అన్వేషించండి

Podharillu Serial Today Feb 4th:చక్రి అన్నయ్యకు నిజం చెప్పేస్తానన్న మహాలక్ష్మీ...? రిసెప్షన్‌ కు వచ్చిన వారు ముందు చక్రి కుటుంబం పరువు ఏమైంది..?

Podharillu Serial Today Episode February 4th:చక్రి అన్నయ్యకు నిజం చెప్పేస్తానన్న మహాలక్ష్మీ...? రిసెప్షన్‌ కు వచ్చిన వారు ముందు చక్రి కుటుంబం పరువు ఏమైంది..?

Podharillu Serial Today Episode: రిసెప్షన్ ఏర్పాట్లు చూసి మహాకు ఎంతో కోపం వస్తుంది. ఒక్కరోజు మీ ఇంట్లో తలదాచుకున్న పాపానికి నన్ను నిజంగానే నీ భార్యను చేసేస్తున్నారని మండిపడుతుంది. వాళ్లకు  స్టేషన్‌లో జరిగింది తెలియదుకదా  అందుకే హడావుడి చేస్తున్నారని వాళ్లకు ఏ పాపం తెలియదని చక్రి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. మీ అన్నయ్యలకు అసలు బుద్ధిలేదా అని మహా అంటుంది. మనకు చెప్పకుండా ఈ ఏర్పాట్లు ఎలా చేస్తారని  అంటుంది.ఇదంతా బయట ఉన్న మాధవ్‌ వింటాడు. డోర్‌కొట్టి లోపలికి వస్తాడు. మీనాన్న గారికి తగ్గిపోయిందని తెలిసిన తర్వాతే ఈ ఏర్పాట్లు చేశామని....నీకు కొంచెం బాధగా ఉన్నా  మావాళ్లు సర్‌ప్రైజ్ చేద్దామంటే చెప్పలేదని చెబుతాడు. కొత్త బట్టలు ఇచ్చి వేసుకుని రమ్మని చెప్పి వెళ్లిపోతాడు. మాధవ్‌ ఇదంతా విన్నాడేమోనని మహా చాలా బాధపడుతుంది. చిన్నప్పపుడు నాకు మా మేనమామ ఉండేవాడని...అతను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడని....ఇన్నాళ్లు మళ్లీ అంత ప్రేమ మీ అన్నయ్య దగ్గరే కనిపిస్తోందని....అలాంటి వాళ్లను మోసం చేయడం తగదని నేను వెళ్లి నిజం చెప్పేస్తానని మహా లక్ష్మీ అంటుంది. దీనికి చక్రి అడ్డుపడతాడు. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కదా అని ఆలోచిస్తున్నానాను అంటాడు. మా అన్నయ్యలు చెప్పినా వింటారు కానీ...ఇప్పుడు వచ్చిన గెస్ట్‌లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని చక్రి అంటాడు. రేపటి నుంచి మమ్మల్ని అందరూ నానా రకాల మాటలు అంటారని....మేం ఊరిలో తలెత్తుకుని తిరగలేమని అంటాడు. మా అన్నయ్య పరువు మొత్తం పోతుందని చెబుతాడు.కాబట్టి మనం కొంచెంసేపు భార్యాభర్తల్లా నటించక తప్పదని చెబుతాడు.
                   

ఇప్పుడు నేను వచ్చి మీ పక్కన నిల్చుంటే నిజంగానే భార్యను అయిపోతానని అది నావల్ల కాదని మహా అంటుంది.మనం అగ్నిసాక్షిగా పెళ్లిచేసుకోలేదని....మనకు జరిగింది పెళ్లే కాదని అంటుది. ఒక అమ్మాయి తన మనసుకు నచ్చకుండా ఏ అబ్బాయిని భర్తగా ఊహించుకోలేదని చెబుతుంది.  అందరి ముందు నేను మీ భార్యగా ముద్రపడటం నా వల్లకాదని అంటుంది. మీరు వెళ్లి చెబుతారా....లేక నేనే వెళ్లి చెప్పమంటారా అని అంటుంది.మా ఇంట్లో ఆడపిల్లలు లేరని....వాళ్లు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియక ఇలా జరిగిందని అంటుంది. మీరు ఇక్కడే ఉండండని నేనే వెళ్లి మావాళ్లకు చెప్పి చూస్తానని చెబుతాడు.

బయట వాళ్ల అత్త, పెదనాన్నను చూసిన మాధవ్‌ వాళ్లను సాదరంగా ఆహ్వానిస్తాడు. కూర్చోమని చెబుతాడు.మేం మీఇంట్లో ఫంక్షన్ చూడటానికి రాలేదని....మీరు ఎలా నవ్వులుపాలవుతుంటే చూసి ఆనందించడానికి వచ్చామని చెబుతారు. ఇంతలో రెడీ అవ్వకుండా బయటకు వచ్చిన చక్రిని చూసి మాధవ్, కేశవ్‌ నిలదీస్తారు. నువ్వు వెళ్లి త్వరగా స్నానం చేసి రమ్మని చెప్పి తొందరపెడతారు. ఇంతలో వచ్చిన జనంలో  ఒకరు ఫోన్‌లో వచ్చిన న్యూస్‌ చూస్తారు.అందులో చక్రి, మహాకు పెళ్లి జరిగినట్లు వచ్చిన వార్త  ఉంటుంది. అది చూసి కేశవ్ ఎంతో సంతోషిస్తాడు. అందిరికి చూపించి ఇదిలో...మా అన్నయ్యకు పెళ్లి కాలేదని మాట్లాడుకుంటున్న వారందరికీ ఇదే సాక్ష్యమమంటూ చూపిస్తాడు.
                             

ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది. ఏంటి బట్టలు వేసుకోలేదని చక్రిని అడిగితే మహా రూమ్‌లో ఉన్నాయని చెబుతాడు. తాను వెళ్లి తీసుకొస్తానని వెళ్లి తీసుకొచ్చి ఇస్తుంది. పెళ్లికూతురుని రెడీ చేస్తానంటూ మళ్లీ మహారమ్‌లోకి వెళ్లి హడావుడి చేస్తుంది. దీంతో మహాకు కోపంవచ్చి బయటకు వెళ్లిపొమ్మని గట్టిగా అరుస్తుంది. బయటకు వచ్చిన గాయత్రి ఎంతో బాధపడుతుంది. అసలు ఆ అమ్మాయి రెడీ అయ్యి ఈ ఫంక్షన్‌కు వచ్చేలా లేదని మాధవ్‌కు చెబుతుంది. వాళ్ల నాన్న ఆస్పత్రిలో ఉన్నాడన్న కంగారులో ఉందని అందుకే అలా ప్రవర్తిస్తుందేలే అని సర్దిచెబుతాడు.

ఇప్పుడు గానీ ఈ ఫంక్షన్‌ ఆగిపోతే చూడటానికే  మా అమ్మ, పెదమామయ్య వచ్చారని.....ఇక మీరు జీవితాంతం వాళ్లను భరించలేని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో చక్రి మళ్లీ లోపలికి వెళ్తాడు.ఎందుకు మీ అన్నయ్యలకు చెప్పలేదని మహా అతనిపై మండిపడుతుంది. ఒక్కసారి బయటకు వచ్చి నువ్వే చూడని....ఈ సమయంలో అసలు నేను ఈవిషయం చెప్పలేకపోతున్నానని అంటుంది. అయితే నేనే వచ్చి మీ అన్నయ్యకు చెబుతానంటూ  మహా బయటకు వెళ్లబోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
Podarillu Serial Today August 5th:మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
Karthika Deepam 2 Serial Today August 5th: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget