అన్వేషించండి

Podharillu Serial Today May 11th: తండ్రిపైనే గెలిచిన మహాలక్ష్మీ..ఆది కూతురుని ఎవరు కిడ్నాప్ చేశారు..?

Podharillu Serial Today Episode May 11th: తండ్రిపైనే గెలిచిన మహాలక్ష్మీ..ఆది కూతురుని ఎవరు కిడ్నాప్ చేశారు..? ఏదో సరదాగా ఆడుకున్న ఆటని... ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదంటాడు.

Podharillu Serial Today Episode: రిసార్ట్‌ నుంచి  చక్రి, మహాలక్ష్మీ కుటుంబాన్ని పంపించేందుకు ఆది ఓ మంచి పథకం వేస్తాడు. మనం వాళ్లతో తాడు ఆట ఆడదామని... ఓడిపోయిన వాళ్లు రిసార్ట్‌ వదిలిపెట్టి వెళ్లాలనే కండిషన్ పెడదామని  చెబుతాడు. ఛీ వాళ్లతో ఆటలేంటని ప్రతాప్‌ అంటాడు. లేకపోతే వాళ్లను ఇక్కడే చూస్తూ మనం ప్రశాంతంగా ఉండలేమని....వాళ్లకోసం మనం రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లిపోవడం ఏంటని ఆది అంటాడు. అయితే సరేనని ప్రతాప్‌ అంటాడు. తాడు  ఆడుతున్న చక్రి వద్దకు వెళ్లి తాడు పట్టుకుంటాడు. దీంతో బావాబావమరుదులు తాడు చెరోవైపు లాగుతుండగా...కేశవ్‌ రాగానే ప్రతాప్‌ కూడా వచ్చి తాడుపట్టుకుంటాడు. అయితే పందెం ఉంటేనే ఆడదామని ఆది ప్రతిపాదన చేస్తాడు. మీరు ఓడిపోతే రీసార్ట్ వదిలిపెట్టి వెళ్లిపోవాలని అంటాడు. మీరు ఓడిపోయినా అదే పని చేయాలని చక్రి చెప్పడంతో....ఆది ఓకే అంటాడు. తండ్రితోపాటు తల్లికూడా రంగంలోకి దిగేసరికి మహాలక్ష్మీ కూడా  వచ్చి తాడు ఆట ఆడుతుంది.రెండు కుటుంబాలు పోటాపోటీగా తాడు  ఆట ఆడుతుండగా....మహాలక్ష్మీ వాళ్లు గెలుస్తారు.తాడు గట్టిగా లాగేసరికి ప్రతాప్ కిందపడిపోతాడు.దీంతో నాన్న అంటూ మహాలక్ష్మీ దగ్గరకు రాగా....ప్రతాప్‌ వద్దని  వారించి లేచి వెళ్లిపోతాడు. దీంతో చక్రి...ఆదిని ఉడికిస్తాడు.ఓడిపోయిన వాళ్లు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లిపోవాలని గుర్తుచేస్తాడు.దీంతో మాధవ్‌ కలుగుజేసుకుని ఇదంతా ఏదో సరదాగా ఆడుకున్న ఆటని...ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదని చెబుతాడు. అయినా సరే ఆది కోపంగా  అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

                              ఆటలో గెలిచిన తర్వాత కూడా మహాలక్ష్మీ దిగాలుగా  కూర్చుని బాధపడుతుండగా...కన్నా వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఎప్పుడూ మానాన్న గెలవడమే చూశానని....ఇప‌్పుడు  ఓడిపోవడం చూసి బాధ కలగుతోందని అంటుంది.మనం  గెలిచినందుకు ఆనందపడాలో...మానాన్న ఓడిపోయినందుకు బాధపడాలో తెలియడం లేదంటుంది. నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు వదినా అంటూ చెప్పి వెళ్లిపోతాడు. ప్రతాప్‌ వాళ్లు రిసార్ట్‌ వదిలి వెళ్లిపోతుండగా..మహా ఎదురుపడుతుంది. ఎక్కడికి వెళ్లినా నన్ను బాధపెట్టడానికి ఇలా ఎదురువస్తూనే ఉంటుందా అని ప్రతాప్ చిరాకుపడతాడు.ఒకప్పుడు తాను ఎదురువస్తేనే బయటకు వెళ్లే తండ్రి...ఇప్పుడు తాను ఎదురుపడితే చిరాకుపడటం చూసి మహా చాలా బాధపడుతుంది. ఇంతలో లలిత అక్కడికి వచ్చి...నువ్వు చేసిన పనికి తల ఎత్తుకోలేక మీనాన్న ఇంటినుంచి భయటకు వెళ్లడమే మానేసి....ఇంట్లోనే ఉండి బాధపడుతున్నారని అంటుంది. ఆయనకు ఆ బాధ తొలగించి మనసు కుదుటపడేలా చేద్దామంటే...నువ్వు ఇక్కడికీ దాపురించి మరింత బాధపెడుతున్నావా అని మండిపడుతుంది.
                    ఆది కూతురుని తీసుకుని బయటకు వచ్చి ఫోన్‌లో మాట్లాడుతుండగా...మహాలక్ష్మీ సిరిపాపతో మాట్లాడుతుంది. వాళ్ల అన్నయ్య చూస్తే గొడవ చేస్తాడని ఆ చిన్నారిని అక్కడి వదిలేసి బాధగా రూమ్‌కు వెళ్తుంది. వదిన బాధ చూసిన కన్నా...సిరిపాప దగ్గరకు వెళ్లి మహాదగ్గరకు వెళ్దామా అంటూ ఆ చిన్నారిని ఎత్తుకుని వెళ్తాడు. మహారూమ్‌ ముందు వదిలిపెట్టి వెళ్లిపోతాడు. సిరి మహారూమ్‌లోకి వెళ్లిపోతుంది. పాప కనిపించకపోయేసరికి కంగారుపడిన  ఆది రిసార్ట్‌ మొత్తం వెతుకుతుంటాడు. ఇంతలో చక్రి వాళ్లు ఎదురుపడేసరికి వాళ్లతో గొడవపడతాడు. మీరే మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని అంటాడు. దీంతో కేశవ్‌,చక్రి ఇద్దరూ ఆదితో గొడవపడతారు.మీ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు ఏముందని నిలదీస్తారు.మీనాన్నను కత్తితో పొడిచానని మీరే మా అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఉంటారని అంటాడు. దీంతో మాధవ్‌ కల్పించుకుని మేం  అలాంటి పనులు చేయమని చెబుతాడు.ముందు పాపన వెతుకుదాం పదండని అంటాడు. దీంతో అందరూ కలిసి సిరిని వెతుకుతుంటారు. ప్రతాప్ వచ్చి సీసీ కెమెరాలో చూద్దామని చెబుతాడు. సీసీ కెమెరాల్లో చూడగా....కన్నా పాపను ఎత్తుకుని వెళ్లడం కనిపిస్తుంది. ఖచ్చితంగా  పాప వాళ్ల రూమ్‌లోనే ఉంటుందని అందరూ అక్కడికి వెళ్తారు.మళ్లీ అక్కడ చక్రి,ఆది కొట్టుకుంటారు. ఈ గొడవ చూసి మహా బయటకు వస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన కన్నాపై ప్రతాప్ చేయిలేపడంతో వచ్చి అడ్డుకుంటుంది. ఎవరిమీదపడితే వాళ్లమీదకు చేయిలేపితే చెంపపగులుతుందని వార్నింగ్ ఇస్తుంది. సిరిపాప నా దగ్గరే ఉందని..మీరు నన్ను కలవనివ్వకపోవడంతో కన్నా తీసుకొచ్చి నాకు ఇచ్చాడని చెప్పి గట్టిగా అందరికీ క్లాస్‌ పీకుతుంది. దీంతో అందరూ ఎటువాళ్లు అటు వెళ్లిపోతారు.చక్రి వాళ్లు కూడా ఇంటికి వెళ్లిపోతారు.అయితే అప్పుడే మహా సర్టిఫికేట్లు వచ్చాయని...రేపు వచ్చి తీసుకోమని చక్రికి ఫోన్ రావడంతో అందరూ సంతోషపడతారు.

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget