అన్వేషించండి

Podharillu Serial Today January 27th:నిహారిక వాళ్ల ఇంట్లో తలదాచుకున్న మహాలక్ష్మీ.. చక్రిని ఇక తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పిన మహా....ఇప్పుడు చక్రి పరిస్థితి ఏంటి...?

Podharillu Serial Today Episode January 27th: నిహారిక వాళ్ల ఇంట్లో తలదాచుకున్న మహాలక్ష్మీ.. చక్రిని ఇక తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పిన మహా....ఇప్పుడు చక్రి పరిస్థితి ఏంటి...?

Podharillu Serial Today Episode: తండ్రి ప్రతాప్‌ను చూసేందుకు  ఆస్పత్రికి వచ్చిన మహాకు అ‌న్ని అవమానాలే ఎదురవుతాయి. చివరకు వాళ్ల అమ్మకూడా  తండ్రిని చూడటానికి అంగీకరించదు. దీంతో వదిన నిహారిక ఆమెను బయటకు తీసుకొచ్చి బుజ్జగిస్తుంది. ఇప్పుడు వీళ్లు ఉన్న కోపంలో మీనాన్నను చూడటం సాధ్యం కాదని...నువ్వు వెళ్లి మా ఇంట్లో ఉండమని చెబుతుంది. సమయం చూసుకుని నేనే నీకు కబురు చేస్తానని ఒప్పిస్తుంది. నేను మా అమ్మానాన్నకు అన్ని విషయాలు చెప్పానని నిన్ను ఇంట్లోకి రానిస్తారని చెబుతుంది. దీంతో చక్రి, మహా ఇద్దరూ నిహారిక వాళ్ల పుట్టింటికి వెళ్తారు.
               మహా రావడం చూసిన నిహారిక తల్లిదండ్రులు....నువ్వు ఒక్కదానివే లోపలికి రావాలని  ఆ అబ్బాయి వస్తే మాత్రం వెళ్లిపోండని ముఖానే చెబుతారు. దీంతో మహా చక్రిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం ఎంతో అవసరమని...మానాన్న కోలుకోగానే ఆయనకు  నిజం చెప్పేస్తానని తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారని అంటుంది. నేను చేసిన పనికి వీళ్లు ఎలా అవమానిస్తారో నాకు బాగా తెలుసుని నాకోసం మీరు అవమానాలు పడటం ఇష్టం లేదని చెబుతుంది. వాళ్లు నిన్ను లోపలికి రావొద్దని అన్నందుకు ఏమీ అనుకోవద్దని చెబుతుంది.  మానాన్న నన్ను అర్థం చేసుకున్న తర్వాత బహుశా నేను అక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇక మీరు వెళ్లిపోండని అంటుంది.

మనకు జరిగింది నిజం పెళ్లి కాదు కాబట్టి నేను ఇదే విషయాన్ని మా నాన్నుకు చెప్పి ఒప్పిస్తానని అంటుంది. మీ ఇంట్లో వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారని...మీ అన్నయ్యుకు కూడా థ్యాంక్స్‌ చెప్పమని చెబుతుంది. వీలుచూసుకుని వచ్చి మీ ఇంట్లో ఉన్న నా బట్టలు తెచ్చుకుంటానని చెబుతుంది. వీళ్లు నీకు ఏమైనా హాని తలపెడతారేమోనని చక్రి భయపడతాడు. మీ అన్నయ్య అసలే కోపంగా ఉన్నాడని ఎందుకైనా మంచిది నేను ఇక్కడే ఉంటానని అంటాడు. నువ్వు ఇక్కడే ఉంటే...మనకు జరిగింది ఉత్తిత్తి పెళ్లి అని వీళ్లు నమ్మరని....నిన్ను శాశ్వతంగా వదిలేసి వచ్చానంటేనే నమ్ముతారని మహాలక్ష్మీ అంటుంది. నాకు ఏం జరగదని కన్నకూతురుని చంపేంత దుర్మార్గుడు మానాన్న కాదని అని చెప్పి చక్రిని అక్కడి నుంచి పంపించేస్తుంది.
                       

మహా ఒక్కరోజులోనే ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఊరివాళ్లతో పాటు మాధవ్ వద్ద పనిచేసేవాళ్లు కూడా నిలదీస్తారు. మీ అత్తపెట్టిన శాపం నిజమయ్యేలా ఉందని అందరూ అనుకుంటున్నారని...మీ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి ఒక్కరోజులోనే వెళ్లిపోయిందని అనుకుంటున్నారని అంటారు. ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ల నాన్న కూడా ఇదే మాట అంటాడు. బయట ముఖం చూపించుకోలేకుండా  ఉన్నామని అంటాడు. అసలు ఈ చక్రిగాడు నిజంగానే ఆ అమ్మాయి ఇష్టంతోనే పెళ్లిచేసుకున్నాడా అని అంటాడు. ఆఅమ్మాయి కూడా  ఇష్టంతోనే వచ్చిన సంగతి చూశాం కదానాన్న అని మాధవ్ బదులిస్తాడు. అయితే ఈ ఊరి జనాలు మొత్తానికి తెలిసేలా...ఆ  అమ్మాయి మన ఇంట్లో ఉండటానికే వచ్చిందని అర్థమయ్యేలా పెద్ద రిసప్షన్‌ పెట్టండని అంటాడు. వాళ్ల నాన్న చెప్పింది కూడా బాగానే ఉందని మాధవ్‌,కేశవ్‌ అనుకుంటారు.


                      నిహారిక మహాకు ఫోన్ చేసి మీనాన్నకు ఆరోగ్యం బాగానే ఉందని....ప్రాణాపాయం తప్పిందని చెబుతుంది. ఇప్పుడే స్పృహలోకి వచ్చారని అంటుంది. దీంతో మహా కొంచెం  ఊరట చెందుతుంది. రేపు ఉదయం మీ అన్నయ్య ఆఫీసుకు వెళ్లిపోతారని అప్పుడు మామయ్య దగ్గర నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నువ్వు వచ్చి మీ నాన్నతో మాట్లాడమని చెబుతుంది. దీనికి మహా సరేనంటుంది. ఉదయం వెళ్లిన చక్రి ఫోన్ చేయకపోయేసరికి  మాధవ్ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇక్కడ అంతా బాగానే ఉందని చక్రి అంటాడు. ఊరిలో వాళ్లు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారని...కాబట్టి నువ్వు మహాతోనే తిరిగి రావాలని గట్టిగా చెబుతాడు. మహా ఏం చెప్పిందో అన్నయ్యకు చెప్పలేక చక్రి సతమతమవుతుంటాడు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari kodalu kanaka mahalakshmi serial today April 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పూజకి ముత్తుయిదువులు లేకుండా చేసిన సహస్ర! సాక్ష్యాత్తు అమ్మవారే కరుణిస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ పూజకి ముత్తుయిదువులు లేకుండా చేసిన సహస్ర! సాక్ష్యాత్తు అమ్మవారే కరుణిస్తుందా!
Nindu Manasulu Serial Today April 4th: నిండు మనసులు: నాకు ఈ తాళి వద్దు.. ఈ పెళ్లి వద్దు.. సిద్ధూతో తేల్చేసిన ప్రేరణ! సిద్ధూ ప్రేరణని ఒప్పిస్తాడా!
నిండు మనసులు: నాకు ఈ తాళి వద్దు.. ఈ పెళ్లి వద్దు.. సిద్ధూతో తేల్చేసిన ప్రేరణ! సిద్ధూ ప్రేరణని ఒప్పిస్తాడా!
chinni serial today April 4th: చిన్ని సీరియల్: దేవాకి షాక్ ఇచ్చిన చిన్ని! మ్యాడీ మనసులో మళ్లీ చిన్నిపై మొదలైన ప్రేమ!
చిన్ని సీరియల్: దేవాకి షాక్ ఇచ్చిన చిన్ని! మ్యాడీ మనసులో మళ్లీ చిన్నిపై మొదలైన ప్రేమ!
Illu Illalu Pillalu Serial Today April 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, ప్రేమల కాళ్లు పట్టుకున్న వల్లీ! రెచ్చిపోయిన భాగ్యం.. 10 రోజుల గడువు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, ప్రేమల కాళ్లు పట్టుకున్న వల్లీ! రెచ్చిపోయిన భాగ్యం.. 10 రోజుల గడువు!
Advertisement

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Embed widget