస్తున్న రాహుల్‌

రాహుల్‌: మామ్‌ నీకు పిచ్చి పట్టిందా? అసలు నువ్వు  కళ్యాణ్‌ ఇంటికి వచ్చే ఐడియా చెప్పడం ఏంటి?

 అని అడగడంతో ఇప్పుడు కళ్యాణ్‌, అప్పులు ఇంటికి రావడం కావ్య ఒప్పుకోదు.  అందరి ముందు కావ్యను విలన్‌ ను చేసి ఇంటి నుంచి గెంటివేద్దాం అందుకే ఈ ప్లాన్‌ అని రుద్రాణి చెప్తుంది. తర్వాత ధాన్యలక్ష్మీ మాటలు విని అంతా షాక్‌ అవుతారు.

ప్రకాష్‌:  రాత్రి లేని ఆలోచ‌న ఇప్పుడు స‌డెన్‌గా ఎలా వ‌చ్చింది.

స్వప్న: ఏదైనా దెయ్యం కనిపించి  మీకు సలహా ఇచ్చిందా? ( రుద్రాణిని చూపిస్తూ) మీ అంత‌ట మీరుగా ఈ నిర్ణ‌యం తీసుకోలేదనిపిస్తుంది.

కావ్య: ప్రాణం పోయిన అప్పు ఇంట్లో అడుగుపెట్ట‌డానికి ఒప్పుకోని మీరు స‌డెన్‌గా మాట ఎలా మార్చారు..?

రుద్రాణి: క‌ళ్యాణ్ తిరిగి రావ‌డం మీ అక్క చెల్లెళ్ల‌కు సంతోషంగా లేన‌ట్లు ఉంది. క‌ళ్యాణ్ ఆస్తిని మీరు అనుభ‌వించాల‌ని అనుకుంటున్నారా?

రాజ్: క‌ళ్యాణ్‌ను తిరిగి ఇంటికి తీసుకురావ‌డానికి నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా అని ఎదురుచూస్తున్నాను పిన్ని. ఇప్పుడే వెళ్లి కళ్యాణ్‌, అప్పులను ఇంటికి తీసుకొద్దాం పద

 అని రాజ్‌, కావ్యను అడగ్గానే తాను రానంటుంది. అయితే కళ్యాణ్‌ సంతోసం కోసం ఎన్నో చేసిన నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఇందిరాదేవి అడుగుతుంది. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేనని ఇది చిన్నత్తయ్య తీసుకున్న నిర్ణయం ఇందులో నేను జోక్యం చేసుకోలేనని కావ్య ఇందిరాదేవికి బదులిస్తుంది. తర్వాత రాజ్‌ ఒక్కడే వెళ్లి బంటి రూంలో ఉన్న కళ్యాణ్‌, అప్పులను చూసి ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని పిన్ని చెప్పిందని ఇంటికి వెళ్దాం పదండి అని రాజ్‌ చెప్పగానే కళ్యాన్‌ రాలేమని చెప్పడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget