అన్వేషించండి

Podharillu Serial Today March 23th: చక్రి, మహా పెళ్లి నిజం కాదని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఏంటి..? నిహారికపై మహా ఎందుకు కోప్పడింది..?

Podharillu Serial Today Episode March 23th: చక్రి, మహా పెళ్లి నిజం కాదని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఏంటి..? నిహారికపై మహా ఎందుకు కోప్పడింది..?

Podharillu Serial Today Episode: మహా,చక్రి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు లాయర్‌ చెప్పడంతో కోపంతో ఇంటికి వచ్చిన కేశవ్‌...చక్రిని పట్టుకుని నిలదీస్తాడు. నీ అబద్ధాల వల్లే ఇదంతా జరిగిందని మండిపడతాడు. మహాకు ఎవరూ లేరనుకుంటున్నావే నేను ఉన్నానని...నేను తనకు మరిదిని కానని కోడుకునని చెప్పి చక్రి చొక్కాపట్టుకుని నిలదీస్తాడు. ఆ మాటలకు చక్రి, మాధవ్‌ నిశ్చేష్టులైపోతారు. అంతలో మహా కలుగజేసుకని నిజం నేను చెబుతానని అంటుంది. ఇందులోచక్రి తప్పేమిలేదని చెబుుతుంది. నాకు, చక్రికి మధ్య అబద్ధపు  పెళ్లి జరిగిందని దానిని రద్దు చేయించుకోవాడనికే ఈ విడాకులని చెప్పడంతో కేశవ్‌తోపాటు కన్నా షాక్‌ తింటారు. చక్రిని నిజంగా నేను ప్రేమించి పెళ్లిచేసుకోలేదని...మా ఇంట్లో నాకు ఇష్టంలేని పెళ్లిచేస్తుంటే పారిపోవడానికి చక్రి హెల్ప్‌ చేశాడని చెబుతుంది. ఆ క్రమంలో పోలీసుస్టేషన్‌కు వెళ్తే...తప్పనిసరి పరిస్థితుల్లో  పెళ్లి చేసుకోవాల్సి  వచ్చిందని చెబుతుంది. ఈ నిజం మీకు చెప్పలేక, నాతో కలిసి ఉండలేక చక్రి చాలా  ఇబ్బందులు  ఎదుర్కొన్నాడని అంటుంది.ఇందులో చక్రి తప్పేమీ లేదని అంటుంది.
   
వదిన అంటే  చెప్పలేకపోయింది...నవ్వు ఎందుకు అబద్ధం చెప్పావురా అబద్దాలకోరు అంటూ చక్రిని కేశవ్ నిలదీస్తాడు.మీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు ఎందుకు నాటకం ఆడావని అంటాడు. దీంతో చక్రికి కోపం వస్తుంది. అందరికీ నేను అబద్ధాలు చెబుతున్నాని కోపం  వస్తుంది గానీ....నా అబద్ధాల వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా అని నిలదీస్తాడు. పెళ్లిళ్లే కావు అంటూ ఊరంతా శాపంగా మాట్లాడుకుంటున్న ఈ ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చి అందరి నోళ్లు మూయించానని....పాడుబడిన ఈ ఇంటిలో ఓదీపం వెలిగించే దేవతను తీసుకొచ్చానని అంటాడు. ఇందులో నేను నష్టపోయిందే తప్ప...ఎవరికీ ఎలాంటి నష్టం చేయలేదని అంటాడు.
 
మహా వెళ్లే వరకు అయినా మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకున్నానని అది తప్పా అంటూ కోప్పడతాడు. ప్రతిఒక్కరూ నన్ను  అనేవాళ్లే తప్ప....నా బాధ అర్థం చేసుకునే వాళ్లు ఒక్కరూ కూడాలేరని మండిపడి బయటకు వెళ్లిపోతాడు. మాధవ్ కలుగజేసుకుని వాళ్లిద్దరూ పెళ్లిచేసుకుని వచ్చిన రోజే....మహా వాళ్ల నాన్నకు సీరియస్‌గా ఉందని ఊరు వెళ్లడంతో అందరూ విమర్శిస్తుంటే...వాళ్ల నోళ్లు మూయించడానికే మనం అంత ఖర్చుపెట్టి రిసెప్షన్ ఏర్పాటు చేశామని అంటాడు. ఆ రోజే మహానాకు నిజం చెప్పిందని అప్పటి నుంచి ఈ నిజాన్ని దాచిపెట్టలేక నేను సతమతమవుతున్నానని అంటాడు. ఇప్పటికైనా నీ ప్రశ్నలకు జవాబులు దొరికి ఉంటాయి కదా అని అంటాడు.అందుకే చక్రిని మహా రూమ్‌లో పడుకోవద్దని చెప్పానని...ఇంట్లో పెళ్లి ఫొటోలు కూడా వద్దని చెప్పింది అందుకేనని అంటాడు. 
 
ఈ మాటలు విన్న తర్వాత మహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మాధవ్‌ కూడా ఇంటి ముందుకు వెళ్లిపోతాడు. నారాయణ ఈ పెళ్లి ఉత్తుత్తి పెళ్లి అని తెలిసి  చాలా బాధపడుతుంటాడు.ఇక కన్నా ఏడుస్తున్నవాడు ఏడ్చినట్లే ఉంటాడు. మాధవ్‌కూడా చాలా బాధపడుతుంటగా...అక్కడికి వచ్చిన కేశవ్‌ వాళ్ల అన్నయ్య కాళ్లుపట్టుకుని క్షమించమని కోరతాడు. నువ్వు చేస్తున్న పని అర్థం చేసుకోలేక నిన్ను అనరాని మాటలు అన్నానని బాధపడతాడు. నేను చేసిన పని క్షమించరానిదని అంటాడు.ఈ మాటాలన్నీ అక్కడే ఉండి విన్న  మహాలక్ష్మీ కూడా చాలా బాధపడుతుంది. వాళ్ల అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, ఒకరంటే ఒకరికి ఉన్న గౌరవం చూస్తుంది. తనవల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయని మరింత తలుచుకుని కుమిలిపోతుంది. లోపలికి వెళ్లి కన్నాను పలకరించేందుకు ప్రయత్నించగా....అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.దీంతో మహా మరింత బాధపడి ఏడుస్తుంది. ఇంత మంచి కుటుంబంలో తనవల్లే ఇబ్బందులు తలెత్తాయని ఏడుస్తుంది.
 
మహాకు నిహారిక ఫోన్ చేసి తన ఫ్రెండ్ హైదరాబాద్‌లోనే ఉందని....తన సింగిల్‌గా డబుల్‌బెడ్‌రూమ్‌లో ఉంటోందని...నువ్వు తన వద్ద ఉండొచ్చని చెబుతుంది. నువ్వు ఆ ఇంట్లో ఎంత బాధపడున్నావో అర్థమవుతుందని...అంటుంది. ఐదుగురు మగవాళ్లు ఉండే ఇంట్లో నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావోనని అనగా....మహా వాళ్ల వదనిపై గట్టిగా కోప్పడుతుంది. ఇక్కడ నాకు ఎలాంటి కష్టాలు బాధలు లేవని...నిజం చెప్పాలంటే మన ఇంట్లోఉన్నదానికన్నా చాలా ప్రేమగా చూసుకుంటున్నారని చెబుతుంది.నువ్వు అనవసరంగా లేనిపోనివి చెప్పొద్దంటూ ఫోన్ పెట్టేస్తుంది.
 
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget