Podharillu Serial Today January 26th:కన్నతండ్రిని చూసేందుకు పరుగున ఇంటికి వచ్చిన మహాకు ఎలాంటి అవమానం ఎదురైంది..? ఆస్పత్రిలో మహాను తల్లి ఏమని నిలదీసింది..?
Podharillu Serial Today Episode January 26th: కన్నతండ్రిని చూసేందుకు పరుగున ఇంటికి వచ్చిన మహాకు ఎలాంటి అవమానం ఎదురైంది..? ఆస్పత్రిలో మహాను తల్లి ఏమని నిలదీసింది..?

Podharillu Serial Today Episode: ఆస్పత్రిలో ఉన్న తండ్రిని చూడటానికి వెళ్తున్న మహా కారులో చక్రితో గొడవపడుతుంది. నీవల్లే ఇదంతా జరిగిందని మండిపడుతుంది. పెళ్లి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెత్త సలహా ఇవ్వడమేగాక...మావాళ్లు వెంటపడుతుంటే పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లావని...అక్కడ నన్ను ఆలోచించుకోనివ్వకుండా పెళ్లి చేసుకున్నావని మండిపడుతుంది. ఇదంతా నీవల్లే జరిగిందని కోప్పడుతుంది. లేకుంటే మానాన్న ఇవాళ ఇలా ఆస్పత్రిలోఉండేవాడు కాదని అంటుంది. మీకు మంచి చేద్దామని చూస్తే....నన్ను అంటారేంటని చక్రి అంటాడు. నాకు ఏమైనా తెలుసా ఇలా జరుగుతుందని అంటాడు.దీంతో మహా అతనికి సారీ చెబుతుంది. కోపంలో అలా అన్నానని సముదాయించుకుంటుంది.
చక్రిని తీసుకుని మహా నేరుగా వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని చక్రి ఆమెతో అంటాడు. వాళ్లిద్దరూ గుమ్మంలోపలకి గడుగుపెడుతుండగా...ఆది వచ్చి అడ్డుకుంటాడు. ఎంత ధైర్యం ఉంటే వీడిని తీసుకుని ఇంటికి వస్తావని మహామీద కోప్పడతాడు. నాన్నకు ఎమైందని అడిగితే....నువ్వుచేసిన వెదవపనికి సొసైటీలో ముఖం చూపించలేక, పరువుపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని చెబుతాడు. మమ్మల్ని కాదనుకుని ఆ డ్రైవర్‌తో లేచిపోయినదానివి మళ్లీ ఏం ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చావని ఆది అంటాడు. నీవల్లే మానాన్న చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంతలో చక్రి కలుగజేసుకునే ప్రయత్నం చేయగా....ఆది చక్రిని కొడతాడు. నీవల్లే ఇదంతా జరిగిందని ...మా ఇంటి గేటు ముందు కూడా ఉండే అర్హతలేని వాడివి మా ఇంటికి వస్తావా అని మండిపడతాడు. దీంతో చక్రికి కూడా కోపం వస్తుంది. పోలీసుస్టేషన్ నుంచి చూస్తున్నానని అందరూ నన్నే కొడుతున్నారేంటని తిరగబడతాడు. ఇద్దరూ కొట్టుకుంటుండగా....బంధువులంతా వచ్చి విడదీస్తారు. డ్రైవర్‌తో లేచిపోయినదానివి మళ్లీ ఎందుకు వచ్చావని అందరూ తిడతారు. మళ్లీ జన్మలో ఈ గుమ్మంలో అడుగుపెట్టవద్దని చెప్పడంతో చక్రి మహాను తీసుకుని ఆస్పత్రికి బయలుదేరతాడు
మహావాళ్లు బయటకు వెళ్తుండగా....భూషణ్ అక్కడికి వస్తాడు. చక్రిని చూసి కోపంతో రగిలిపోతాడు. మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని నిలదీస్తాడు. నన్నుకాదనుకుని ఈరౌడీ వెంట వెళ్లినందుకు బాగా జరిగిందని మహాను నిందిస్తాడు. నాతో పోల్చుకుంటే వీడి ఎందులో ఎక్కువా అని నిలదీస్తాడు. ఇప్పటికీ మించిపోయింది లేదని....వాడు కట్టిన తాళి తీసిపడేసి వస్తే నేను పెళ్లిచేసుకుంటానని అంటాడు. దీంతో మహా వాడి చెంప పగులగొడుతుంది. నీకు సిగ్గులేదా అని నిలదీస్తుంది. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టనంత వరకు నేను మహారాణిలా ఉన్నానని....నీ దరిద్రపు పాదం పెట్టిన తర్వాతే మా ఇంటికి దరిద్రం పట్టిందని అంటుంది. నువ్వు రావడం వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయని మండిపడుతుంది. నీకు ఇంకా సిగ్గులేకుండా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వీడితో మనకు మాటలు ఏంటని చెప్పి మహాను తీసుకుని చక్రి ఆస్పత్రికి వెళ్లిపోతాడు.ఇంత జరిగినా దీనికి బుద్ది రాలేదని భూషణ్ అనుకుంటాడు.
ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ప్రతాప్‌ను చూసేందుకు మహా పరుగుపరుగునా వెళ్తుంది.అక్కడే ఉన్న వాళ్ల అమ్మ మహాను అడ్డుకుంటుంది.ఏం ముఖం పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చావని నిలదీస్తుంది. నా భర్త ప్రాణాలు తీసేంత వరకు వదిలిపెట్టవా అని అంటుంది. ప్రతిరోజూ డ్రైవర్‌కు అన్నం పెడుతుంటే...నీలో ఎంత మంచి గుణం ఉందో అనుకున్నానని....కానీ నువ్వు వాడితో లేచిపోతావని అనుకోలేదని అంటుంది. నేను ఏ తప్పు చేయలేదని మహా చెబుతున్నా ఆమె వినదు. పోలీసుస్టేషన్‌లో నువ్వు చేసిన అవమానం చాలని...ఇప్పుడు నిన్ను చూస్తే మీనాన్న నిజంగానే చనిపోతాడని దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని అంటుంది. నిహారిక మహాను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోతుంది.























