అన్వేషించండి

Podharillu Serial Today December15th:మహాకు పెళ్లికొడుకు నచ్చకపోయినా...ఇంట్లో వాళ్లు పెళ్లి ఫిక్స్‌ చేసేశారా..? తండ్రికి మహా తన మనసులో మాట చెప్పేసిందా..?

Podharillu Serial Today Episode December15th: పెళ్లికొడుకు నచ్చలేదని మహా చెప్పినా కూడా మంచి సంబంధం అంటూ ప్రతాప్‌ పెళ్లి ఖరారు చేస్తాడు.అటు మాధవ్‌తో మాట్లాడుతున్న గాయత్రిపై తాయర్ మండిపడుతుంది.

Podharillu Serial Today Episode: పెళ్లి చూపులకు ఆడవాళ్లు లేకుండా వెళ్లడంతో ఆడపెళ్లి వారు అడిగిన మాటలకు నారాయణతోపాటు  ఆయన కొడుకులు చాలా బాధపడుతుంటారు. అటు పెళ్లి కొడుకుక్కి మహా నచ్చడంతో ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడిపోతుంటారు. మొదటి పెళ్లిచూపుల్లోనే  ఓకే అవ్వడంతో వారు మహాకి కంగ్రాట్స్‌ చెబుతారు. దీంతో మహా చిరాకుపడిపోతుంది.అతనికి నేను నచ్చితే సరిపోతుందా...నాకు పెళ్లికొడుకు నచ్చాల్సిన పనిలేదా అని నిలదీస్తుంది.అబ్బాయికి ఏం తక్కువ అమ్మా అంటూ  ప్రతాప్‌ అడుగుతాడు. నాకు పెళ్లికొడుకు ఏమాత్రం నచ్చలేదని చెబుతుంది. వాడికి భార్య అంటే బానిసగా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడని....అతను ఏమాత్రం నచ్చలేదని చెబుతుంది. మంచి కుటుంబం,ఆస్తిపాస్తులు,ఉద్యోగం అన్నీ బాగున్నాయని తండ్రి ప్రతాప్‌ మహాకి నచ్చబెబుతాడు. మనకన్నా చాలా రిచ్‌గా బతకొచ్చని వివరిస్తాడు. అతనికి ఉద్యోగం చేసే భార్య అవసరం లేదంటా అని మహా చెప్పగా...అంత ఆస్తి ఉండగా ఉద్యోగం చేయాల్సిన ఖర్మ ఏంటమ్మా అని అంటాడు. నా చదవు, గోల్డ్‌మెడల్‌ అన్నింటికీ అర్థం లేకుండా పోతాయని ఆమె బాధపడుతుంది. చిన్నపిల్లవి నీకు అన్ని విషయాలు తెలియవని ఆమె తండ్రి సర్దిచెబుతాడు. అబ్బాయికి సెలవులు లేని కారణంగా  వచ్చే నెలలోనే పెళ్లి చేయాలంటూ ప్రతాప్‌ చెబుతాడు. పెళ్లి మండపం కూడా బుక్‌ చేశామని చెబుతారు. పెళ్లి పనులు మొదలుపెట్టాలంటూ అందరూ వెళ్లిపోతారు. ఏదీ ఏమైనా సరే ఈపెళ్లి మాత్రం చేసుకోకూడదని మహా ఫిక్స్‌ అవుతుంది.
   
                             సరకులు తీసుకుని వెళ్తున్న మాధవ్‌ను  గాయత్రి అడ్డగిస్తుంది. పెళ్లి చూపుల తంతు ఏమైందని అడుగుతుంది. నాకు అమ్మాయి బాగా నచ్చిందని చెప్పడంతో కోప్పడుతుంది. నేను నిన్ను చేసుకుందామని అనుకుంటుంటే...నువ్వు పెళ్లిచూపులకు ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగానే వాళ్ల అమ్మ అక్కడికి కర్రపట్టుకుని వస్తుంది. గాయత్రిని కొట్టబోతుండగా....మాధవ్‌ ఆపుతాడు. నా కూతురుకు మాయమాటలు చెప్పి పెళ్లిచేసుకోవాలనుకుంటున్నావా అని మాధవ్‌పై  వాళ్ల అత్త మండిపడుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా..ఆ ఇంట్లో అడుగుపెట్టనివ్వనంటుంది. మళ్లీ నా కూతురితో మాట్లాడినట్లు తెలిస్తే....మీ పరువుతీస్తానని చెప్పి తన కూతురుని లాక్కుని వెళ్తుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా  గాయత్రిపై మండిపడుతుంది. మాకు లేని చుట్టరికాలు నీకు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పెళ్లికావాల్సిన పిల్లవి...వీధుల్లో మగాళ్లతో మాట్లాడితే ఏం అనుకుంటారో తెలుసా అని నిలదీస్తుంది. ఇప్పటికే మంచి సంబంధాలన్నీ వచ్చి వెనక్కి పోతున్నాయని బాధపడుతుంది. ఇంకోసారి వాడితో మాట్లాడినట్లు చూసినా...ఆఇంటికి వెళ్లినట్లు తెలిసినా నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి దుబాయికి పంపిస్తానని బెదిరిస్తుంది.

                              మహా ఒంటరిగా కూర్చుని బాధపడుతుండటంతో తండ్రి ప్రతాప్‌ ఆమె వద్దకు వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నేనంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు...నా ఇష్టాలు పట్టించుకోవా అని నిలదీస్తుంది. నిన్ను వదిలి నేను కూడా ఉండలేను...కానీ  పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకోలేను కదా అని అంటాడు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దని...పెళ్లికి నేనే రెడీగా లేనని చెబుతుంది. నేను మీతో ఓ విషయం చెప్పాలి నాన్న అంటుంది. పెళ్లి పేరుతో నా గోల్‌ వదిలేయలేనని అంటుంది. ప్రాజెక్ట్‌ ఓకేలా అయ్యేలా ఉందని...అది పూర్తయితే మంచి ఇంజినీర్‌గా  పేరు వస్తుందని చెప్పడంతో  ప్రతాప్ ఊపిరి పీల్చుకుంటాడు. ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెబుతుందేమోనని భయపడతాడు. పెళ్లయి కెనడాకు వెళ్లి తర్వాత నీ భర్తను ఒప్పించి ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్‌ చేయవచ్చని చెబుతాడు.ఆ మూర్ఖుడు  ఒప్పుకోడు నాన్న అని అంటుంది. ఈ విషయంలో నువ్వు ఏం ఆలోచించకని...నేను వాళ్లకు మాట ఇచ్చానని ప్రతాప్ చెబుతాడు. పెళ్లి బట్టలు కొనేందుకు అబ్బాయితో కలిసి హైదరాబాద్‌ వెళ్లాలని..అన్న, వదిన కూడా వస్తారని చెబుతారు. ఈ ట్రిప్‌లో అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చని చెప్పి వెళ్లిపోతారు. నేను ఇంత సీరియస్‌గా చెబుతున్నా....వీళ్లు వినడం లేదేంటి అని  మహా బాధపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 20: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget