అన్వేషించండి

Podharillu Serial Today January 15th: పోలీసుుస్టేషన్‌లో మహా,చక్రికి పెళ్లి...? కోపంతో వెళ్లిపోయిన ప్రతాప్‌, భూషణ్‌...?

Podharillu Serial Today Episode January 15th: ఈ గండం నుంచి గట్టెక్కాలంటే మీరు ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని ఎస్‌ఐ మహా, చక్రికి సూచిస్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ ఏం చేశారు..?

Podharillu Serial Today Episode:  మహాను చివరిసారిగా  ఒప్పించేందుకు  ప్రతాప్ ప్రయత్నిస్తాడు.  కన్నీళ్లుపెట్టుకుని బ్రతిమలాడతాడు.  దీంతో కరిగిపోయిన మహా నాన్నా అంటూ వెళ్లి అతిని గుండెలపై వాలిపోతుంది. మనం ఇంటికి వెళ్లిపోదాం పదమ్మా అంటూ ప్రతాప్‌ బుజ్జగిస్తాడు. మీరు భూషణ్‌తో  పెళ్లి చేయమని స్టేషన్‌లో  రాసిఇస్తే  సంతోషంగా మీ వెంట వస్తానని అంటుంది. దీనికి ప్రతాప్ ససేమిరా అంటాడు. అయితే నేను  ఇంటికి రావడం కూడా కుదరదని తెగేసి చెప్పేస్తుంది. వీళ్లంతా కలిసి  మహా మనసు మార్చి మాయచేసి తీసుకెళ్లేలా ఉన్నారని గ్రహించిన  ఎస్‌ఐ...వెంటనే పూలదండలు, తాళి తెప్పిస్తాడు.
                   పూలదండలు  చక్రి, మహా చేతికి ఇచ్చి ఒకరి మెడలో ఒకరు వేసుకోమని  అంటారు. మహా మాత్రం ఏడుస్తూ  వాళ్ల నాన్న వైపు చూస్తుంది. ఆది కూడా చివరిసారిగా బ్రతిమలాడతాడు. నువ్వు ఈ పనిచేస్తే....నాన్న పరువుపోతుందని ఎంతో వేడుకుంటాడు. ప్రతాప్‌ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో  చక్రి మెడలో దండ వేయగా.. అతను కూడా  పూలదండ మెడలో వేసి తాళి కడతాడు. ప్రతాప్ కళ్లముందే  తన కూతురు పెళ్లి డ్రైవర్‌తో జరగడంతో కుప్పకూలిపోతాడు. మహా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా....గట్టిగా మందలిస్తాడు. నా  కూతురు కాసేపటి క్రితమే చనిపోయిందని...అంటాడు. తనను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి  గొప్ప చదువులు చదివించానని....తను కష్టపడకూడదనే  రాత్రింబవళ్లు కష్టపడి కోట్లు సంపాధించానని  ప్రతాప్‌ అంటాడు.  తన బంగారు భవిష్యత్‌ కోసమే  గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు చేస్తే....తను మాత్రం చనిపోయిందని అంటాడు. ఇప్పటి వరకు నా కూతురు భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించానని....ఇప్పుడు తనే చనిపోతే ఎవరి భవిష్యత్‌ ఏమైపోతే నాకెందుకని అంటాడు. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించవద్దని మహాను  అంటాడు. ఈ డ్రైవర్‌ తిడుతున్నాడనో...కొడుతున్నాడో, లేక తిండిపెట్టడం లేదనో  నా గుమ్మం తొక్కవద్దని చెబుతాడు. ఆది కూడా  ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించడానికి గానీ...మమ్మల్ని కలవడానికి ప్రయత్నించవద్దని  చెప్పి తన తండ్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భూషణ్‌....మహాను లాక్కెందుకు ప్రయత్నించగా...చక్రి వచ్చి వాడి చెంపపై ఒక్కటిస్తాడు. ఇప్పుడు  ఆమె తన భార్యని...ఎవడుపడితే వాడు చేయి వేయడానికి ప్రయత్నిస్తే చంపేస్తానని  హెచ్చరించడంతో  అతను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 
                         పెళ్లి అయిపోవడంతో  ఆ పెళ్లిని రిజిస్టర్‌ చేయడానికి  రిజిస్ట్రార్ వస్తాడు.  అక్కడ  చక్రి సంతకం పెట్టి మహాను కూడ సంతకం పెట్టడానికి ఎస్‌ఐ పిలుచుకుని రమ్మని చెబుతాడు. ఆమె బాధలో ఉందని....నేనే వెళ్లి సంతకం పెట్టించి తీసుకొస్తానని  చక్రి ఫైల్‌ తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు పెళ్లి రిజిస్ట్రర్ చేస్తున్నారని తెలిస్తే మహా ఒప్పుకోదని అరిచి గోల చేస్తుందని గ్రహించి...ఆమెకు అబద్ధం చెప్పి ఆ ఫైల్‌లో సంతకం పెట్టించి  తీసుకొస్తాడు. ఇంతలో పోలీసులు ఫొటోలు తీయించడానికి  కెమెరామెన్‌ను  పిలిపిస్తారు. మహా ఇవన్నీ ఎందుకని  అడిగితే పోలీసు రికార్డ్‌ కోసమేనని చెప్పి ఒప్పిస్తాడు. పెళ్లితంతు పూర్తవ్వడంతో  ఎస్‌ఐ వారిద్దరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపిస్తాడు. చక్రి తన కారులో మహాను తీసుకుని వాళ్ల ఇంటికి బయలుదేరతాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
Podarillu Serial Today NoV 21:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
పొదరిల్లు:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget