అన్వేషించండి

Podharillu Serial Today January 22nd: మహాతో చక్రికి ఫస్ట్‌నైట్ జరుగుతుందా...? మహా తనను ఇష్టపడే పెళ్లి చేసుకుందని అన్నదమ్ములకు చక్రి అబద్ధం ఎందుకు చెబుతాడు...?

Podharillu Serial Today Episode January 22nd: మహాతో చక్రికి ఫస్ట్‌నైట్ జరుగుతుందా...? మహా తనను ఇష్టపడే పెళ్లి చేసుకుందని అన్నదమ్ములకు చక్రి అబద్ధం ఎందుకు చెబుతాడు...?

Podharillu Serial Today Episode: చక్రి ఫస్ట్‌నైట్‌కు  అన్ని ఏర్పాట్లు చేసి తీసుకెళ్లి అతనికి చూపిస్తారు అన్నదమ్ముులు. మంచం నిండా మల్లెపూవులు,  అగరబత్తిలు వాసనలు, పండ్లు,స్వీట్లు తెచ్చిపెడతారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కేశవ్‌ చక్రిని అడుగుతాడు. అది చూసి చక్రి అదిరిపడతాడు. పెళ్లి అంటేనే అగ్గిమీద గుగ్గిలంలా మహా ఎగురుతోందని...ఇప్పుడు ఈ ఫస్ట్‌నైట్‌ అంటే ఇక నన్ను బతకనివ్వదని అనుకుంటాడు. వాడి ముఖం వాడిపోయినట్లు  ఉండేసరికి ఏమైందని మాధవ్ అంటాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు తీసివేయండని  చక్రి అనడంతో ఏమైందని వాళ్లు అడుగుతారు. భూషణ్‌తో పెళ్లి ఇష్టం లేక  మహా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని....పోలీస్‌స్టేషన్‌లో  వాళ్ల నాన్నతో, అన్నతో పెద్ద గొడవ జరిగిందని చెబుతాడు. వాళ్ల కుటుంబాన్ని తను ఇక ఎప్పటికీ కలుసుకోలేదన్న  బాధలో తను ఉంటే....ఇప్పుడు  ఈఫస్ట్ నైట్‌ అంటే ఎలా అని అంటాడు.  చక్రి చెప్పిన దానిలో కూడా  నిజం ఉందని కేశవ్‌ అంటాడు. ఇప్పుడు తను ఉన్న బాధలో  ఇలాంటి ఏర్పాట్లు సరి కాదని అంటాడు.  తను చూసేసరికి ఇవన్నీ తీసివేయండని చెప్పి చక్రి వెళ్లిపోతాడు.
                     అన్నదమ్ములంతా  పడుకోవడానికి చాప, దుప్పట్లు వేసుకుంటుంటే  మహా  అక్కడికి వస్తుంది. మాధవ్‌ఆమెను గదిలోకి తీసుకెళ్లమని చెప్పడంతో ఒక్కసారిగా  ఉలిక్కిపడుతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా....తటపటాయిస్తూనే   చక్రి ఆమెను గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ మల్లెపువ్వుల వాసన , పూలు చూసి ఏం  జరిగిందని  మహా నిలదీస్తుంది. మా వాళ్లు రూమ్‌ఫ్రెషనర్‌ కొట్టారని అబద్ధం చెబుతుంది. రేపు పొద్దున్నే నన్ను హాస్టల్‌లో దిగబెట్టాలని మహా హెచ్చరిస్తుంది. అలాగే మీ వాళ్లకు కూడా నిజం చెప్పమని చెబుతుంది. సరేనంటూ  చక్రి తలుపులు దగ్గరకు వేసి వెళ్లివాళ్ల  అన్నదమ్ముల మధ్య పడుకుంటాడు. తమ పక్కన ఎవరో ఉన్నారని మెలుకువ వచ్చిన కన్నా నిద్రలేచి అందరినీ నిద్రలేపుతాడు. చక్రిని చూసి నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చి పడుకున్నావ్ అని వాళ్లు నిలదీస్తారు. తను చాలా బాధలో ఉందని...పైగా నిన్నటి నుంచి ఛేజింగ్‌లు, గొడవలతో అలసిపోయిందని  అందుకే ప్రశాంతంగా పడుకోమని చెప్పి వచ్చానని అబద్ధం చెబుతాడు. వాడు  చెప్పిన మాటలు  కేశవ్‌కు నమ్మబుద్ధి కాదు. నిజం చెప్పమని నిలదీస్తాడు. నిజంగా అదేనని చెబుతాడు. అసలు మీ లవ్‌స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పమని చిన్నా అడగడంతో  చక్రి అన్నీ అబద్ధాలు చెబుతాడు. తనను చూసి ఇష్టపడే భూషణ్‌తో  మహా పెళ్లి వద్దనుకుందని  చెబుతాడు. తను ఇష్టపడే నాతో వచ్చేసిందని అంటాడు. మీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ....వాళ్ల నాన్న ఛేజింగ్‌తో పోలీసులు మా పెళ్లి చేశారని చెబుతాడు. వాళ్ల ఇంట్లో వాళ్లతో జరిగిన గొడవ కారణంగానే  తను కొంచెం నెర్వస్‌గా ఉందని...కొద్దిరోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయని అంటాడు.
                             మహా గదిలో లైట్లు వెలుగుతుండటంతో చక్రి అక్కడికి వెళ్లి తలుపుతీస్తాడు. ఇంకా నిద్రపోలేదేంటని అడుగుతాడు.  తలుపుకి గొళ్లెం లేకుండా ఎలా పడుకుంటానని అంటుంది. ఐదుగురు మగవాళ్లు బయట ఉన్నప్పుడు  మీరు కొంచెం భయపడటంలో  తప్పులేదని....కాకపోతే మీరు నిశ్చింతగా పడుకోవచ్చని చెబుతాడు. మిమ్మల్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతకన్నా జాగ్రత్తగా చూసుకుంటామని చెబుతాడు. బయట నలుగురు సెక్యూరిటీగార్డులు  ఉన్నారనుకుని  పడుకోమని చెబుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
Podarillu Serial Today August 5th:మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
Karthika Deepam 2 Serial Today August 5th: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget